




Best Web Hosting Provider In India 2024

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన 2 తెలుగు సినిమాలు- ఒక్కదాంట్లోనే స్ట్రీమింగ్- ఒక్కోటి డిఫరెంట్- కానీ!
Today OTT Movies Release Thala Jathara Streaming: ఓటీటీలోకి ఇవాళ రెండు తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రెండు డిఫరెంట్ జోనర్స్ అయినప్పటికీ ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ అయ్యాయి. అయితే, తల, జాతర ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఈ రెండింటి ఓటీటీ రిలీజ్ చూస్తే..!

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే రెండు తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవి కూడా రెండు డిఫరెంట్ జోనర్స్‌తో ఉన్న మూవీస్. వాటిలో ఒకటే తల మూవీ. స్టార్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అయిన సినిమానే తల.
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం
దీపా ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో యాక్షన్ డ్రామాగా తల సినిమా రూపొందింది. తల మూవీకి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించడం విశేషం. ఇక తల మూవీలో అమ్మ రాగిన్ రాజ్‌కు జోడీగా అంకిత నస్కర్ హీరోయిన్‌గా చేసింది. అలాగే, తల చిత్రంలో వీరితోపాటు హీరో రోహిత్, హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా, జబర్దస్త్ అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన తల సినిమాకు ధర్మతేజ సంగీతం అందించారు. అయితే, ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన తల సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఎంత వేగంగా థియేటర్లలో తల రిలీజ్ అయిందే అంతే ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. దాంతో ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందనే విషయం చాలా మందికి తెలియలేదు.
సైలెంట్‌గా ఓటీటీలోకి
ఇప్పుడు సడెన్‌గా ఇవాళ తల ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా తల ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు సినిమానే జాతర. యాక్షన్ అడ్వెంచర్, రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన జాతర మూవీలో సతీష్ బాబు రాటకొండ హీరోగా నటించాడు. అలాగే, జాతర సినిమాకు దర్శకత్వం వహించాడు.
జాతర మూవీలో దీయా రాజ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి జాతర సినిమాను నిర్మించారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్గడ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు.
ఓటీటీలో జాతర దర్శనం
చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గతేడాది నవంబర్‌లో 8న థియేటర్లోకి వచ్చింది. అయితే, కొత్త నటీనటులు కావడంతో జాతర మూవీ కూడా ఎవరికి తెలియకుండా పోయింది. ఒక ఊరిలోని గంగమ్మ తల్లి దేవత బ్యాక్‌డ్రాప్‌తో రివేంజ్, యాక్షన్, మోసం, ఆధ్యాత్మికత వంటి అంశాలతో జాతరను తెరకెక్కించారు.
అలాంటి జాతర ఓటీటీలో దర్శనం ఇచ్చింది. జాతర మూవీ కూడా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవాళ వచ్చేసింది. అయితే, తల, జాతర రెండు సినిమాలు ఒక్క అమెజాన్ ప్రైమ్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ, ఈ రెండు సబ్‌స్క్రిప్షన్‌తో కాకుండా రెంటల్ విధానంలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
99 రూపాయలు చెల్లించి
చడీచప్పుడు లేకుండా తల, జాతర సినిమాలు అద్దె ప్రాతిపాదికన ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. రూ. 99 చెల్లించి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తల, జాతర సినిమాలను వీక్షించవచ్చు. చిన్న సినిమాలుగా వచ్చిన తల, జాతరకు రెంటల్ విధానం పెట్టడం ఆశ్చర్యంగా మారింది.
సంబంధిత కథనం