OTT Movies: ఓటీటీల్లో తెలుగులో ఈ వారం రానున్న 5 ముఖ్యమైన సినిమాలు.. ఓ మూవీ రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో.. ఏజెంట్ కూడా..

Best Web Hosting Provider In India 2024

OTT Movies: ఓటీటీల్లో తెలుగులో ఈ వారం రానున్న 5 ముఖ్యమైన సినిమాలు.. ఓ మూవీ రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో.. ఏజెంట్ కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 10, 2025 10:42 AM IST

OTT Top movies this week: ఈవారం ఓటీటీల్లో ఐదు చిత్రాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఏజెంట్ చిత్రం సుమారు 23 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మరో మలయాళ మూవీ తెలుగులోనూ రానుంది. ఈ వారం ఐదు టాప్ ఓటీటీ చిత్రాలు ఏవంటే..

OTT Movies: ఓటీటీల్లో తెలుగులో ఈ వారం రానున్న 5 ముఖ్యమైన సినిమాలు.. ఓ మూవీ రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో.. ఏజెంట్ కూడా..
OTT Movies: ఓటీటీల్లో తెలుగులో ఈ వారం రానున్న 5 ముఖ్యమైన సినిమాలు.. ఓ మూవీ రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో.. ఏజెంట్ కూడా..

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం ఎట్టకేలకు ఈవారం ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో రిలీజైన దాదాపు 23 నెలలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. బబర్దస్త్ ‘ధనరాజ్’ దర్శకత్వం వహించిన మూవీ రెండు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇలా ఓటీటీల్లో ఈవారం ఇంట్రెస్టింగ్ చిత్రాలు వస్తున్నాయి. ఓ మలయా చిత్రం తెలుగు డబ్బింగ్‍లో వస్తోంది. ఈ వారం (మార్చి 10 -15) తెలుగులో ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

ఏజెంట్

ఏజెంట్ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 14) సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ 2023 ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే, నెగెటివ్ టాక్ తెచ్చుకొని భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏజెంట్ చిత్రం ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తుందా అని నిరీక్షణ చాలా కాలంగా కొనసాగింది. ఎట్టకేలకు 23 నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. మార్చి 14న సోనీ లివ్‍లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.

రామం రాఘవం

బబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన నటుడు ధనరాజ్ దర్శకుడిగా మారి రామం రాఘవం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీలో సముద్రఖనితో పాటు ధనరాజ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం మార్చి 14వ తేదీన ఈవీటీ విన్, సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. రామం రాఘవం చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లలో రిలీజై అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మూడు వారాల్లోనే ఈటీవీ విన్, సన్ నెక్స్ట్ ఇలా రెండు ఓటీటీల్లో మార్చి 14న స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

పొన్మన్

మలయాళ మూవీ పొన్మన్.. మార్చి 14వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. బాసిల్ జోసఫ్, సాజిన్ గోపు, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి జోతిష్ శంకర్ దర్శకత్వం వహించారు.

బీ హ్యాపీ

బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బీ హ్యాపీ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ మార్చి 14వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ హిందీ చిత్రం తెలుగు డబ్బింగ్‍‍లోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‍తో ఈ చిత్రం సాగనుంది. బీ హ్యపీ చిత్రానికి రెమో డిసౌజా దర్శకత్వం వహించారు.

రేఖాచిత్రం

రేఖాచిత్రం మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 14న స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సోనీలివ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తెలుగులో ఆహాలోనూ అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించగా.. జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు. జనవరిలో థియేటర్లలో మలయాళంలో రిలీజైన రేఖాచిత్రం భారీ హిట్ అయింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024