


Best Web Hosting Provider In India 2024

OTT Comedy: రూ.120కోట్ల బ్లాక్‍బస్టర్ కామెడీ డ్రామా మూవీ ఓటీటీ రిలీజ్‍పై లేటెస్ట్ బజ్.. ఆరోజే రానుందా!
OTT Comedy Drama: డ్రాగన్ చిత్రం థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయింది. తెలుగులోనూ రిలీజ్ అయి మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు రానుందో రూమర్లు బయటికి వచ్చాయి.

లవ్‍టుడే ఫేమ్, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో ఈ తమిళ కామెడీ డ్రామా మూవీ వచ్చింది. ఫిబ్రవరి 21వ తేదీన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. పాజిటివ్ టాక్‍తో అదరగొడుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంటూ బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍పై తాజాగా రూమర్లు వచ్చాయి.
స్ట్రీమింగ్ అప్పుడేనా!
డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ మూవీని మార్చి 28వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా సమాచారం వెల్లడైంది.
వారం ఆలస్యం!
డ్రాగన్ మూవీని ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 21నే తీసుకురావాలని నెట్‍ఫ్లిక్స్ అనుకుందని టాక్ వచ్చింది. అయితే, థియేట్రికల్ రన్ బాగా కొనసాగుతుండటంతో వారం ఆలస్యంగా ఓటీటీ స్ట్రీమింగ్ ఉండాలని మేకర్స్ అనుకుంటున్నారని తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మార్చి 28వ తేదీన నెట్‍ఫ్లిక్స్ పరిశీలిస్తోందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
డ్రాగన్ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్‍కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ నటించారు. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ అశ్విన్ మరిముత్తు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. డ్రాగన్ మూవీలో గౌతమ్ మీనన్, మిస్కిన్, వీజే సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్ కీలకపాత్రలు పోషించారు.
డ్రాగన్ మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. లవ్ టుడేతో హీరోగా మారిన డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్.. డ్రాగన్‍లోనూ అదరగొట్టారు. తన మార్క్ కామెడీ టైమింగ్‍తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది.
రూ.120కోట్లు దాటి..
డ్రాగన్ మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.120కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును ఈ చిత్రం దాటేసింది. దాదాపు రూ.35కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ ఆ రేంజ్ భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. ఇంకా జోరుగా వసూళ్లు వస్తున్నాయి.
డ్రాగన్ సినిమాను కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ నిర్మించారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకు ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం