Ice Hack for Weight Loss: సమ్మర్‌లో ఐస్ తింటే బరువు తగ్గుతారా? ఇవన్నీ జరిగే పనులేనా కాదా తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Ice Hack for Weight Loss: సమ్మర్‌లో ఐస్ తింటే బరువు తగ్గుతారా? ఇవన్నీ జరిగే పనులేనా కాదా తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Mar 10, 2025 08:30 AM IST

Ice Hack for Weight Loss: సమ్మర్లో ఐస్ వాటర్ లేదా చిల్‌డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కేలరీలు బర్న్ చేసుకోవచ్చా? బరువు తగ్గేందుకు ఐస్ నిజంగానే అంత ప్రభావవంతంగా పనిచేస్తుందా..? దీని వల్ల కలిగే ఇతర ప్రయెజనాలేంటి తెలుసుకుందాం రండి.

 ఐస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఐస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు జిమ్‌లో లేదా పార్క్‌లో గంటల కొద్దీ సమయం ఖర్చు పెడితే మాత్రమే సరిపోదు. దానికి సమానమైన స్థాయిలో డైట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం చాలా డైట్ ప్లాన్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ, ప్రస్తుతం సీజన్‌కు తగ్గట్టుగా ఐస్ హ్యాక్ డైట్ ట్రెండీగా ఉంది. మీ శరీరం చల్లని వస్తువులకు ఎక్స్‌పోజ్ అయి కేలరీలను ఖర్చు చేస్తుంది. అవి చల్లని నీరు, స్మూతీలైనా, తాజా పండ్ల రసాలైనా ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. ఈ ఐస్ హ్యాక్ కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి ఇది ఉపయోగకరమేనా?

ఐస్ హ్యాక్ డైట్ అంటే ఏంటి?

వెయిట్ లాస్ అవడానికి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టెక్నిక్ ఈ ఐస్ హ్యాక్. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించుకుని బరువు తగ్గే ప్రక్రియ. థర్మోజెనెసిస్ అనే ప్రక్రియతో బరువు తగ్గుతామట. ఏదైనా చల్లని వస్తువు తినడం వల్ల లేదా తాగడం వల్ల శరీరం వేడి కలిగించేందుకు పనిచేస్తుంది. ఈ ప్రోసెస్ లో స్థిరమైన ఉష్ణోగ్రత వస్తుంది. అదే సమయంలో కేలరీలు కూడా ఖర్చవుతాయి.

ఇప్పటివరకూ బరువు తగ్గడంలో ఐస్ హ్యాక్ బాగా పనిచేస్తుందని ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సులు లేకపోయినా, జనాల్లో నమ్మకం మాత్రం కనిపిస్తూనే ఉంది. ఇదంతా థర్మో జెనోసిస్ ప్రక్రియ అని చెబుతున్నారు కూడా. ఐస్ హ్యాక్ ఫాలో అయి ఊబకాయం సమస్య రాకుండా చేసుకున్నామని వివరిస్తున్నారు. ఇదెలా పనిచేస్తుందో మీరు కూడా ఓ లుక్కేసేయండి.

ఐస్ హ్యాక్ డైట్ ఉపయోగాలేంటి?

బ్రౌన్ ఫ్యాట్‌ను యాక్టివేట్ చేస్తుంది:

శరీరంలో ఉండే వైట్ ఫ్యాట్ లో శక్తి దాగుంటుంది. అదే బ్రౌన్ ఫ్యాట్ బర్న్ అయితే హీట్ పుడుతుంది. చల్లని వస్తువులు లేదా చల్లని నీరు తాగడం, చల్లని నీటితో స్నానం చేయడం వల్ల బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అవుతుంది. ఇది కేలరీలను ఖర్చు అయ్యేలా చేసి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

మెటబాలిజం పెంచుతుంది:

చల్లని వాతావరణంలో ఉండటం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఫలితంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది.

హైడ్రేషన్‌ను ప్రోత్సహిస్తుంది:

మీరు ఐస్ హ్యాక్ తో బరువు తగ్గాలనుకుంటే, ఎక్కువగా ఐస్ తీసుకుంటుంటారు. అంటే పరోక్షంగా నీరు తాగుతున్నట్లే. తినడానికి ముందు ఇలా ఎక్కువగా నీరు తాగడం వల్ల కడుపు నిండుగా అనిపించి తక్కువగా తింటారు. ఫలితంగా బరువు తగ్గిపోతారు.

ఐస్ హ్యాక్ టెక్నిక్ ఎలా అనుసరించాలి:

చల్లని నీరు తాగండి

ప్రతి రోజు 8-10 గ్లాసుల చల్లని నీరు తాగండి. మోనటిని మార్పు చేసేలా చల్లని హెర్బల్ టీలు, లేదా నిమ్మరసం, పుదీనా రసం కలిపిన నీరు తాగండి.

చల్లని ఆహారం తినండి

పాలు కలిపిన పదార్థాలు, బెర్రీలు, బాదం పాలు కలిగిన చల్లని స్మూతీలు. ఆవకాడో వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్, కొవ్వులతో కలిగిన చల్లని సలాడ్లు.

చల్లని షవర్లు లేదా ఐస్ బాత్స్

30 సెకన్ల నుండి 2 నిమిషాల వరకు చల్లని షవర్ల్ ఎంజాయ్ చేయండి. ఐస్ బాత్స్ వలన బ్రౌన్ ఫ్యాట్ చల్లగా ఉండి, మరింత క్యాలరీలు ఖర్చు అవుతాయి.

చల్లని వాతావరణంలో వ్యాయామం చేయండి

చల్లని గదిలో వ్యాయామం చేయడం లేదా చల్లని వాతావరణంలో నడవడం వల్ల శరీరం మరిన్ని క్యాలరీలు ఖర్చు చేస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024