

Best Web Hosting Provider In India 2024

Women Underwear Bleaching: మహిళల లోదుస్తులు ఆ రంగులోకి ఎందుకు మారతాయో తెలుసా? ఇది దేనికి సంకేతమంటే!
Women Underwear Bleaching: మీ లోదుస్తులు ఎన్ని సార్లు మార్చినప్పటికీ ఆ ప్రాంతంలో రంగు మారిపోతున్నాయా? ఇలా జరగడానికి కారణమేంటో, ఇది దేనికి సంకేతమో ఇక్కడ తెలుసుకోండి.

తరచూ నా అండర్‌వేర్ రంగు మారిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది దేనికి సంకేతం అనే ప్రశ్నలు మీ మనస్సులో ఉండే ఉంటాయి. కానీ దీని గురించి ఎవరిని అడగాలో, ఏమని అడగాలో తెలియక ఊరుకుంటున్నారా? అయితే ఇక్కడ మీకు సమాధానం దొరుకుతుంది. ఈ సమస్య మీకు ఉంటే బాధపడకండి. ఎందుకంటే చాలా మంది మహిళలు ముదురు రంగు లోదుస్తులు ధరించిన ప్రతిసారీ ఈ వింత సమస్యను ఎదుర్కొంటారు. దీని వల్ల చాలాసార్లు మహిళలు సిగ్గుపడుతుంటారు. ఏదైనా సమస్యేమో అని భయపడుతుంటారు. కానీ దీనికి కారణం తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యం పోతారు. మీలోదుస్తులు తరచూ నారింజ లేదా పసుపులో రంగులో మారడానికి కారణమేంటో ఇలా ఎందుకు జరుగుతుందో, దేనికి సంకేతమో తెలుసుకుందాం రండి..
మహిళల ప్యాంటీ ఎందుకు రంగు మారుతుంది?
మీ లోదుస్తుల్లోని కింది భాగం త్వరగా రంగు మారడానికి కారణం మీ యోని విడుదల చేసే స్రావం.అలాగే ఇది సాధారణం కూడా.కేవలం పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మీ యోని సాధారణంగా కూడా కొన్ని రకాల స్రావాలను విడుదల చేస్తుంది. ఇలా మీ లోదుస్తులు త్వరగా రంగు మారి వాటిపై నారింజ రంగు మచ్చలు ఏర్పడుతుంటే మీరు చింతించాల్సిన అవసరం కూడా లేదు. మీలో ఏదో లోపం ఉందని అనుకుంటూ లోలోపలే బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిజానికి ఇది చాలా మంచి సంకేతం.
లోదుస్తుల రంగు మారడం మంచి సంకేతమా?
లోదుస్తులు రంగు మారడం మంచి సంకేతమా? ఇది నమ్మశక్యంగా లేదే అనుకుంటున్నారా? మేము జోక్ చేయడం లేదు! యోని లోదుస్తులను బ్లీచ్ చేయడం అంటే మీ యోని ఆరోగ్యంగా ఉందని అర్థం. ఆరోగ్యకరమైన యోని సహజంగా 3.8, 4.5 మధ్య pH విలువను కలిగి ఉంటుంది అంటే ఇది ఎక్కువగా ఆమ్లంగా ఉంటుంది. దీని కారణంగానే మీ లోదుస్తులు త్వరగా రంగు మారతాయి, వీటిపై అదో రకమైన మచ్చలు కనిపిస్తాయి.
నారింజ లేదా పసుపు రంగులో ఎందుకు కనిపిస్తాయి?
నిజానికి ఆరోగ్యకరమైన యోని ఎప్పుడూ ఆమ్లంగా ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో స్రావాన్ని ఉత్పత్తి చేస్తుంది. కొన్నిసార్లు మీ హార్మోన్లు, లైంగిక జీవితం, రుతుక్రమం వంటి అనేక అంశాల కారణంగా pH స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అలాగే యోనిలో లాక్టోబాసిల్లి అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది సరైన ఆమ్ల స్థాయిలను నిర్వహించడం ద్వారా, చెడు బ్యాక్టీరియా సంక్రమణను కలిగించకుండా నిరోధించడం ద్వారా మీ యోనిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది సాధారణంగా అందిరకీ జరుగుతుంది. అండోత్సర్గము చేసినప్పుడు, అలాగే గర్భధారణ సమయంలో ఈ స్రావం పెరుగుతుంది.
ప్యాంటీ మీద ఉండే ఈ స్రావం గాలికి గురైనప్పుడు లేదా మీరు ఉతికినప్పుడు ఆక్సీకరణ కారణంగా ప్యాంటీపై పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. మచ్చలు ఏర్పడతాయి.
ఇది ఎంతవరకూ ఆరోగ్యకరం?
ప్రతిరోజూ యోని దాదాపు 4ml స్రావాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన స్రావమని గుర్తుంచుకోండి. ఇది మీ యోని స్వీయ-శుభ్రపరిచే ప్రక్రియలో భాగం! ఒకవేళ అధిక మొత్తంలో స్రావం ఉత్పత్తి అవుతుందని మీరు భావిస్తే, మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి నిర్ధారించుకోండి.
ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా?
సరే, మీ లోదుస్తులపై మచ్చలు పడటం అనారోగ్యకరం కాదు. అలాగని మీ అందమైన లోదుస్తులను మాటిమాటికీ పాడుచేసుకోవడం మీకు ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి.
ప్యాంటీ లైనర్‌లను ధరించండి:
మొదటగా, రోజంతా ప్యాంటీ లైనర్‌లను ధరించడం ద్వారా మీరు మచ్చలను నివారించవచ్చు, ఇది స్రావం మీ లోదుస్తులను తాకకుండా నిరోధిస్తుంది.
వెంటనే శుభ్రం చేయండి:
మీరు విడిచిన వెంటనే మీ లోదుస్తులను కడగవచ్చు, ఎందుకంటే మీరు దానిని మీ లాండ్రీ బుట్టలో ఉంచితే, ఆక్సీకరణ కారణంగా అది మచ్చగా మారుతుంది. మీరు మీ లోదుస్తులను కొన్ని గంటలపాటు నానబెట్టి, ఆపై ఉతకవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్