




Best Web Hosting Provider In India 2024

OTT Mystery Crime Thriller: తెలుగులో మరో ఓటీటీలోకి మలయాళ బ్లాక్‍బస్టర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Mystery Crime Thriller: రేఖాచిత్రం సినిమా ఇప్పటికే ఓ ఓటీటీలో అదరగొడుతోంది. అయితే, ఈ చిత్రం తెలుగులో మరో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. స్ట్రీమింగ్ తేదీ కూడా బయటికి వచ్చింది.

రేఖాచిత్రం సినిమా థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్‍తో కమర్షియల్‍గా సక్సెస్ సాధించింది. ఈ మూవీలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రీసెంట్‍గా ఓ ఓటీటీలోకి వచ్చి భారీగా వ్యూస్ సాధిస్తోంది. అయితే, రేఖాచిత్రం తెలుగు వెర్షన్ మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..
తెలుగులో ఈ ఓటీటీలోనూ..
రేఖాచిత్రం సినిమా మూడు రోజుల కిందటే (మార్చి 6) సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోనూ అడుగుపెట్టింది. అయితే, ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోకి కూడా రానుందని సమాచారం. రేఖాచిత్రం తెలుగు వెర్షన్ మార్చి 14వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది.
‘మార్కో’లాగే..
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మార్కో కూడా ముందుగా సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆహాలోనూ మార్కో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు రేఖాచిత్రం విషయంలోనూ అదే స్ట్రాటజీ అమలవుతోంది. సోనీ లివ్‍లో వచ్చిన రేఖాచిత్రం మూవీని ఆహా కూడా తెలుగులో తీసుకొస్తోంది. మార్చి 14న ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహాలో ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.
రేఖాచిత్రం మూవీకి సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. గ్రిప్పింగ్‍గా, మంచి నరేషన్‍తో, ట్విస్టులతో ఈ మూవీ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నారు. డైరెక్టర్ జోఫిన్ టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్‌ను పొగిడేస్తున్నారు.
రేఖాచిత్రం సినిమా జనవరి 9వ తేదీన మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. రూ.6కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ సుమారు రూ.55కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకొని బ్లాక్‍బస్టర్ సాధించింది. ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ సూపర్ సక్సెస్ అయింది.
రేఖాచిత్రం మూవీలో ఆసిఫ్, అనస్వరతో పాటు జగదీశ్, సిద్ధిఖీ, సాయికుమార్, హరిశ్రీ అశోకన్, మనోజ్ కే జయన్, ఇంద్రన్స్ కీలకపాత్రలు పోషించారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఈ చిత్రంలో క్యామియో రోల్‍లో కనిపించారు. అయితే, ఏఐ టెక్నాలజీతో ఈ పాత్రను చూపించారు మేకర్స్. ఈ మర్డరీ మిస్టరీ మూవీని థ్రిల్లింగ్‍గా తెరకెక్కించటంలో డైరెక్టర్ జోఫిన్ సక్సెస్ అయ్యారు. ఈ చిత్రాన్ని కావ్య ఫిల్మ్ కార్పొరేషన్, అన్ మెగా మీడియా పతాకాలు ప్రొడ్యూజ్ చేయగా.. ముజీబ్ మజీద్ మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం