




Best Web Hosting Provider In India 2024

Aaradhya Devi: రామ్ గోపాల్ వర్మను కొట్టడంపై సోదరి విజయ కామెంట్స్.. నేను తెలుగు అమ్మాయినే.. శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి
Aaradhya Devi And Ram Gopal Varma Sister Comments In Saaree: ఆరాధ్య దేవి హీరోయిన్‌గా పరిచయం అవుతోన్న సినిమా శారీ. తాజాగా మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులతో శారీ టీమ్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆరాధ్య దేవి, రామ్ గోపాల్ వర్మ సోదరి విజయ విద్యార్థుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Aaradhya Devi And Ram Gopal Varma Sister Comments: సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రైటర్‌గా రూపొందించిన లేటెస్ట్ తెలుగు చిత్రం శారీ. టూ మచ్ లవ్ కెన్ బీ స్కేరీ అనేది శారీ ట్యాగ్‌లైన్. ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ఆరాధ్య దేవి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.
హీరో హీరోయిన్ పరిచయం
ఆరాధ్య దేవితోపాటు సత్య యాదు కూడా నటుడిగా పరిచయం కానున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన శారీ చిత్రానికి గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించారు. ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ శారీ సినిమాను నిర్మించారు.
ఇంట్రెస్టింగ్ సమాధానాలు
తాజాగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్స్ కాలేజీలో విద్యార్థులతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవీ సోదరి విజయతోపాటు ఆరాధ్య దేవి, సత్య యాదు, నిర్మాత రవిశంకర్ వర్మ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలతోపాటు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
నా చీర నచ్చిందా
శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి మాట్లాడుతూ.. “ముందుగా మీ అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు నా చీర నచ్చిందా? నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం నాకు తెలుగు అంతగా రాదు. అయినా ట్రై చేస్తాను. మీరు మాపై చూపించిన ప్రేమ నాకు నచ్చింది” అని చెప్పింది.
కేరళ కుట్టిగా
“నేను కేరళ కుట్టిని. కేరళ కుట్టిగా నేను కనిపిస్తున్నానా? (స్టూడెంట్స్ నో అనడంతో) లేదా? అయితే నేను తెలుగు అమ్మాయినే! శారీ చిత్రంతో నేను తొలిసారిగా మీ ముందుకు వచ్చాను. రాముగారు (రామ్ గోపాల్ వర్మ) నన్ను శారీ చిత్రంతో మీకు పరిచయం చేసారు. ఈ సినిమా ద్వారా మీ అందరి ప్రేమాభిమానాలను అందుకుంటానని భావిస్తున్నా” అని ఆరాధ్య దేవి తెలిపింది.
విభిన్నంగా ఉండేవి
అనంతరం రామ్ గోపాల్ వర్మ సోదరి విజయ గారిని.. “మీరు అర్జీవిని కొట్టారా?” అడిగిన ఓ విద్యార్థి ప్రశ్నకు “చిన్నప్పటి నుంచి రాము ఆలోచనలు విభిన్నంగా ఉండేవి. చిన్నప్పుడు ఏదో తప్పు చేస్తే ఒకసారి కొట్టాను. నన్ను తిరిగి కొట్టలేక కాదు. పైగా కరాటే కూడా నేర్చుకున్నాడు. ఎప్పుడూ ఎవరినీ కొట్టే మనస్తత్వం కాదు రాముది. ప్రతీది చాలా లైట్‌గా తీసుకుంటాడు” అని వెల్లడించారు.
సినిమా చేస్తానని అనుకోలేదు
“ఇంతమంది దర్శకులు ఉండగా ఆర్జీవీతోనే శారీ సినిమాకు ఎలా శ్రీకారం చుట్టారు” అని స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు.. నిర్మాత రవిశంకర్ వర్మ సమాధానమిస్తూ “రామ్ గోపాల్ వర్మ నా మిత్రుడు. ఆయనతో నాకు పరిచయం ఉంది. కానీ, సినిమా చేస్తానని అనుకోలేదు” అని అన్నారు.
చీరతో ఆరాధ్య కనపడటం
“ఒకానొక సందర్భంలో ఈ శారీ కథ గురించి అయన నాతో చెప్పడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన అనుకున్న కథకు చీరతో ఆరాధ్య కనపడటం, మిగతా నటులను ఎంపిక చేసుకోవడం ఆలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఓ మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నానని భావించి శారీ మొదలు పెట్టాము. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను” అని నిర్మాత రవిశంకర్ వర్మ తెలిపారు.
సంబంధిత కథనం