


Best Web Hosting Provider In India 2024

Priyadarshi: నేను కోటేసుకున్న ప్రతిసారి బ్యాట్‌మెన్‌లా ఫీల్ అయ్యా.. బలగం హీరో ప్రియదర్శి కామెంట్స్
Priyadarshi About Court State Vs A Nobody Movie: బలగం సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఇటీవల నిర్వహించిన కోర్ట్ ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Priyadarshi About Court State Vs A Nobody Movie: పెళ్లి చూపులు సినిమాలో కమెడియన్‌గా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను మన్ననలు పొందాడు కమెడియన్ ప్రియదర్శి. మల్లేశం సినిమాతో హీరోగా మారి మొదటి చిత్రంతోనే మంచి ప్రశంసలు అందుకున్నాడు.
నవ్విస్తూనే మరోవైపు
ఆ తర్వాత బలగం వంటి సూపర్ హిట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో మరింతగా కట్టిపడేశాడు ప్రియదర్శి. ఓవైపు కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్విస్తూనే మల్లేశం, బలగం, డార్లింగ్ వంటి సినిమాలతో హీరోగా మెప్పించాడు. ఇప్పుడు ప్రియదర్శి మరోసారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ.
కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని సమర్పించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం మార్చి 14న హోలీ పండుగసందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 8న కోర్ట్ ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
బలగం తర్వాత ఎలాంటి
యాక్టర్ ప్రియదర్శి మాట్లాడుతూ.. “నాని అన్న థాంక్యూ సో మచ్. బలగం తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ సినిమా చేయమని చెప్పారు. మా టీమ్ అంతా ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నాని అన్న. ఈ సినిమాలలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ చాలా గొప్పగా చేశారు” అని అన్నాడు.
నాని తమ్ముణ్ణి అని చెప్పుకోవడం
“ఇంతమంది దర్శకులు నాని అన్న కోసం, ఈ సినిమా కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. నేను నాని అన్న తమ్ముణ్ణి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. ఈ సినిమా 14న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇది కూడా ఒక సూపర్ హీరో లాంటి కథ. కోటేసుకున్న ప్రతిసారి ఒక బ్యాట్‌మెన్‌లా ఫీల్ అయ్యా. 14న థియేటర్‌లలో కలుద్దాం. సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుందాం” అని హీరో ప్రియదర్శి తెలిపాడు.
నాని నీడలో రామ్ జగదీష్
కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “కోర్ట్ ట్రైలర్ చాల ప్రామెసింగ్‌గా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చిందనిపిస్తోంది. నాని గారు ఈ సినిమా గురించి చాలా చెప్పేవారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఎందుకు అంతలా చెప్పారో అర్థమైంది. డైరెక్టర్ రామ్ జగదీష్ నాని నీడలో ఉన్నారు. అది గొప్ప బాధ్యత. ఆయన చెయ్యి వదలమాకు. టీం అందరికీ కంగ్రాట్స్” అని చెప్పారు.
ఆడియెన్స్‌కు గుర్తుండిపోతారు
నిర్మాత దీప్తి మాట్లాడుతూ.. “నలుగురు సినిమా పిచ్చోళ్లు ఒక చోటికి చేరితే సినిమా ఎలా వస్తుందో కోర్టు అలా ఉంటుంది. జగదీష్ విజన్ స్క్రీన్ మీద ఒక పోయెట్రీ క్రియేట్ చేసింది. విజయ్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రియదర్శి చాలా అద్భుతంగా నటించాడు. రోషన్, శ్రీదేవి ఆడియన్స్‌కి గుర్తుండిపోతారు. ఇది చాలా బ్యూటిఫుల్ మూవీ. మార్చి 14న అందరూ థియేటర్లలో చూస్తారని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
సంబంధిత కథనం