AP ECET 2025 : ఏపీ ఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, మార్చి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం

Best Web Hosting Provider In India 2024

AP ECET 2025 : ఏపీ ఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, మార్చి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం

Bandaru Satyaprasad HT Telugu Published Mar 10, 2025 04:13 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Mar 10, 2025 04:13 PM IST

AP ECET 2025 : ఏపీ ఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు ఈసెట్ నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 6వ తేదీన ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఏపీ ఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, మార్చి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఏపీ ఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, మార్చి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

AP ECET 2025 : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే…ఏపీ ఈసెట్(AP ECET 2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2025 నోటిఫికేషన్‌ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరం బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీ ఈసెట్ ను అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 6వ తేదీన ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

మే 6న ప్రవేశ పరీక్ష

మే 6వ తేదీన ఆన్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థుల అర్హతలు, వయోపరిమితి, ఆలస్య రుసుముతో దరఖాస్తు, గడువు వంటి పూర్తి వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌లో ఇవాళ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో తెలిపింది.

ఈసెట్ ర్యాంకు ఆధారంగా లేటరల్ ఎంట్రీ

ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో అడ్మిషన్ కల్పిస్తారు. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, సెరామిక్‌ టెక్నాలజీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు, మెటలర్జికల్‌, ఇన్‌ స్ట్రుమెంటేషన్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తారు.

తెలంగాణ ఈసెట్-2025

తెలంగాణలో ఈసెట్- 2025 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు బీఎస్సీ మ్యాథ్స్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ ద్వారా బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు.

ఉన్నత విద్యామండలి తరపున ఈ ఏడాది ఉస్మానియా యూనివర్శిటీ పరీక్ష బాధ్యతలను చూడనుంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర విభాగాల అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. రూ. 500 ఆపరాద రుసంతో ఏప్రిల్ 26 వరకు, రూ. 1000 ఆపరాద రుసుంతో మే 2వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 2 వరకు దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Ap EcetCareerEntrance TestsAndhra Pradesh NewsTrending ApTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024