షాకింగ్ విజువల్స్! తనిష్క్ షోరూమ్ లోకి చొరబడి రూ. 25 కోట్ల ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలు

Best Web Hosting Provider In India 2024


షాకింగ్ విజువల్స్! తనిష్క్ షోరూమ్ లోకి చొరబడి రూ. 25 కోట్ల ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలు

HT Telugu Desk HT Telugu Published Mar 10, 2025 05:38 PM IST

HT Telugu Desk HT Telugu

Published Mar 10, 2025 05:38 PM IST

బీహార్ లోని తనిష్క్ షోరూంలో సాయుధ దొంగలు తుపాకీతో బెదిరించి రూ. 25 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తనిష్క్ షోరూమ్ లో దోపిడీ

తనిష్క్ షోరూమ్ లో దోపిడీ

బిహార్‌లోని అర్రా(Arrah) లో గల తనిష్క్ షోరూంలోకి చొరబడిన సాయుధ దొంగలు కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. దొంగలు తుపాకీతో సిబ్బందిపై దాడి చేసి షట్టర్ కు తాళం వేసి 30 నిమిషాల పాటు ఉద్యోగులను బందీలుగా ఉంచి విలువైన నగలతో పరారయ్యారు.

షోరూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలి చౌక్ బ్రాంచ్ లో ఈ చోరీ జరిగింది.

ఎనిమిది నుంచి తొమ్మిది మంది దొంగలు ఉన్నారని, పలుమార్లు ఫోన్ చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదని స్టోర్ మేనేజర్ పేర్కొన్నారు. ఎస్పీ పృచయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేశారు.

దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, వారి నుంచి రెండు పిస్తోళ్లు, 10 తూటాలు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని బీహార్ పోలీసులు తెలిపారు. అయితే దొంగిలించిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా లేదా అనేది తెలియరాలేదు.

‘ఆరుగురు అనుమానాస్పద వ్యక్తులు మూడు మోటారు సైకిళ్లపై డోరిగంజ్ వైపు వెళ్తున్నారు. కొంతదూరం వెంబడించిన తర్వాత నేరగాళ్లు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు నేరగాళ్లు గాయపడ్డారు’ అని భోజ్ పూర్ పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు భోజ్ పూర్ పోలీసులు తెలిపారు.

25 కోట్ల విలువైన నగలతో పాటు నగదును దొంగలు దోచుకున్నారని షోరూం మేనేజర్ కుమార్ మృత్యుంజయ్ తెలిపారు.

చోరీకి గురైన ఆభరణాల్లో గొలుసులు, నెక్లెస్ లు, గాజులు, కొన్ని వజ్రాలు ఉన్నాయి. ‘ఇది అధికారుల తప్పిదం. అది ఉదయం సమయం. సాయంత్రం, రాత్రి కాదు. పోలీసులకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదు’ అని కుమార్ మృత్యుంజయ్ పేర్కొన్నారు.

రివాల్వర్ తో తలపై కొట్టడంతో ఇద్దరు గాయపడ్డారని ఆయన తెలిపారు. ఎనిమిది నుంచి తొమ్మిది మంది దొంగలు ఉన్నారని చెప్పారు. తనిష్క్ షోరూం ఉద్యోగి రోహిత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ,’దొంగలు తమ (గార్డులు) తుపాకులను ఎత్తుకెళ్లి అందరినీ ఒక పక్కకు నెట్టారు. మేం కౌంటర్ వెనుక దాక్కున్నాం. వారు మమ్మల్ని కొట్టారు. పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, ఏమి జరుగుతుందో మాకు అర్థం కాలేదు.” అని వివరించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024



Source link