




Best Web Hosting Provider In India 2024

Kumaradhara Theertha Mukkoti : మార్చి 14న తిరుమల కుమారధార తీర్థ ముక్కోటి-వీరికి అనుమతి లేదు
Kumaradhara Theertha Mukkoti : తిరుమల కుమారధా తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 14న ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు.

Kumaradhara Theertha Mukkoti : తిరుమలలో మార్చి 14(శుక్రవారం)న జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదని టీటీడీ తెలిపింది.
ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు
గోగర్భం నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను కోరింది టీటీడీ. పాపవినాశనం నుంచి కుమారధార తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అన్నదానానికి అనుమతి లేదు
మార్గమధ్యలో తాగునీటిని అందుబాటులో ఉంచుతారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 5 గంటల నుంచి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అన్నదానం చేసేందుకు అనుమతి లేదు. ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్‌లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు.
టాపిక్