Today AP Telangana : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ ఏం జరగబోతోంది.. 26 ముఖ్యమైన అంశాలు

Best Web Hosting Provider In India 2024

Today AP Telangana : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ ఏం జరగబోతోంది.. 26 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu Published Mar 10, 2025 09:40 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Published Mar 10, 2025 09:40 AM IST

Today AP Telangana : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ (మార్చి 10వ తేదీన) ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగియనుంది. మొత్తం 26 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

నేటి ముఖ్యాంశాలు
నేటి ముఖ్యాంశాలు (istockphoto)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఇవాళ క్వశ్చన్ అవర్‌తో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆరోగ్య శ్రీ బకాయిలు.. అడుదాం ఆంధ్ర నిర్వహణ తీరు.. గిరిజన ప్రాంతాల్లో రేషన్ కార్డులపై సభ్యుల ప్రశ్నలు, తీర ప్రాంత టూరిజం అభివృద్ధి, భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టూ రహదారులు.. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ప్రశ్నలు, ఏపీలో కొత్త వైద్య కళాశాలలు, ఎన్టీఆర్ వైద్య సేవపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

ఇవాళ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల నామినేషన్ల కార్యక్రమం ఉంటుంది. టీడీపీ నుంచి నామినేషన్ వెయ్యనున్నారు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు

ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. సాయంత్రం 4.20 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి ఫ్లైట్‌లో 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 7.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు రెండో రోజు జరగనున్నాయి. ఇవాళ శ్రీకృష్ణుని అవతారంలో తెప్పలపై స్వామివారు విహరించనున్నారు.

ఇవాళ వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.

ఇవాళ విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పుస్తక ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమ కార్యక్రమం, శేష వాహన సేవ జరగనుంది.

యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఇరుసు పోటీలు నిర్వహించనున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరగనుంది. భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజమండ్రి, గోకవరం ఆర్టీసీ డిపోల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

విజయనగరం జిల్లా గజపతినగరంలో ఇవాళ వైఎస్సార్సీపీ కార్యాలయంలో బొత్స అప్పలనరసయ్య “యువత పోరు ” పోస్టర్ రిలీజ్ చేయునున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఇవాళ్టి నుంచి కలెక్టర్, ఇతర మండల కార్యాలయంలో ప్రజా సమక్ష పరిష్కార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఇవాళ మెంటాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద గుర్ల గెడ్డ రిజర్వాయిర్ గురించి వినతి పత్రం ఇవ్వనున్నారు అఖిలపక్ష నేతలు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామి వారి కల్యాణోత్సవం జరగనుంది. దీనికి మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.

పోసాని బెయిల్ పిటిషన్‌పై కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ జరగనుంది. పోసాని కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేశారు మేజిస్ట్రేట్. 5 రోజులుగా కర్నూలు జైలులో ఉన్నారు పోసాని కృష్ణమురళి.

ఇవాళ సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డిలో శ్రీ గోకారమయ్య స్వాముల కిస్తీ మహోత్సవం జరగనుంది.

నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో ఇవాళ స్వామివారికి మహా రుద్రాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ నిర్వహించనున్నారు.

నంద్యాల జిల్లా రాయచోటిలోని వీరభద్ర స్వామి ఉత్సవంపై జరిగిన దాడిని నిరసిస్తూ.. ఇవాళ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ర్యాలీ నిర్వహించనుంది.

నంద్యాల జిల్లా బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో ఇవాళ స్వామి అమ్మ వార్లకు బిల్వార్చన, రుద్రాభిషేకం, మహా మంగళహారతి నిర్వహించనున్నారు.

ఇవాళ ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా పొన్నచెట్టు వాహన పై విహరించనున్నారు జ్వాలా నరసింహ స్వామి.

అనకాపల్లి జిల్లాలో ఇవాళ గోవాడ షుగర్ ఫ్యాక్టరీనీ సందర్శించనుంది వైసీపీ నేతల బృందం. రైతులు తరచూ క్రషింగ్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరకు రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు వైసీపీ ముఖ్య నాయకత్వం వెళ్తోంది.

హైదరాబాద్‌‌లో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు దాసోజు శ్రవణ్.

ఇవాళ పరిశ్రమల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్, సిలిల్‌ సప్లై శాఖల బడ్జెట్‌పై సమావేశం నిర్వహించనున్నారు.

నల్లగొండ జిల్లాలో ఇవాళ ప్రణయ్ పరువు హత్య కేసులో తుది తీర్పు వెల్లడించనుంది రెండవ అదనపు సెషన్స్, ఎస్సీ ఎస్టీ కోర్టు. సెప్టెంబర్ 14, 2018న మిర్యాలగూడలో దారుణ హత్యకు గురయ్యాడు ప్రణయ్.

నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా జరగనుంది. పాక్ పట్లలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని, అభివృద్దిని అడ్డుకుంటున్న తీరుకి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు ఇంద్రకరణ్.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ మహా పూర్ణాహుతి, చక్రతీర్థం జరగనుంది. పూర్ణాహుతిలో తెలంగాణ గవర్నర్ పాల్గొననున్నారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner

టాపిక్

Telangana NewsAndhra Pradesh NewsTrending ApTrending Telangana
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024