Veg Bhurji: ఎగ్ బుర్జీ లాగే ప్యూర్ వెజ్ బుర్జీ ఇలా చేసేయండి, చాలా రుచిగా ఉంటుంది

Best Web Hosting Provider In India 2024

Veg Bhurji: ఎగ్ బుర్జీ లాగే ప్యూర్ వెజ్ బుర్జీ ఇలా చేసేయండి, చాలా రుచిగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Published Mar 10, 2025 11:36 AM IST

Veg Bhurji: ఎగ్ బుర్జీ ఎంతోమందికి ఇష్టం. అయితే శాకాహారులు మాత్రం బుర్జీని ఇష్టపడతారు. దీన్ని సులువుగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. రెసిపీ ఫాలో అయిపోండి.

వెజ్ బుర్జీ రెసిపీ
వెజ్ బుర్జీ రెసిపీ (Vismaya Foods/Youtube)

ఎగ్ బుర్జీ ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఆహారం. దీన్ని అన్నంలో, చపాతీలో, రోటీలో తింటే రుచిగా ఉంటుంది. ఇక శాఖాహారుల కోసం మేము ఇక్కడ ప్యూర్ వెజ్ బుర్జీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు తిన్నారంటే మర్చిపోలేరు. ఈ వెజ్ బుర్జీలో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడతాము. కాబట్టి దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

వెజ్ బుర్జీ రెసిపీకి కావలసిన పదార్థాలు

శెనగపిండి – ఒక కప్పు

బియ్యప్పిండి – పావు కప్పు

ఉప్పు – రుచికి సరిపడా

బేకింగ్ సోడా – అర స్పూను

నీరు – తగినంత

నూనె – నాలుగు స్పూన్లు

జీలకర్ర – అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు – నాలుగు

కరివేపాకులు – గుప్పెడు

ఉల్లిపాయలు – రెండు

పచ్చిమిర్చి – మూడు

పసుపు – అర స్పూను

టమోటాలు – రెండు

కారం – ఒక స్పూను

ధనియాల పొడి – ఒక స్పూను

గరం మసాలా – అర స్పూను

మిరియాల పొడి – పావు స్పూను

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

నిమ్మరసం – ఒక స్పూను

వెజ్ బుర్జీ రెసిపీ

1. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, అర స్పూన్ ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.

2. తర్వాత దాని నీళ్లు వేసి చిక్కగా వచ్చేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో జీలకర్,ర సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కరివేపాకులు, ఉల్లిపాయల తరుగు వేసి వేయించుకోవాలి.

5. ఉల్లిపాయలు బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించుకోవాలి.

6. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు వేయాలి.

7. అలాగే రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి.

8. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన టమాటోలను వేసి కలుపుకోవాలి.

9. టమోటాలు మెత్తగా ఇగురులాగా అవుతాయి.

10. ఆ సమయంలో కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

11. పైన మూత పెట్టిటే టమోటాలు ఇగురు లాగా అయ్యే వరకు కలుపుకోవాలి.

12. పాన్ మొత్తం టమోటా మిశ్రమాన్ని సర్దుకోవాలి.

13. దానిపై ఇప్పుడు ముందుగా కలుపుకున్న శెనగపిండి మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి.

14. ఒక స్పూను నూనెను పైన చల్లుకొని మూత పెట్టేయాలని.

15. కాసేపటికి ఇది గట్టిగా ఆమ్లెట్ లాగా అవుతుంది.

16. ఆ సమయంలో మెల్లగా దాన్ని ముక్కలుగా చేసి తిరగేసుకోవాలి.

17. రెండోవైపు కూడా గట్టిగా ఉడికాక దీన్ని ఎగ్ బుర్జీ లాగా గరిటతోనే చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా కలుపుకోవాలి. అన్ని వైపులా దీన్ని బాగా వేగనివ్వాలి.

18. ఇప్పుడు పైన గుప్పెడు కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.

19. ఇది పొడిపొడిగా ఎంతో రుచిగా ఉంటుంది. మేము చెప్పిన పద్ధతిలో ప్రయత్నించి చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది.

వెజ్ బుర్జీ వండితే రుచిగా ఉంటుంది. దీన్ని సాంబార్ తోను, పప్పుతోను జతగా తినవచ్చు. మేము చెప్పిన పద్ధతుల్లో చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024