

Best Web Hosting Provider In India 2024
Pranay Murder Case Verdict : ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో.. న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష విధించింది. మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ.. తీర్పునిచ్చింది.
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో.. న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష విధించింది. మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ.. తీర్పునిచ్చింది. ప్రణయ్ హత్య కేసులో ఏ-2 నిందితుడు సుభాష్‌కు ఉరిశిక్షను విధించింది. మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించింది నల్గొండ న్యాయస్థానం.
302 రెడ్ విత్ 34 ప్రకారం.. ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది. ఏ2కు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. మొదటి ముద్దాయి మారుతీ రావు మరణించాడు, రెండో ముద్దాయికి సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేశారు. దాదాపు 6 సంవత్సరాల ఐదు నెలల పాటు విచారణ జరిగింది. 2018 సెప్టెంబర్ లో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. 2020 మార్చిలో మారుతీ రావు ఆత్మహత్య హైదరాబాద్‌లో చేసుకున్నాడు.
ఏ3 మహ్మద్ ఆష్ఘర్ అలీ.
ఏ 4 మహ్మద్ అబ్దుల్ బారీ
ఏ 5 మహ్మద్ అబ్దుల్ కీరం
ఏ6 శ్రావణ్, మారుతీ రావు తమ్ముడు
ఏ7 సముద్రాల శివ, మారుతీ రావు డ్రైవర్
ఏ 8నజీమ్ (నిందితుల్ని ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తి)
టాపిక్