


Best Web Hosting Provider In India 2024

Bigg Boss Sivaji: 13 ఏళ్ల తర్వాత బిగ్ బాస్ శివాజీ రీ ఎంట్రీ- ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో ఆ క్యారెక్టర్ ఉంటుందంటూ కామెంట్స్
Bigg Boss Sivaji Comments In Court Pre Release Event: బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ రీ ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఇటీవల నిర్వహించిన కోర్ట్ ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Bigg Boss Sivaji Comments In Court Pre Release Event: హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శివాజీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే, బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అలాగే, ఈటీవీ విన్ ఓటీటీ వెబ్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో విపరీతంగా ఆకట్టుకున్నాడు.
కీలక పాత్రలో శివాజీ
అయితే, చాలా ఏళ్ల తర్వాత హీరో శివాజీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, రోహిణి, సురభితోపాటు బిగ్ బాస్ శివాజీ కీలక పాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని కోర్ట్ సినిమాను సమర్పిస్తున్నారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఇటీవల నిర్వహించిన కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
యాక్టర్ శివాజీ మాట్లాడుతూ.. “నేను 13 ఏళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. వెండితెర మీద నాకు మళ్లీ అవకాశం ఇచ్చిన నాని గారికి థాంక్యూ. చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, అన్నిట్లో నాకు నచ్చింది ఈ సినిమాలో చేసిన మంగపతి క్యారెక్టర్. ఫ్యామిలీ, ఎమోషన్ లేకుండా ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. ఒక్కడక్కడ కొన్ని సినిమాలు ఆడి ఉండొచ్చు. ఈ సినిమాలో ఆ ఎమోషన్ ఉంది” అని అన్నాడు.
ఒక యూనిక్ స్టైల్ ఉంది
“ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో మంగపతి క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. చాలా మంచి సినిమా ఇది. ప్రియదర్శికి ఒక యూనిక్ స్టైల్ ఉంది. ఏంట్రా సైలెంట్‌గా ఉంటున్నాడు అనుకునేవాన్ని. కానీ, కెమెరా ముందు అద్భుతంగా చేసేవాడు” అని శివాజీ తెలిపాడు.
“ఇలా ఇందులో చేసిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారు. డాక్టర్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాని గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన నుంచి ఎంతోమంది కొత్త దర్శకులు రావాలని, వారి బ్యానర్ నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సూపర్ గుడ్ ఫిల్మ్‌లా నాని బ్యానర్ ఉంది” అని బిగ్ బాస్ శివాజీ తన స్పీచ్ ముగించాడు.
కచ్చితంగా వర్త్ ఉంటుంది
డైరెక్టర్ శౌర్యువ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ప్రియదర్శి గారు క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నాని గారు ఒక కథను నమ్మారంటే తప్పకుండా అందులో వర్త్ ఉంటుంది. మార్చి 14న కోర్ట్ సినిమా వస్తుంది. నేను తప్పకుండా వెళుతున్నాను. అందరం థియేటర్స్‌లో కలుద్దాం” అని అన్నారు.
“ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి నాని గారికి థాంక్యూ సో మచ్. నాని గారి ప్రోడక్ట్‌గా చెప్పుకోవడం నా అదృష్టం. దర్శితో పాటు అందరూ చక్కగా నటించారు. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది” అని కోర్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ తెలిపారు.
సంబంధిత కథనం