


Best Web Hosting Provider In India 2024

Bald Head: మీరు తినే ఆహారంలో ఈ విటమిన్ లోపిస్తే బట్టతల వచ్చే అవకాశం ఎక్కువట, ముందే జాగ్రత్త పడండి
Bald Head: జుట్టు రాలే సమస్యతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా వారి ఆహారంలో కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంది.

బట్టతల జన్యుపరంగా అంటే వారసత్వంగా వస్తే దాన్ని నిరోధించడం చాలా కష్టం. కానీ పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటే మీరు దాన్ని అడ్డుకోగలరు. దానికి కావాల్సిందా మీరు పౌష్టికాహారాన్ని తీసుకోవడమే. ముఖ్యంగా కొన్ని విటమిన్ల లోపం జుట్టు రాలడాన్ని పెంచుతుంది. కాబట్టి ఏ విటమిharithaన్ల లోపం వల్ల బట్టతల వస్తుందో తెలుసుకుందాం.
విటమిన్ డి లోపిస్తే
విటమిన్ డి శరీరంలో లోపిస్తే బట్టతల వచ్చే అవకాశం పెరుగుతుంది. విటమిన్-డి లోపం వల్ల జుట్టు పొడిబారినట్టు అవుతుంది. విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటే జుట్టు కూడా తెల్లగా మారుతుంది. విటమిన్ డి లోపాన్ని నివారించడానికి పుట్టగొడుగులు, గుడ్లు వంటివి తినాలి. అలాగే ప్రతిరోజు సూర్యరశ్మిలో కాసేపు నిల్చోవలసిన అవసరం ఉంది.
విటమిన్ ఏ
విటమిన్ ఏ లోపం వల్ల జుట్టు పలుచబడిపోతుంది. జుట్టు రాలిపోవడం పెరుగుతుంది. విటమిన్ ఏ లోపం వల్లే చుండ్రు కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి విటమిన్ ఏ అధికంగా ఉండే నారింజ, పసుపు కూరగాయలైన క్యారెట్లు, చిలగడ దుంపలు, మిరపకాయలు, ముదురు రంగులో ఉండే ఆకుకూరలు అధికంగా తినండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
విటమిన్ ఇ
విటమిన్ ఈ లోపం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. అలాగే దీని వల్ల బట్టతల కూడా వస్తుంది. కాబట్టి తలపై జుట్టు అధికంగా ఊడుతూ ఉంటే విటమిన్ ఇ లోపం ఉందేమో తెలుసుకోండి. విటమిన్ ఇ లోపిస్తే సోరియాసిస్, అలోపేసియా అరెటా వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. వీటి కోసం పొద్దు తిరుగుడు గింజలు, బాదం గింజలు, పాలకూర అవకాడో వంటివి తినేందుకు ప్రయత్నించండి.
విటమిన్ సి
విటమిన్ సి లోపం వల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది. దీని వల్ల బట్టతల రావచ్చు. కాబట్టి విటమిన్ సి లోపం రాకుండా ఉండాలంటే పుల్లని పండ్లయినా సిట్రస్ పండ్లను అధికంగా తినాలి. నారింజలు నిమ్మ, బ్రకోలి, స్ట్రాబెర్రీ ఇవన్నీ తినడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం