Best Web Hosting Provider In India 2024

పాడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
ధరలు లేక నష్టపోతున్న పాడి రైతులు
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ధ్వజం
జగనన్న పాలవెల్లువతో పాడి రైతుకు భరోసా
ఆనాడు ప్రభుత్వమే పాల ధరలను నిర్ణయించింది
మహిళా డెయిరీ సంఘాలను ప్రోత్సహించింది
జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలిపాం
వైయస్‌ఆర్‌సీపీ హయాంలో పాడి రైతులకు ఆదనంగా రూ.5100 కోట్లు లబ్ధి
శ్రీకాకుళం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ డాక్టర్స వింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియా సమావేశం
శ్రీకాకుళం: రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రైవేటు డెయిరీలు భ్రష్టుపట్టిస్తున్న కూటమి సర్కార్ చేష్టలూడి చూస్తోందని వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాల ధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీల దోపిడీకి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని ధ్వజమెత్తారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
రాష్ట్రంలో పాడిపరిశ్రమపై ఆధారపడి రైతుల పరిస్థితి ధైన్యంగా మారింది. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడం, ప్రైవేటు డెయిరీలపై నియంత్రణను పక్కనపెట్టడంతో పాల రైతులు తీవ్రం సంక్షోభంలో చిక్కుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా పాడిరైతులు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి వంతపాడే ఈనాడు పత్రికలోనూ పాడి రైతుల కష్టాలపై కథనాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను దోచుకుంటున్నాయి. పాలధరలను తగ్గించడం, ఫ్యాట్ శాతం తక్కువగా ఉందని చెప్పడం ద్వారా రైతులను దగాచేస్తున్నాయి. ఏపీడీడీసిఎఫ్ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసిన మహిళా డెయిరీ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా అమూల్‌కు పాలు విక్రయించడానికి వీలులేదని వత్తిడి చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ప్రైవేటు డెయిరీలు నిర్ణయించిన తక్కువ రేటుకే పాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు.
పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను విన్న వైయస్ జగన్
వైయస్ జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో పలువురు పాడి రైతులు ఆయనను కలిసి తమ కష్టాలను వివరించారు. ప్రైవేటు డెయిరీల తమను ఎలా దోచుకుంటున్నారో, తక్కువ రేటుకు ఎలా కొనుగోలు చేస్తున్నారో వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వ నియంత్రణ ఉంటేనే పాడి రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అధికారంలోకి వస్తే పాడి రైతులను ఆదుకుంటానంటూ ఆనాడు వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పాడి రైతులకు ఎనలేని మేలు చేకూర్చారు. 2020లో ఎపీ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటీవ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నివేల మహిళా డెయిరీ సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో పాలసేకరణ కేంద్రాలను ప్రభుత్వమే నిర్మించి, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది. పాల రంగంలో దేశంలోనే అతిపెద్ద సహకార వ్యవస్థగా ఉన్న అమూల్ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించి మార్కెటింగ్ భాగస్వామిగా చేసుకుంది. ప్రభుత్వ జోక్యంతో పాలధరలను నిర్ణయించడం జరిగింది. అవసరమైన సమయాల్లో ధరలను స్థిరీకరిస్తూ, పోటీ సృష్టించడం ద్వారా ప్రైవేటు డెయిరీలు కూడా మంచిరేటుకే పాలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. ఆనాడు వైయస్ జగన్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల పాడిరైతులు భారీగా లాభపడ్డారు.
పాడిరైతులకు అండగా జగనన్న పాలవెల్లువ
జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభించక ముందు 11 వెన్నశాతం ఉండే లీటర్ గేదెపాల ధర రూ.56 నుంచి రూ.66 ఉండేది. పాలవెల్లువ కార్యక్రమంను ప్రారంభించడం వల్ల దీని ప్రారంభ ధరే సుమారు రూ.71 చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. అంటే రైతులకు పెరిగిన రేటు వల్ల అదనంగా లీటర్ కు దాదాపు రూ.11 లాభం వచ్చింది. అదే విధంగా 5.4 వెన్నశాతం ఉన్న లీటర్ ఆవు పాలు రూ.25 నుంచి రూ.28 వరకు కొనుగోలు చేస్తుంటే, పాలవెల్లువ తరువాత ఇదే పాలు లీటర్ రూ. 34కి పైగా చెల్లించి అమూల్ కొనుగోలు చేసింది. అంటే కనీసంగా ఆరు నుంచి తొమ్మిది రూపాయల మేరకు రైతులు ప్రతి లీటర్ కు అధికంగా లభించింది. దీనితో అన్ని ప్రైవేటు డెయిరీలు కూడా తప్పనిసరిగా రైతుల నుంచి పాలను ఇదే రేట్లకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా దాదాపు ఏడు సార్లు అంటే 2021 సెప్టెంబర్‌లో, 2022 మే, జూన్, సెప్టెంబర్, 2023 జనవరి, సెప్టెంబర్లలో పాల ధరలను పెంచడం జరిగింది. చివరి పెరుగుదల నాటికి గేదె పాలు లీటర్ రూ.89.76 పైసలు, ఆవుపాలు లీటర్ రూ.43.69 పైసలకు పెరిగింది. దాదాపు అయిదు లక్షల మంది రైతుల నుంచి రోజుకు దాదాపు నాలుగు లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయించాం. పెరిగిన పాల రేట్ల వల్ల పాడి రైతులకు అదనంగా 97.5 కోట్లు లబ్ధి చేకూరింది. ప్రైవేటు డెయిరీలు కూడా గేదె పాలు రూ.14, ఆవుపాలు రూ.7 రూపాయలు అదనంగా పెంచి రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ఇలా ప్రైవేటు డెయిరీల నుంచి అదనంగా దాదాపు రూ. 4900 కోట్లు రైతులకు లభించాయి. అమూల్, ప్రైవేటు డెయిరీల వల్ల పెరిగిన రేట్ల వల్ల అదనంగా పాడి రైతులు లబ్ధి పొందిన మొత్తం రూ.5100 కోట్లు. అంతకు ముందు 1.20 కోట్ల లీటర్ల పాలు కొనుగోళ్ళు జరుగుతూ ఉంటే, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 1.54 కోట్ల లీటర్ల పాల కొనుగోళ్ళ జరిగే స్థాయికి పెంచాం. మంచి రేటు లభిస్తుండటం, చేయూత కార్యక్రమాన్ని లింక్ చేయించి, మహిళ ద్వారా పాడి పరిశ్రమను పెంచేందుకు కృషి చేసిన ఫలితంగా ఈ ప్రగతిని సాధించడం జరిగింది. వైయస్‌ఆర్‌సీపీ హయాంలో మొత్తం 3.78 లక్షల పాలు ఇచ్చే పశువులను మహిళలతో కొనుగోలు చేయించగలిగాం. 2022-23లో మన రాష్ట్రం పాల ఉత్పత్తిలో అయిదో స్థానంలో ఉంది. ఇప్పుడు ఏపీ ఆరోస్థానంకు దిగజారి పోయింది.