



Best Web Hosting Provider In India 2024

Adventure Places: మీరు సాహస ప్రియులా.. అయితే భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి!
Adventure Places: కొంతమంది ప్రయాణికులు సాహస కార్యక్రమాలను ఆస్వాదించడానికి మాత్రమే ప్రయాణాలు చేస్తారు. మీరూ అటువంటి సాహస ప్రియులే అయితే భారతదేశంలోని 5 ప్రదేశాల గురించి తెలుసుకోండి. ఇక్కడ మీకు నచ్చే ఎన్నో రకాల అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉంటాయి.

ట్రావెలింగ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ కొంతమంది ప్రయాణికులు కేవలం సాహస కార్యక్రమాలను ఆస్వాదించగల ప్రదేశాలకు మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడతారు. భారతదేశంలో చాలా టూరిస్ట్ ప్లేసెల్ ఉన్నాయి. కేవలం ప్రకృతినీ, ప్రయాణాన్ని పంచేవి మాత్రమే కాకుండా సాహస ప్రియులకు నచ్చేలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉండే ప్రదేశాలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. మీరు కూడా సాహస ప్రియులైతే, అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే ప్రదేశాల జాబితా కోసం వెతుకుతున్నట్లయితే మేము కొన్నింటిని తీసుకొచ్చాం. ఈ ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లి ఎంజాయ్ చేయచ్చు, అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములతో కలిసి కూడా వెళ్ళవచ్చు. సాహస కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
1)రిషికేశ్
హిమాలయ పర్వతాల మధ్య ఉన్న రిషికేశ్ ప్రాంతం కేవలం ఆధ్యాత్మిక వాతావరణానికి మాత్రమే కాదు. సాహస కార్యక్రమాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది యోగా, ధ్యాన కేంద్రంగా పేరు గాంచిది. అలాగే సాహస కార్యక్రమాలకు కేరాఫ్ గా మారింది. ఇక్కడ మీరు గంగా నదిలో ఉత్తేజకరమైన రాఫ్టింగ్ చేయవచ్చు. అత్యంత ఎత్తైన బంజీ జంపింగ్ స్పాట్ కూడా రిషికేశ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మీరు అందమైన ప్రదేశాలలో క్యాంపింగ్, ట్రెక్కింగ్ వంటి రకరకాల సాహసోపేతమైన కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఇక్కడి వెళ్లారంటే చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు.
2) మనాళి
హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక అందమైన నగరం మనాళి. వేసవి, శీతాకాలాలలో సాహస కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇది. ఎత్తైన శిఖరాలు, దట్టమైన అడవులతో చుట్టుముట్టి ఉండే ఈ నగరంలో స్కీయింగ్, స్నోబోర్డింగ్ ను ఎంజాయ్ చేయచ్చు. అలాగే సోలాంగ్ లోయలో పారాగ్లైడింగ్ చేస్తూ హిమాలయాల అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడికి కుటుంబంతో వెళ్లచ్చు, ఒంటరిగా కూడా ఈ ప్రదేశాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.
3) గోవా
అందమైన సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన నైట్ లైఫ్‌కు ప్రసిద్ధి చెందింది గోవా. ఇక్కడ కూడా మీరు ఉత్తేజకరమైన సాహస కార్యక్రమాలను ఆనందించవచ్చు. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి కార్యక్రమాలు గోవాలో చాలా కూడా ఉంటాయి. వీటితో పాటు పారాసైలింగ్, జెట్ స్కీయింగ్ వంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ ను కూడా గోవాలో మీరు ఎంజాయ్ చేయవచ్చు.
4) జైసల్మేర్
థార్ ఎడారి మధ్యలో ఉన్న జైసల్మేర్ ప్రాంతం అద్భుతమైన దృశ్యాలతో కూడి ఉంటుంది. ఎన్నో రకాల సాహసోపేత కార్యక్రమాలను ఆనందించగల ప్రదేశం కూడా. ఈ బంగారు నగరం దాని కోటలు, ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి చెందింది. ఒంటె సఫారీలో థార్ ఎడారి విశాలమైన ఇసుక దిబ్బలను ఆస్వాదించండి. అంతేకాకుండా ఎడారి క్యాంపింగ్ కూడా చాలా ఎంగ్జైటింగ్ గా అనిపిస్తుంది.
5) లడఖ్
భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న లడఖ్ సాహస ప్రియులకు అనువైన ప్రదేశం. ఈ ప్రదేశం దాని అద్భుతమైన దృశ్యాలు, ఎత్తైన పర్వతాలతో పాటు ప్రశాంతమైన మఠాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు ట్రెక్కింగ్ చేయవచ్చు. మోటార్ సైక్లింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి రకరకాల అడ్వెంచరస్ యాక్టివిటీస్ ను కూడా ఎంజాయ్ చేయచ్చు.
సంబంధిత కథనం