Best Web Hosting Provider In India 2024

Brahmamudi March 10th Episode: గతం మర్చిపోయిన రాజ్- కావ్య గొడవ, రుద్రాణి చావు తూటాలు- యామినితో రాజ్ పెళ్లి చేయమన్న కనకం!
Brahmamudi Serial March 10th Episode: బ్రహ్మముడి మార్చి 10 ఎపిసోడ్‌లో రాజ్ చచ్చిపోయాడని రుద్రాణి చావు తూటాలు పేలుస్తుంది. ఆసుపత్రిలో భర్త కోసం కావ్య గొడవ చేస్తుంది. రుద్రాణి నోరు మూయిస్తుంది. మరోవైపు రాజ్ గతం మర్చిపోతాడు. దాంతో యామిని తెగ సంబరపడుతుంది. ఇంతకాలానికి తన ప్రేమ దక్కనుందని సంతోషిస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి ఒక్క కావ్యనే తీసుకొచ్చారని డాక్టర్ చెబుతాడు. దాంతో సుభాష్ వాళ్లు షాక్ అవుతారు. మరోవైపు పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని విచారిస్తుంటారు.
ఇద్దరు ఉండాలి కదా
కారు యాక్సిడెంట్ చూడలేదని, కారు బోల్తా పడి ఉండటం చూశానని, కారులో అమ్మ గారిని రక్తపు మడుగులో చూసి భయంతో కాల్ చేసినట్లు అతను చెబుతాడు. ఇంతలో వచ్చిన అపూర్వ కారులో ఇంకెవరినైనా చూశారా అని అడుగుతుంది. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కదా. కాసేపు వెయిట్ చేయమని ఎస్సై అంటే.. అపూర్వ తన ఐడీ కార్డ్ చూపిస్తుంది. కారులో మా అక్క బావ ఇద్దరు ఉండాలి. ఒక్కరే వచ్చారు. బాగా గుర్తు తెచ్చుకోండి అని అప్పు అంటుంది.
కారులో ఇంకెవరు లేరు. నాకు బాగా గుర్తు అని అతను చెబుతాడు. ఏంటీది అప్పు అన్నయ్య కనిపించడకపోవడం ఏంటీ అని కల్యాణ్ అంటాడు. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు లోయలో పడేటప్పుడు బావ గారు పక్కకు పడిపోయి ఉండొచ్చు. యాక్సిడెంట్ స్పాట్‌కు మమ్మల్ని తీసుకెళ్లండి, మీ టీమ్‌ను కూడా రమ్మనండి అని అప్పు అంటుంది. దాంతో ఎస్సై తీసుకెళ్తాడు. మరోవైపు రాజ్ కనిపించడకోవడం ఏంటీ అని అపర్ణ ఏడుస్తుంటుంది.
గాయాలతో దొరికిన సరే
కావ్యకే ఇలా ఉంటే రాజ్‌కు ఇంకెలా ఉందో అని ఇందిరాదేవి అంటుంది. శుభ్రంగా ఇంట్లో ఉండేవారు. అందరు కలిసి హనీమూన్‌కు ఏర్పాట్లు చేసి మరి వెళ్లమన్నారు. ఇప్పుడు చూడండి. ఏం జరిగింది అని రుద్రాణి అంటుంది. దానికి దీనికి ఏంటీ సంబంధం అని ప్రకాశం అంటాడు. నీకు తెలియదన్నయ్య అని రుద్రాణి అనబోతుంటే నిన్ను అనడం తప్పా ఏం ఒరగదు అని రాహుల్ అడ్డుకుంటాడు. నా కొడుకు క్షేమంగా ఉండాలి. కనీసం గాయాలతో దొరికిన పర్వాలేదు. రాత్రి ఉదయం మేల్కోని సేవలు చేసుకుంటాను. ముందు వాడు కనపడాలు. అప్పుడే నా గుండె దడ ఆగుతుంది అని అపర్ణ అంటుంది.
నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే. అది ప్రమాదంలో పడుతుంది. నువ్ ధైర్యంగా ఉండండి. రాజ్ క్షేమంగా వస్తాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దేన్నైనా తట్టుకుని నిలబడేలా ప్రిపేర్ అయి ఉండాలి. యాక్సిడెంట్ జరిగింది ఘాట్ రోడ్‌లో అంటున్నారు. కారు లోయలో పడింది. కావ్య ఒక్కతే దొరికింది కాబట్టి రాజ్‌ను వెతుకుతున్నారేమో. నాకు తెలిసి అసలు రాజ్ బ్రతికుండే అవకాశమే కనిపించట్లేదు అని రుద్రాణి అంటుంది. దాంతో అంతా కోప్పడతారు.
నువ్ అసలు మనిషివేనా. ఇలాంటి మాటలు మాట్లాడతావేంటీ అని ఇందిరాదేవి అంటుంది. ఎన్నో పాపాలు చేసిన నువ్వే భూమ్మీద ఉన్నావ్. ఏ పాపం చేయని నా అల్లుడికి ఏం కాదు. అవతల నా కూతురు యముడితో పోరాడి అయిన దాని ప్రాణాలు నిలబెట్టుకుంటుంది. అలాగే నా అల్లుడు తిరిగి వస్తారు. క్షేమంగా తిరిగి వస్తారు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే బయటకు గెంటేస్తాను అని కనకం అంటుంది. ఏయ్ అని రుద్రాణి లేస్తే.. నోర్ మూయ్ అని కనకం గట్టిగా అంటుంది.
క్షేమంగా తిరిగి వస్తారు
దాంతో రాహుల్ అడ్డుకుని ఇద్దరికి సర్ది చెబుతాడు. వదినా నేను చెబుతున్నాను అల్లుడు గారు క్షేమంగా తిరిగి వస్తారు. ఈ పామును మాత్రం దగ్గరికి రానివ్వకండి అని కనకం అంటుంది. మరోవైపు కావ్య లవ్ ప్రపోజల్ నుంచి కారు లోయలో పడిపోవడం వరకు గుర్తు చేసుకుని ఒక్కసారిగా ఏవండి అంటూ మేల్కొంటుంది. చుట్టు ఏవండి అంటూ అరుస్తూ మా ఆయన ఎక్కడ అని అడుగుతుంది. కావ్య స్పృహలోకి వచ్చినట్లు సుభాష్ వాళ్లకు చెప్పడంతో వారు వస్తారు.
ఆయనకేమైనా దెబ్బలు తగిలాయా. ఎలా ఉన్నారు అని వాళ్లను కావ్య అడగడంతో వాళ్లు షాక్ అవుతారు. నాకు ఏం కాలేదు. ముందు ఆయన్ను చూడాలి. నన్ను తీసుకెళ్లండి అని కావ్య గొడవ చేస్తుంది. కావ్య రాజ్ గురించి ఎవరు తెలియదంటున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పు అను అపర్ణ అంటుంది. ఎవరు చెప్పకపోవడం ఏంటీ. ఆయన నాతోపాటు కారులో ఉన్నారు అని కావ్య చెబుతుంది. దాంతో జరిగింది సుభాష్ చెబుతుంది. రాజ్ గురించి అడిగితే డాక్టర్లు, పోలీసులు తెలియదంటున్నారు. నిన్ను ఒక్కదాన్ని తీసుకొచ్చానంటున్నారు అని సుభాష్ అంటాడు.
అబద్ధం.. అబద్ధం అంతా.. ఆయన నాతో ఉన్నారు. కారులో వెళ్తుంటే సడెన్‌గా టైర్ పంచర్ అయిపోయింది. కారు అదుపు తప్పి లోయలో పడుతుంటే నా తలకు దెబ్బ తగిలి స్పృహ తప్పిపోయాను. ఆయన కళావతి కళావతి అంటూనే అరుస్తున్నారు. తర్వాత నాకేం గుర్తు లేదు. ఆయన నాతోపాటు లేకపోవడం ఏంటీ. నేను ప్రాణాలతో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రాణాలతో ఉండాలి కదా అని కావ్య అంటుంది. నేను చెబుతూనే ఉన్నాను. ఇప్పటికైనా అర్థమైందా. వాడు ఒక్కడే లోయలో పడిపోయి ఉంటాడు అని రుద్రాణి అంటుంది.
వెక్కి వెక్కి ఏడ్చిన అపర్ణ
ఇంతలో అప్పు వస్తే ఏమైంది, రాజ్ ఆచూకీ తెలిసిందా అని అడుగుతుంది అపర్ణ. అక్కడ ఎంత గాలించిన బావ కనిపించలేదు. ఒక చెట్టు కొమ్మకి బావ వేసుకున్న షర్ట్ మాత్రం చిక్కుకుంది అని అది చూపిస్తుంది కావ్య. రాజ్ షర్ట్ రక్తపు మరకలతో ఉంటుంది. కావ్య ఆ షర్ట్ తీసుకుని చూస్తుంది. ఇదే ఆయన వేసుకున్న షర్ట్. ఇది ఆయనదే. కానీ, అప్పు బావ లేకపోవడం ఏంటే. ఇద్దరం ఒక్కచోటే కదా పడిపోయింది అని కావ్య అంటుంది.
అమ్మా అప్పు మా దగ్గర ఏమైనా దాస్తున్నావా. మేము వినకూడనిది చెప్పట్లేదా. ఏమైందో చెప్పమ్మా అని అపర్ణ అంటుంది. అంటే.. ఆంటీ షర్ట్ మాత్రమే దొరికింది అంటే.. అక్కడున్న వాళ్లందరూ అడవి జంతువులు బావ బాడీని లాక్కెళ్లిపోయి ఉంటాయని అంటున్నారు అని అప్పు చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అపర్ణ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయిపోయింది.. దేవుడా.. మనకింకా రాజ్ లేడు అని. నేను చెబుతూనే ఉన్నాను. రాజ్ చచ్చిపోయాడని, రాజ్ చచ్చిపోయాడు అని రుద్రాణి అంటుంది.
అపర్ణ రాజ్ అంటూ అరుస్తుంది. లేదు అత్తయ్య. ఆయన బతికే ఉంటారు. మీరు ఎవరు చెప్పిన మాటలు పట్టించుకోకండి. ఆయన నన్ను విడిచిపెట్టి ఎక్కడికిపోరు అని కావ్య అంటుంది. గుండె రాయి చేసుకోమ్మా కావ్య. ఇంకా రాజ్ ఎప్పటికీ తిరిగి రాడు అని రుద్రాణి చావు మాటలే మాట్లాడుతూ తూటాలు పేలుస్తుంది. ఏయ్.. ఏం వాగుతున్నావ్. నా భర్త చచ్చిపోవడం ఏంటీ. ఆయన ఉన్నారు. ఎక్కడో చోట ఉన్నారు. ఆయన కచ్చితంగా వస్తారు అని కావ్య అంటుంది. దెబ్బకు రుద్రాణి నోరుమూస్తుంది.
నేను వెళ్లి వెతుక్కుంటాను
ఎవరు ఎన్ని చెప్పిన నేను నమ్మను. నేను వెళ్తాను. నేను వెళ్లి వెతుక్కుంటాను అని కావ్య గొడవ చేస్తుంది. దాంతో డాక్టర్స్ ఆపుతారు. కావ్యకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెడతారు. మరోవైపు హాస్పిటల్‌లో రాజ్ ఉంటాడు. యామిని కంగారుపడుతుంటే తల్లిదండ్రులు ఓదారుస్తుంటారు. రాజ్‌కు ఏమైనా అయితే నేను బతకలేను. తనే లైఫ్ అనుకుని బతుకుతున్నాను అని యామిని అంటుంది. టైమ్‌కు తీసుకొచ్చారని డాక్టర్స్ అంటున్నారుగా ఏం కాదని తండ్రి అంటాడు.
ఇంతలో రాజ్ స్పృహలోకి వస్తాడు. నేను ఎక్కడ ఉన్నాను అని రాజ్ అడుగుతాడు. హాస్పిటల్‌లో ఉన్నారు అని డాక్టర్ చెబుతాడు. నాకు ఏమైంది. ఎందుకు హాస్పిటల్‌లో ఉన్నాను అని రాజ్ అంటాడు. మీకు యాక్సిడెంట్ అయింది, లోయలో పడిపోయారు అని డాక్టర్ చెబుతాడు. యాక్సిడెంట్ ఏంటీ, లోయలో పడిపోవడం ఏంటీ. అసలు ఏం మాట్లాడుతున్నారు అని రాజ్ అంటాడు. అంటే మీకు ఏం గుర్తు లేదా అని డాక్టర్ అడిగితే.. రాజ్ గుర్తు రావట్లేదని అంటాడు.
నిజంగానే నాకు ఏం గుర్తు రావట్లేదు డాక్టర్ అని రాజ్ కంగారుపడతాడు. మీరు టెన్షన్ పడకండి. మీ పేరు ఏంటీ అని డాక్టర్ అడిగితే.. నా పేరు అని చెప్పలేకపోతాడు రాజ్. నేను లోయలో పడిపోవడం ఏంటీ, నా పేరు ఏంటీ. అసలు నా పేరు ఏంటో చెప్పండి అని రాజ్ అంటాడు. మీకు అన్ని వివరంగా చెబుతాను. ఇప్పుడు పడుకోండి అని డాక్టర్ వెళ్లిపోతాడు. తను బాగానే ఉన్నాడు. కానీ, రాజ్ గతమంతా మర్చిపోయాడు. కనీసం తన పేరు కూడా గుర్తు లేదు అని డాక్టర్ చెబుతాడు.
గతం మర్చిపోయాడు
బాగా చెక్ చేసుకుని చెబుతున్నాను. ఇలాంటి యాక్సిడెంట్‌లో బలమైన దెబ్బ తగలడం, షాక్ వల్ల గతం మర్చిపోతారు. రాజ్ తలకు బలంగా దెబ్బ తగిలింది. ఇంటర్నల్‌గా తగిలింది. ఇలాంటప్పుడు ఇలాగే మర్చిపోతుంటారు అని డాక్టర్ అంటాడు. అంటే నా రాజ్ నా కోసం మళ్లీ పుట్టాడా. అందరిని మర్చిపోయి నన్ను మాత్రమే ప్రేమించడానికి వచ్చాడు. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నా ప్రేమ నిజమైంది కాబట్టి ఇంతకాలం తర్వాత నా రాజ్ నాకు దక్కేందుకే ఆ దేవుడే పంపించాడు అని యామిని అంటుంది.
తర్వాత యామిని తల్లిదండ్రులు కనకం పక్కపక్కనే కూర్చుంటారు. ఏమైందని కనకం అడిగితే.. మాకు కాబోయే అల్లుడుకి యాక్సిడెంట్ అయింది. గతమంతా మర్చిపోయాడు. అయినా సరే మా అమ్మాయి అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది అని వారు చెబుతాడు. నన్ను అడిగితే.. ఆ అబ్బాయికి ఇచ్చి చేయడమే మంచిది అంటాను. ఎక్కడున్నాడు మీ అల్లుడు అని కనకం అంటుంది.
పక్కనే ఉన్నారు. రండి చూద్దురు గానీ అని యామిని తల్లి అంటుంది. రాజ్‌ను చూసేందుకు కనకం వెళ్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.