




Best Web Hosting Provider In India 2024

AP Mlc Elections : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ
AP Mlc Elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవీంద్ర, బీటీ నాయుడు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు, బీజేపీకి చేరొక సీటును కేటాయించింది.

AP Mlc Elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. మరో సీటును చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో బీజేపీకి ఒక సీటు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తమకు ఒక సీటు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు.
ఇప్పటికే జనసేనకు ఒకస్థానాన్ని కేటాయించగా, తాజాగా బీజేపీకి ఒక సీటు కేటాయించారు. దీంతో టీడీపీ మూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఈసారికి అవకాశం లేదని టీడీపీ అధిష్టానం తెలిపింది. టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రి, మాజీ మంత్రి జవహర్‌కి ఈసారికి అవకాశం లేదని టీడీపీ హైకమాండ్ తెలిపింది.
టాపిక్