




Best Web Hosting Provider In India 2024

SLBC Deadbody: శ్రీశైలం సొరంగంలొ మృతదేహం వెలికితీత.. కొనసాగుతున్న గాలింపు, ర.25లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
SLBC Deadbody: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో 16 రోజుల తర్వాత తొలి మృతదేహం బయటపడింది.టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా గుర్తించారు.మృతదేహానికి నాగర్ కర్నూల్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి స్వస్థలానికి తరలించారు.

SLBC Deadbody: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ సొరంగంలో 16 రోజుల తర్వాత ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి 12 అడుగుల లోతున గడ్డకట్టిన ఒండ్రు మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని అతి కష్టమ్మీద బయటకు తీశారు. మిగిలిన కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోంది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్ బీసీ) సొరంగంలో చిక్కుకున్నవారిలో ఒకరి ఆచూకీ లభించింది.ఫిబ్రవరి 22న ఎస్ ఎల్ బీసీ సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకు పోయారు. సొరంగ నిర్మాణం చేపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ పై భాగంలోకి భారీగా నీరు, బురద పొంగి దూసుకు రావడంతో పనుల్లో ఉన్న కార్మికులు చిక్కుకుపోయారు. గల్లంతైన కార్మికుల కోసం 16 రోజులుగా సహాయచర్యలు కొనసా గిస్తున్నారు.
శనివారం రాత్రి షిఫ్టులో గాలింపు కోసం వెళ్లిన సహాయ బృందాలు టీబీఎం మెషిన్‌కు ఎడమవైపు భాగంలో ఆరు అడుగుల లోతులో ఒక చేయి, కడియం కనిపించాయి. ఆ ప్రదేశం మొత్తం బురద గడ్డ కట్టేయడంతో దాదాపు 12 గంటల పాటు శ్రమించి వాటిని తొలగించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు.
శరీరం గుర్తు పట్టలేని స్థితిలో ఉండటంతో ఎత్తు, చేతి కడియం ఆనవాళ్లతో పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్ గురు ప్రీత్ సింగ్‌గా గుర్తించినట్టు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రకటిం చారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పంజాబ్ లోని చీమా కలాన్ కు చెందిన గురుప్రీత్ మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తరలించారు. కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో తవ్వకాలు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఉన్న ప్రదేశంలో బురద మట్టి కాంక్రీట్ మాదిరి గడ్డ కట్టడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నిలబడిన చోట నిలుచున్నట్టు ప్రాణాలు కోల్పోవడంతో 12 అడుగుల వరకు లోతుగా తవ్వకాలు సాగించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ క్రమంలో టీబీఎం యంత్రాన్ని కూడా కొంత మేరకు తొలగించారు.
25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. మృతదేహాన్ని పంజాబు తరలించామని చెప్పారు రెవెన్యూ అధికారి రూ.25 లక్షల చెక్కును సిద్ధం చేసి, పంజాబ్‌లో ని గురుప్రీత్ సింగ్ కుటుంబానికి అందజేసేందుకు ఇద్దరు సహాయకులను మృతదేహంతో పాటు పంపించినట్టు తెలిపారు.
కొనసాగుతున్న గాలింపు..
గురు ప్రీత్ సింగ్ మృతదేహం లభించిన ప్రదేశంలోనే మిగిలిన వారి మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నారు. సొరంగంలో 19.8 కిలోమీటర్ల దూరంలో, టీబీఎంకు 50 మీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్యాడవర్ డాగ్స్ టీబీఎంకు 16 మీటర్ల దూరంలో మరో ఆనవాళ్లను గుర్తించాయి. ఆదివారం మరో రెండు ప్రాంతాలను గుర్తించాయి. మూడు ప్రదేశాల్లో సహాయ బృందాలు తవ్వకాలు కొనసాగుతున్నాయి. మూడు ప్రాంతాల్లో 15 అడుగుల మేర మట్టిని తవ్వాల్సి ఉందని అధికారులు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్