Best Web Hosting Provider In India 2024
AP Residential Colleges: ఏపీ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
AP Residential Colleges Admissions : ఏపీ రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు మార్చి 31 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
AP Residential Colleges Admissions : ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌జేసీ సెట్-2025), డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌డీసీ సెట్-2025) ఏప్రిల్ 25న జరగనుంది. ఏపీ రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను సెక్రటరీ వి.ఎన్ మస్తానయ్య విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రవేశాలకు విద్యార్థిని, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు మార్చి 31 తేదీని గడువుగా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షను 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఎన్ని? సీట్లు ఎన్ని?
రాష్ట్రంలో మొత్తం 10 ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉండగా, అందులో 1,425 సీట్లు ఉన్నాయి. అందులో మూడు మైనార్టీ, ఏడు జనరల్ కాలేజీలు ఉన్నాయి.
రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఎన్ని? సీట్లు ఎన్ని?
రాష్ట్రంలో ఒకేఒక ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉండగా, అందులో 637 సీట్లు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ
ఏపీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సీట్లను రాత పరీక్షలో వచ్చి మార్కుల మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేస్తారు. ఈ విద్యాలయాల్లో విద్యా బోధనా అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
సీట్ల కేటాయింపు
1. జూనియర్ కాలేజీల్లో 38 శాతం సీట్లు ఓసీ, 7 శాతం సీట్లు బీసీ-ఏ, 10 శాతం సీట్లు బీసీ-బీ, 1 శాతం సీట్లు బీసీ-సీ, 7 శాతం సీట్లు బీసీ-డీ, 4 శాతం సీట్లు బీసీ-ఈ, 15 శాతం సీట్లు ఎస్సీ, 6 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు. అలాగే పీహెచ్‌సీ విద్యార్థులకు 3 శాతం, స్ఫోర్ట్స్ విద్యార్థులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం, అనాథ విద్యార్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
మైనార్టీ కాలేజీల్లో 73 శాతం మైనార్టీలకు, 15 శాతం ఎస్సీ, 6 శాతం ఎస్టీలకు సీట్లు కేటాయిస్తారు. పీహెచ్‌సీ (మైనార్టీ)లకు 3 శాతం, అనాథ (మైనార్టీ)లకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
2. డిగ్రీ కాలేజీల్లో 35 శాతం సీట్లు ఓసీ, 7 శాతం సీట్లు బీసీ-ఏ, 10 శాతం సీట్లు బీసీ-బీ, 1 శాతం సీట్లు బీసీ-సీ, 7 శాతం సీట్లు బీసీ-డీ, 4 శాతం సీట్లు బీసీ-ఈ, 15 శాతం సీట్లు ఎస్సీ, 6 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు. అలాగే పీహెచ్‌సీ విద్యార్థులకు 3 శాతం, స్ఫోర్ట్స్ విద్యార్థులకు 3 శాతం, ఎన్‌సీసీ విద్యార్థుకు 3 శాతం. సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం, అనాథ విద్యార్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు. ఓసీ కేటగిరీల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌కు కేటాయిస్తారు.
జూనియర్ కాలేజీలకు అర్హులు
1. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉండాలి.
2. పదో తరగతి (2024-25) చదివిన విద్యార్థిని, విద్యార్థులు.
డిగ్రీ కాలేజీలకు అర్హులు
1. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉండాలి.
2. ఇంటర్మీడియట్ (2024-25) చదివిన విద్యార్థిని, విద్యార్థులు.
దరఖాస్తు ఫీజు
1. జూనియర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు ఫీజు రూ.300 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఫీజు చెల్లించినప్పుడు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఒక మొబైల్ నెంబర్ ఒక అప్లికేషన్‌కు మాత్రమే ఉపయోగపడుతోంది.
జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్
1. ఆన్‌లైన్ దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ : మార్చి 31
2. హాల్ టిక్కెట్ల జారీ: ఏప్రిల్ 17
3. రాత పరీక్షః ఏప్రిల్ 25 (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
4. ఫలితాలు, మొదటి మెరిట్ జాబితా విడుదలః మే 14
5. మొదటి విడత కౌన్సింగ్
ఎంపీసీ/ఈఈటీః మే 20, బైపీసీ/ సీజీటీః మే 21, ఎంఈసీ/ సీఈసీః మే 22
6. రెండో విడత కౌన్సింగ్
ఎంపీసీ/ఈఈటీః జూన్ 2, బైపీసీ/ సీజీటీః జూన్ 3, ఎంఈసీ/ సీఈసీః జూన్ 4
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్
1. ఆన్‌లైన్ దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీః మార్చి 31
2. హాల్ టిక్కెట్ల జారీః ఏప్రిల్ 17
3. రాత పరీక్షః ఏప్రిల్ 25 (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
4. ఫలితాలు, మొదటి మెరిట్ జాబితా విడుదల : మే 14
5. మొదటి విడత కౌన్సింగ్ : మే 23
6. రెండో విడత కౌన్సింగ్ : జూన్ 6
దరఖాస్తు ఎలా చేయాలి?
ఇంటర్మీడియట్ చేరేందుకు విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://aprs.apcfss.in/index , డిగ్రీల్లో చేరేందుకు విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసేందుకు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://aprs.apcfss.in/index ను క్లిక్ చేస్తే, ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతోంది. అందులో అడిగిన వాటికి పూరించాల్సి ఉంటుంది.
1. ఇంటర్మీడియట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్యలు, సందేహాల నివృత్తి కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ file:///C:/Users/ADMIN/Downloads/APRJC_CET_Prospectus_2025-26.pdf ను సంప్రదించాలి.
3. ఇంటర్మీడియట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్యలు, సందేహాల నివృత్తి కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ file:///C:/Users/ADMIN/Downloads/APRDC_Prospectus_2025-26.pdf ను సంప్రదించాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్