Syria Violence : సిరియాలో 1000 మంది మృతి.. అలవైట్ కమ్యూనిటీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Best Web Hosting Provider In India 2024


Syria Violence : సిరియాలో 1000 మంది మృతి.. అలవైట్ కమ్యూనిటీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Anand Sai HT Telugu Published Mar 09, 2025 08:24 PM IST
Anand Sai HT Telugu
Published Mar 09, 2025 08:24 PM IST

Syria Violence : సిరియాలో చెలరేగిన హింసతో దాదాపు వెయ్యి మంది వరకు మరణించారు. సిరియా అంతర్యుద్ధం మెుదలైన తర్వాత అత్యంత ఘోరమైన ఘటనగా దీనిని చెబుతున్నారు.

అలవైట్స్
అలవైట్స్

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను అధికారం నుంచి తొలగించిన తర్వాత అలవైట్ కమ్యూనిటీ పరిస్థితి చాలా భయానకంగా మారింది. ఒకప్పుడు అసద్ పాలన రక్షణలో ఉన్న ఈ సమాజం ఇప్పుడు అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు గ్రూపులు, సున్నీ ప్రజల టార్గెట్‌గా మారింది. ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు 1,000 మందికి పైగా మరణించారు, వీరిలో అలవైట్ వర్గానికి చెందిన వందలాది మంది ఉన్నారు. సిరియాలో 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ హింసాకాండ అత్యంత భయంకరమైన కాలంగా భావిస్తున్నారు.

వందలాది మంది మృతి

బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్(ఎస్ఓహెచ్ఆర్) సంస్థ ప్రకారం.. ఇప్పటివరకు 745 మంది పౌరులు మరణించారు. వీరితో పాటు 125 మంది ప్రభుత్వ భద్రతా సిబ్బంది, 148 మంది అసద్ అనుకూల ఫైటర్లు కూడా హతమయ్యారు. ఈ ఘర్షణతో లత్కియా వంటి ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అలవైట్ కమ్యూనిటీ

సిరియా మొత్తం జనాభాలో అలవైట్ కమ్యూనిటీ సుమారు 12 శాతం ఉంది. దాని మూలాలు షియా ఇస్లాంలో ఉన్నాయి. సాంప్రదాయకంగా ఈ సమాజం సిరియాలోని లట్కియా, టార్టస్ తీరప్రాంతాలలో ఉంది. బషర్ అల్ అసద్ ఈ సామాజిక వర్గానికి చెందినవాడు. అతని పాలనలో అలవైట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు సైన్యం, పరిపాలనలో ఉన్నత స్థానాలలో ప్రత్యేక హోదాను అనుభవించారు.

ఈ కమ్యూనిటీపై దాడులు

అయితే అసద్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత సున్నీ తిరుగుబాటు గ్రూపులు అలవైట్ కమ్యూనిటీపై దాడులను ముమ్మరం చేశాయి. కొత్త ప్రభుత్వానికి విధేయులైన సున్నీ ఫైటర్లు.. అలవైట్ గ్రామాల్లోకి ప్రవేశించి, గుర్తింపు కార్డులు చూపించాలని ప్రజలను బలవంతం చేసి, ఆపై వారిని హతమార్చారని నివేదికలు చెబుతున్నాయి.

రోడ్లపై మృతదేహాలు

బనియాస్, లత్కియా పట్టణాలలో అలవైట్ కమ్యూనిటీపై ఘోరమైన దాడులు కనిపించాయి. మృతదేహాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, ఇళ్లకు నిప్పు పెట్టారని స్థానికులు తెలిపారు. చాలా సందర్భాల్లో చనిపోయిన వారి మృతదేహాలను గంటల తరబడి తీసుకెళ్లడానికి దుండగులు అనుమతించలేదు. లత్కియా నుంచి తప్పించుకున్న అలీ షెహా (57) మాట్లాడుతూ.. ‘నా చుట్టుపక్కల 20 మంది హత్యకు గురయ్యారు. కొందరిని దుకాణాల్లో కాల్చి చంపగా, మరికొందరిని ఇళ్లలోనే కాల్చి చంపారు.’ అని చెప్పారు.

ఫ్రాన్స్ ఆందోళన

పెరుగుతున్న హింసపై ఫ్రాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మత ప్రాతిపదికన జరుగుతున్న హత్యలను తీవ్రంగా ఖండించింది. సిరియా మధ్యంతర ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

 

Anand Sai

eMail
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link