Gunde Ninda Gudi Gantalu Today Episode: ఒంటినిండా నగలతో మీనా- రోడ్డుమీదే బాలు రొమాన్స్- రోహిణికి ప్రభావతి, శ్రుతి సలహాలు

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: ఒంటినిండా నగలతో మీనా- రోడ్డుమీదే బాలు రొమాన్స్- రోహిణికి ప్రభావతి, శ్రుతి సలహాలు

 

Gunde Ninda Gudi Gantalu Serial March 10th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 10 ఎపిసోడ్‌లో రోహిణికి ప్రభావతి, శ్రుతి సలహాలు ఇస్తారు. మనోజ్‌కు బిజినెస్ పెట్టించమని నాన్నను, మావయ్యను అడగమని చెబుతారు. మీనాను ఒంటినిండా నగలతో చూడాలని ఆశగా ఉందని బాలు చెబుతాడు. రోడ్డుమీదే మీనాకు ముద్దు పెడతాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇదివరకు పని చేసిన కంపెనీకి వెళ్లి మనోజ్ జాబ్ గురించి అడుగుతాడు. ఒక్కసారి అవమానించినవాడిని జాబ్‌లో పెట్టుకోరు. మిమ్మల్ని తీసుకుంటే ఇక్కడ పనిచేసేవాళ్లు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్లు ఎవరు చేయరు అని ఆమె అంటుంది.

 

ఇంకా ఆడవాళ్లు లేరా

మనోజ్ ఎంత బతిమిలాడిన ఆమె ఒప్పుకోదు. దాంతో ఏం చేయలేక మనోజ్ వెళ్లిపోతాడు. మరోవైపు ఇంట్లో మీనాను పిలుస్తాడు బాలు. పూలకొట్టు వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని బాలు అంటాడు. మధ్యాహ్నాం అయిందిగా. అన్నం వండి తినేసి వెళ్దామని మీనా అంటుంది. కలెక్టర్ జాబ్ వచ్చిన నువ్ వంటిల్లు వదలవా. నువ్ మాత్రమే ఉన్నావా. ఇంకా ఆడవాళ్లు లేరా అని బాలు అంటాడు. నేను వాళ్లకోసం చేస్తున్నానా. మా ఆయన కోసం చేస్తున్నా. ఆయనతోపాటు వాళ్లు కూడా ఉంటున్నారు కాబట్టి తింటున్నారు అని మీనా అంటుంది.

ఇక నువ్ మారవు. ఈ జన్మలో మార్చలేం కానీ ఇదిగో 30 వేలు జాగ్రత్తగా పెట్టు అని డబ్బు ఇస్తాడు బాలు. ఇంత డబ్బు ఎక్కడిది అండి. ఇంటి ఈఎమ్ఐ కోసం ఇదివరకే కొంత డబ్బు ఇచ్చారు కదా అని మీనా అడుగుతుంది. ఇది ఇంటి కోసం కాదు. నా ఇల్లాలి కోసం. అదే నీ తాళి కోసం. నా ఫ్రెండ్ ఒకడికి ఎప్పుడో అప్పు ఇచ్చాను. ఇందాక వాడు కనిపించి వాడే ఇచ్చాడు. కాలం కలిసి రావడమే అంటే ఇది. ఇంకొంత డబ్బు సెట్ అయితే నీకు తాళిబొట్టు చేయించేస్తే భర్తగా నాకు తృప్తిగా ఉంటుంది అని బాలు అంటాడు.

 

ఈ డబ్బుల్లో కలపకుండా పక్కన పెట్టు. ఇంకోవిషయం నీ ఒంటిమీద అసలు బంగారం లేదు కదా. ఈ బంగారం షాపుల్లో స్కీమ్‌లు ఉంటాయి కదా అప్పుడప్పుడు ఈ డబ్బులు దాచిపెట్టి స్కీమ్‌లు కొందాం. నగలు కొనడం ఈజీ అవుతుంది అని బాలు అంటాడు. ముందు తాకట్టులో ఉన్న గాజులు విడిపించండి అని మీనా అంటుంది. ముందు తాళిబొట్టు, తర్వాత గాజులు ఆ తర్వాత సంవత్సారనికి ఓసారి కొత్త బంగారం కొనుక్కుందాం. ఇలా కొనుక్కుంటూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత నీ ఒంటినిండా బంగారమే అని బాలు అంటాడు.

చూడాలన్నది ఆశ

అప్పుడు మా అమ్మ ఏంటీ ఎవరు డ్రైవర్ భార్య అనరు. ఒంటినిండా నగలతో ధగధగ మెరిసిపోతావ్ అంతే. నిన్ను అలా చూడాలన్నది నా ఆశ. చూస్తాను.. కచ్చితంగా చూస్తాను అని బాలు చెబితే మీనా మురిసిపోతుంది. ఇంతకుముందు 24 గంటలు నాతో గొడవ పడేవారు. ఇప్పుడు 24 గంటలు నా గురించే ఆలోచిస్తున్నారు. ఇంతకంటే ఓ భార్యకు ఏం కావాలి అని మీనా అనుకుంటుంది. మరోవైపు ఈ మాత్రం దానికేనా ఇంటినుంచి వెళ్లిపోయింది అని శ్రుతి అంటుంది.

ఆ బాలు మాట్లాడితే నాకు తల కొట్టేసినట్లయింది. ఇక్కడ ఉండాలనిపించలేదు అని రోహిణి అంటుంది. అతనికి అసలు సెన్సే లేదే. ఇంకోవాళ్ల విషయంలో ఎందుకు దూరుతాడో నాకు అర్థం కాదు. ఎప్పుడు ఎవరినో ఒకరిని పాయింట్ అవుట్ చేయాలని అనుకుంటాడు. మీ హస్బండ్ చేసింది తప్పే కానీ నలుగురిలో అవమానించాలా. మేము అలా ఇవ్వం. ఒకవేళ రవి అబద్ధం ఆడితే.. అంటే మీ ఆయనలా అబద్ధం ఆడడు అనుకో. ఒకవేళ చేసిన మేమిద్దరమే చూసుకుంటాం. మీరు కూడా అలాగే చేయండి అని శ్రుతి అంటుంది.

 

మనోజ్ అబద్ధం చెప్పి మోసం చేయాలని లేదు. నేను బాధపడతానని నిజం చెప్పలేదు అంతే. తనకు మంచి ఉద్యోగం దొరికితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయ్. బాలు కూడా మా ముందుకు వచ్చి మాట్లాడే డేర్ చేయడు అని రోహిణి అంటుంది. ఆ మాటలు ప్రభావతి వింటుంది. జాబ్ గురించి శ్రుతి ఏంటో మాట్లాడుతుంది అనుకుంటుంది ప్రభావతి. అయినా మనోజ్ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది. నీకు పార్లర్ ఉందిగా దానికి సీఈఓను చేసేయ్. అక్కడే ఇద్దరు హాయిగా పని చేసుకోవచ్చు అని శ్రుతి చెబుతుంది.

నాన్నను డబ్బు అడుగు

నాకే అక్కడ దిక్కులేదు. ఇక మనోజ్‌ను ఎలా తీసుకెళ్లాలి. ఈవిడ తెలియక ఏదేదో చెబుతుంది అని రోహిణి అనుకుంటుంది. వేరే బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయొచ్చు అని శ్రుతి అంటుంది. అంటే పార్లర్ స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా. అప్పుడే కొత్త బ్రాంచెస్ ఎందుకు అని రోహిణి అంటుంది. ఇది కాకుండా వేరే బిజినెస్ పెట్టొచ్చు కదా. మీ నాన్నను డబ్బు అడుగు కదా. ఆయనకు మలేషియాలో పెద్ద పెద్ద బిజినెస్‌లు ఉన్నాయట కదా. ఆయన తలుచుకుంటే ఇది పెద్ద విషయమా చెప్పు అని శ్రుతి అంటుంది.

 

పర్లేదే బాగానే ఐడియాలు ఇస్తుంది అనుకున్న ప్రభావతి లోపలికి వెళ్లి శ్రుతిని మెచ్చుకుంటుంది. ఎంతకాలం ఇతరుల ముందుకు వెళ్లి మనోజ్ చేతులు కట్టుకుని ఉంటాడు చెప్పు అని ప్రభావతి అంటుంది. నాకు నాన్నకు గొడవ అయింది కదా. ఇదివరకే ఇంటి పత్రాల కోసం డబ్బు తీసుకున్నాను. పదే పదే డబ్బు అడిగి ఇంటి గౌరవాన్ని తగ్గించలేను కదా అని రోహిణి అంటుంది. రోహిణి వాళ్ల నాన్న కాకుంటే మావయ్య కూడా ఉన్నారు కదా అని శ్రుతి అంటుంది.

అవును, ఆయనతో ఏదో ఒక బిజినెస్ పెట్టించమ్మా అని ప్రభావతి అంటుంది. ఏదో ఒకటి ఎందుకు ఆయనకు కారు షో రూమ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందిగా. కారు షో రూమ్ పెట్టిస్తే సరి అని శ్రుతి అంటుంది. అవును అని ప్రభావతి అంటుంది. ఇంతమంచి అవకాశం ఉన్నప్పుడు నెలజీతాల కోసం జాబ్ వెతుక్కోవడం వేస్ట్. ఇప్పుడు రవి కూడా రెస్టారెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ కోసం వర్క్ చేస్తున్నాడు. తొందర్లోనే రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం. నేను డబ్బింగ్ స్టూడియో పెట్టాలనుకుంటున్నాను. కానీ, కాస్తా టైమ్ పడుతుంది అని శ్రుతి అంటుంది.

డబ్బులు బాగా సంపాదించాలి

దాంతో ప్రభావతి తెగ సంబరపడిపోతుంది. చాలా చక్కగా చెప్పావ్ అని మెచ్చుకుంటుంది. ఇలా పెద్ద పెద్ద బిజినెస్‌లు పెట్టి బాగా డబ్బులు సంపాదించాలి. బాలు, మీనా పెద్దగా చదువుకోలేదు కదా. అగ్గిపెట్టే అంతా పూలకొట్టు పెట్టి తెగ బిల్డప్‌లు ఇస్తున్నారు అని ప్రభావతి అంటుంది. ఫ్లవర్ బిజినెస్ కూడా మంచిదే. వాళ్లు కూడా త్వరలోనే బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు అని శ్రుతి అంటుంది. దాంతో నిరాశచెందిన ప్రభావతి వాళ్లేం చేసుకుంటే మనకెందుకులే అని అంటుంది.

 

మీ మావయ్యతో మాట్లాడి బిజినెస్ పెట్టించమ్మా. వాడు ఉద్యోగం కోసం తిరుగుతుంటే చూల్లేకపోతున్నాను అని ప్రభావతి అంటుంది. ముందు మనోజ్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటే మా వాళ్లు కూడా ఇన్వెస్ట్ నమ్మకంగా చేస్తారు. అందుకే జాబ్ చేయమంటున్నా. రెండు వారాల అనుభవం సరిపోదు. తనపై పూర్తి నమ్మకం ఉంది. తనకు కచ్చితంగా మంచి జాబ్ దొరుకుతుంది అని వెళ్లిపోతుంది రోహిణి. ఇప్పుడు మనోజ్‌కు జాబ్ దొరక్కపోతే నేను ఇరుక్కుపోతాను అని కాల్ చేస్తుంది రోహిణి.

జాబ్ గురించి అడుగుతుంది. నాలుగు కంపెనీలకు వెళ్లాను రాలేదు. నువ్ చెప్పిన వాళ్లను కూడా కలిశాను. ఇన్సల్ట్ చేసి పంపించింది. గట్టిగానే వెతుకుతున్నాను. దొరుకుతుంది అని మనోజ్ అంటాడు. దొరకాలి. జాబ్ లేకుంటే ఈ సమాజంలో మగాడిని ఎలా చూస్తారో తెలుసు కదా. నీకు తెలిసినవాళ్లను అడుగు అని రోహిణి అంటుంది. ట్రై చేస్తున్నాను అని మనోజ్ అంటాడు. మనోజ్‌కు జాబ్ దొరక్కుంటే కథంతా నా వైపు తిరుగుతుంది. అడ్డంగా బుక్ అవుతాను. దేవుడా.. మనోజ్‌కు ఏదో ఒక జాబ్ వచ్చేలా చూడు అని రోహిణి వేడుకుంటుంది.

కొత్తగా డిగ్రీ చేశాడా

ఇంట్లో మనోజ్ కోసం ఎదురుచూస్తుంటుంది రోహిణి. ఎవరు వచ్చిన మనోజ్ అని పొరపాటుపడుతుంది. రవి, శ్రుతి వస్తారు. రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయి అన్నాడు. కచ్చితంగా జాబ్ వస్తుందన్నాడు అని రోహిణి చెబుతుంది. ఒక్కరోజులో జాబ్ ఎలా వస్తుంది. వచ్చేదుంటే ఇన్నిరోజులు పార్క్‌లో ఎందుకు పడుకుంటాడు. ఇవాళ కొత్తగా డిగ్రీ చేసి వెళ్లాడా జాబ్ రావడానికి అని శ్రుతి అంటుంది. నువ్వేం ఫీల్ అవ్వకు వదినా మనోజ్‌కు కచ్చితంగా జాబ్ దొరుకుతుంది అని రవి అంటాడు.

 

అయ్యో రోహిణి నేను అలా అనలేదు. ఆ బాలులాగా అస్సలు అనలేదు. ఇవాళే జాబ్ రాలేదన్న రూల్ ఏముంది. అంత అర్జంట్ ఏముంది. నిదానందా ఆయనకు నచ్చిన జాబ్ చూసుకుంటారులే. నువ్వేం ఫీల్ అవ్వకు అని శ్రుతి అంటుంది. ఆ మాటలు విన్న మీనా వాళ్ల దగ్గరికి వస్తుంది. ఇంట్లో పరిస్థితి అలా లేదు. మనోజ్‌కు జాబ్ రాకుంటే బ్రతకనిచ్చేలా లేరు అని రోహిణి అంటుంది. కరెక్టే. జాబ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. మీనా వాళ్ల హస్బండ్‌కు ఏం సంబంధం. అది పట్టుకుని ఇన్సల్ట్ చేయడం ఏంటీ అని శ్రుతి అంటుంది.

శ్రుతి నీకేం తెలియదు ఊరుకో అని రవి అంటాడు. ఆ బాలుకు ఆఫీసర్ జాబ్ ఉన్నట్లు. ఆయన ఇంట్లో అందరిని పోషిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు అని రోహిణి అంటుంది. ఇంట్లో మనిషి లేనప్పుడు అత్తగారిలా మాట్లాడం ఏంటీ. దమ్ము, ధైర్యం ఉంటే ఆయనతో మాట్లాడు అని మీనా అంటుంది. మాట్లాడుతాను. నాకేం భయం. మీ ఆయన ఏమైనా దెయ్యమా, భూతమా అని రోహిణి అంటుంది.

భయపడాల్సి వస్తుంది

రవి మా ఆయనకు ఇతరుల జీవితాల్లోకి తొంగిచూడాలని లేదు. కళ్లముందు తప్పు జరిగితే తల్లిని అయిన నిలదీస్తాడు. అది ఆయన మనస్తత్వం. దెయ్యాలకు భూతాలకు కాదు ఒక్కోసారి నీతిగా, నిజాయితీగా బతికే వాళ్లకు కూడా భయపడాల్సి వస్తుంది అని మీనా అంటుంది. అది కరెక్టే వదినా. కానీ, బాలు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నాడు అని రవి అంటాడు. మీ ఆయన్నేం తప్పుగా అనట్లేదు. చేసేది తప్పు అంటున్నాం అని శ్రుతి అంటుంది.

 

అదేంటో మరి తిట్టను పోరా తింగరి మొహం అన్నట్లుంది. ఆయన ఏం తప్పు చేశాడు. భార్యను, తండ్రిని మోసం చేశాడా. అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడా అని మీనా అంటుంటే.. ఇంతలో ప్రభావతి వచ్చి గట్టిగా అరుస్తున్నావేంటీ. పూలకొట్టు అనుకుంటున్నావా. ఇక్కడ అందరు చదువుకున్నవాళ్లు ఉన్నారు. సంస్కారంతో మాట్లాడు. ఇంటి పరువు ఉండాలా పోవాలా. బుద్ధుందా నీకు. నోరు వేసుకుని పడిపోతున్నావ్ అని ప్రభావతి అంటుంది.

దాంతో మీనా వెళ్తుంది. వదినను ఎందుకు అంటావ్ అమ్మా. బాలు లేనప్పుడు అనకంటుంది అని రవి అంటాడు. లేదు అత్తయ్య బాలు ఒక్కడే నిజాయితీగా బతుకుతున్నాడట. మనోజ్ అబద్ధాలు చెబుతున్నాడట అని రోహిణి అంటుంది. మళ్లీ వచ్చి ఏది ఉన్న ఆయన ఉన్నప్పుడే మాట్లాడమని అన్నాను అని మీనా అంటుంది. ప్రభావతి మళ్లీ అంటుంటే మీనాకు సపోర్ట్ చేస్తుంది శ్రుతి. దీని గురించి నీకు తెలియదమ్మా. పూలకొట్టు పెట్టినప్పటి నుంచి పొగరు పెరిగింది అని ప్రభావతి అంటుంది.

నా బాబు డబ్బుతోనే కదా

డ్రైవర్‌ను డ్రైవర్ అనొద్దంటా. స్క్రూ డ్రైవర్ అనాల. మా ఆయన కూడా బస్సు డ్రైవర్‌గా రిటైర్ అయ్యాడు. నేను ఎవరికి చెప్పుకున్నాను. ఇంతే అని సరిపెట్టుకున్నాను అని ప్రభావతి అంటుంటే.. బాలు, సత్యం వస్తారు. విన్నావా నాన్న నువ్ లేనప్పుడు అమ్మ ఎలా మాట్లాడుతుందో. ఈ అత్తకోడళ్లకు డ్రైవర్ అంటే బాగా చులకన అయిపోయింది. వాడు నాలుగు డిగ్రీలు చేసింది నా బాబు డబ్బుతోనే కదా. ఈ రవిగాడు చెఫ్ అయింది నాన్న డబ్బుతోనే కదా అని బాలు అంటాడు.

 

వదిలేయిరా అని సత్యం అంటే.. ఎందుకు వదిలేయాలని అని బాలు అంటాడు. వదలకురా గబ్బిలంలా పట్టుకుని వేలాడు. నాలుగు రోజులు క్లాస్‌కు వెళ్తే డ్రైవింగ్ వస్తుంది. కానీ, వాడిలా డిగ్రీలు చేయాలంటే నీకు జీవితం కూడా సరిపోదు అని ప్రభావతి అంటుంది. బాలు కౌంటర్ ఇస్తుంటే సత్యం ఆపమని అరుస్తాడు. మీనాను కాఫీ పెట్టమని ప్రభావతి అరుస్తుంది. వెళ్లి పెట్టి ఈ ఆఫీసర్ల పెళ్లాలు కడుపు కదలకుండా కూర్చుంటారు అని బాలు అంటాడు.

తర్వాత మనోజ్ వస్తే.. చాలా రోజుల తర్వాత నీ బట్టలు నలిగిపోయాయిరా. అంటే నిజంగానే ఉద్యోగం చాలా కష్టపడుతున్నావ్ అని ప్రభావతి అంటుంది. అమ్మా నువ్ నన్ను ఎగతాళి చేస్తున్నావా అని మనోజ్ అంటాడు. ఇంట్లో నిన్ను వెనుకేసుకోచ్చేది నేను ఒక్కదాన్నే. ఇకనైనా కష్టపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఈరోజు జాబ్ రాకుంటే రేపైనా వస్తుంది. ధైర్యం కోలిపోకు అని ప్రభావతి అంటుంది. రోహిణి వచ్చి ప్రశ్నలు అడుగుతుంటే ప్రభావతి పిలిచి నేను అడిగాను. వాడిని ఇబ్బంది పెట్టకు అని అంటుంది.

బాలు రొమాన్స్

ఈరోజు జాబ్ ఏం రాలేదు రోహిణి. రేపు ఇంటర్వ్యూ ఉంది. కచ్చితంగా సెలెక్ట్ అవుతానునుకుంటున్నాను అని మనోజ్ అంటాడు. దాంతో ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఇంతలో బాలు వచ్చి జాబ్ రావు అంటాడు. వాడిపేరు మనోజ్ అని ప్రభావతి అంటే.. జాబ్ కోసం వెతుకుతున్నాడు కదా. ఇంతకీ జాబ్ వచ్చిందా అని అడుగుతాడు బాలు. వచ్చే టైమ్‌కి అన్ని వస్తాయి. నువ్ చచ్చిన పామును చంపకుండా వెళ్లు అని ప్రభావతి అంటుంది.

 

జాబ్ వెతకడానికి వెళ్లినవాడు కూడా అలసిపోతారా అని బాలు అంటాడు. కారులో కదలకుండా గేర్లు మార్చడం అనుకుంటున్నావేమో జాబ్ దొరకడం అంటే అని రోహిణి అంటుంది. వాడు జాబ్ వెతుక్కుంటూనే ఇలా అంటే.. రేపు జాబ్ వస్తే నా మీద కరిచేస్తారేమో అని బాలు అంటాడు. తర్వాత పూలకొట్టు దగ్గర ఉన్నమీనాకోసం వచ్చినట్లు చెప్పిన బాలు హగ్ చేసుకుంటాడు. రోడ్డు మీద రొమాన్స్ చేస్తాడు. తర్వాత మీనాకు రోడ్డుమీదే ముద్దు పెడతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024