

Best Web Hosting Provider In India 2024

Monday Motivation: ఒక్కోసారి చెడు సంఘటన కూడా పాజిటివ్‌గా ఆలోచిస్తే మంచే చేస్తుంది, దానికి ఈ నావికుడే నిదర్శనం
బుధవారం ప్రేరణ: జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీరు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని, సానుకూలంగా ఆలోచిస్తే, అవి సగం పరిష్కారమైనట్లే. సముద్రంలో తప్పిపోయి, చాలా రోజులు ఒక ద్వీపంలో నివసించి, చివరకు తప్పించుకున్న ఒక నావికుడి కథ చదవండి.

జీవితంలో అంతా సుఖమే ఉంటే దాని విలువ తెలియదు. కొన్ని రోజులు కష్టం పడితే ఆ తరువాత వచ్చే సుఖం విలువ వెలకట్టలేనిది. కష్టసుఖాలేవైనా మానవ జీవితంలో భాగమే. కానీ సుఖంగా ఉన్నప్పుడు రాని నెగిటివ్ ఆలోచనలు, కష్టంలో మాత్రం తెగ వస్తాయి. వాటి వల్ల ఉన్న ఆ కొంచెం ప్రశాంతత కూడా పొగొట్టుకున్నారు. ఏదైనా మన మంచికే అన్న పాజిటివ్ ఆలోచనలు ఉంటే చెడు కూడా భవిష్యత్తులో మీకు మంచి చేసే అవకాశం ఉంది. అందుకు ఈ నావికుడి జీవితమే ఉదాహరణ.
తుఫానులో తప్పిపోయిన ఓడ
ఒక నావికుడు తన సిబ్బందితో సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా, ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఓడ ఆ గాలులకు కొట్టుకుపోయింది. కనీసం ఎటువెళుతోందో కూడా నావికుడికి అర్థం కాలేదు. తన సిబ్భందిని కాపాడుకోవాలని అతనికి ఎంతో కోరికగా ఉంది. కానీ ఏం చేయలేకపోయాడు. ఈలోపు అతనితో పాటూ ఉన్న సిబ్బంది భయంతో లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్రంలో దూకేస్తారు. ఓడ మునిగిపోతుందేమో అని ముందే భయపడి పోయి అలా చేశారు.
నిజానికి ఓడకు ఎక్కడా చిల్లులు పడలేదు. కాబట్టి గాలి బలంగా వీచే వైపు ఓడ వెళుతుంది కానీ మునిగిపోయే అవకాశం లేదు. ఈ విషయాన్ని నావికుడు ఎంత చెప్పిని సిబ్బంది వినలేదు. చివరికి సముద్రంలోకి ఆ చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు.
ఓడ జనావాసాలు లేని ద్వీపం వైపు వెళ్లి అక్కడ ఒడ్డున ఇసుకలో ఇరుక్కుపోయింది. ఓడలో ఉండడం వల్ల నావికుడి ప్రాణం నిలిచింది. ఆ ద్వీపం నుంచి బయటపడాలని ఎంతో ప్రయత్నించాడు. ఆ ఒడ్డు చివరల వరకు నడుచుకుని వెళ్లాడు. కానీ ఒక్క ఓడ కూడా ఆ వైపు రాలేదు. ప్రయత్నించి విసిగిపోయి, చివరికి తన జీవితం ఇక్కడేనని నిర్ణయించుకున్నాడు. అతను కట్టెలు సేకరించి ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు.
ఆ నావికుడు అడవిలో దొరికే పండ్లు, కాయలు, దుంపలు తిని తన జీవితాన్ని గడుపసాగాడు. కొన్ని నెలలు అలా గడిచాయి. నావికుడు అడవిలో ఆహారం వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒకరోజు గుడిసెకు చేరుకునే సమయానికి, తన గుడిసె మంటల్లో చిక్కుకుని ఉంటుంది. అతనికి ఉన్న ఒక్క గుడిసె కూడా కాలిపోవడం నావికుడు బాధపడ్డాడు. అయినా అతనిలో సానుకూల ఆలోచనలు తగ్గలేదు. నేను మళ్ళీ ఒక గుడిసె కట్టుకుని జీవించడం ప్రారంభించాను. ఈసారి కాస్త పెద్ద గుడిసె కట్టుకుని ఆనందంగా జీవిస్తాను అనుకున్నాడు.
గుడిసె కాలుతుంటే దూరం నుంచి ఒక ఓడ రావడం చూశాడు. అది చూసి నావికుడు ఆశ్చర్యపోయాడు మరియు చాలా సంతోషించాడు. ఆ ఓడ నావికుడి వైపుగా వచ్చి ఆగింది. అందులోంచి కొంతమంది సిబ్బంది దిగారు. ‘మాకు దూరంగా దట్టమైన పొగ కనిపించింది. ఏమి జరుగుతుందో చూడటానికి ఇక్కడికి వచ్చాము. మిమ్మల్ని ఇక్కడ చూడడంతో వచ్చాము’ అని వారు నావికుడికి చెప్పారు.
అది విన్న నావికుడు గుడిసె కాలిపోవడం కూడా తనకు మేలే జరిగిందని అనుకున్నాడు. ఆ ఓడలోనే నావికుడు తిరిగి తన దేశానికి తిరిగి వెళ్లాడు. కాబట్టి, జీవితం ఎంత కష్టంగా ఉన్నా నిరాశ చెందకండి. నా జీవితం ముగిసిపోయిందని అనుకోవచ్చు. సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టండి. మీకు ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కునేందుకు ప్రయత్నించండి.
సానుకూల ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఏ ఓటమి కూడా నిరుత్సాహపరచలేదు. ఈ నావికుడు ద్వీపంలో ఒంటరిగా జీవించాల్సి వస్తుందని ఆందోళన చెంది ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అతను ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. ఈ నావికుడి జీవితం మీ అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి.
సంబంధిత కథనం