


Best Web Hosting Provider In India 2024

OTT Comedy: ఓటీటీలోకి తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా.. నవ్వు తెప్పిస్తోన్న టీజర్.. ఇక్కడ చూసేయండి!
Home Town OTT Streaming And Teaser Released: ఓటీటీలోకి వస్తోన్న న్యూ తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ హౌమ్ టౌన్. రాజీవ్ కనకాల, ఝాన్సీ కీలక పాత్రలు పోషించిన హోమ్ టౌన్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. నవ్వులు పూయిస్తోన్న హౌమ్ టౌన్ ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Home Town OTT Release And Teaser Released: ఓటీటీలో ఇటీవల కాలంలో తెలుగు కంటెంట్ పెరిగిపోయింది. విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే కామెడీ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌లను సైతం తెరకెక్కిస్తున్నారు.
#90స్ సిరీస్ మేకర్స్ నుంచి
అలా ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన #90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే జోనర్‌లో ఈ సిరీస్ మేకర్స్ నుంచే మరో తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ రానుంది. అదే హోమ్ టౌన్. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు.
హౌమ్ టౌన్ టీజర్ రిలీజ్
#90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌ను రూపొందించిన నవీన్ మేడారం నిర్మాణంలో హౌమ్ టౌన్‌ను నిర్మించారు. హౌమ్ టౌన్ వెబ్ సిరీస్‌కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. తాజాగా హౌమ్ టౌన్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న హౌమ్ టౌన్ టీజర్ ఆద్యంతం నవ్వించేలా ఉన్నాయి. స్టూడెంట్స్‌గా చేసిన పాత్రలు చెప్పే అమాయకపు డైలాగ్స్ నవ్వించడంతోపాటు పాతరోజులను గుర్తు చేసేలా ఉన్నాయి.
మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి
ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేయబడును అనే బోర్డ్ చూసి.. ఇదేం బుక్‌రా అని ఒకతను అంటే.. ఇదో కొత్త సబ్జెక్ట్ బుక్ అయింటుందేమోరా అని మరోకరు అనడం, అది సోషల్ మీడియా అకౌంట్ అని కంప్యూటర్ సెంటర్ అతను అనడం, అన్నా మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి అని స్టూడెంట్ చెప్పే డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి.
అదేమైనా గణేష్ చందానా
రాజీవ్ కనకాలకు కొడుకు స్కూల్ మార్క్స్ చూపించడం, అన్ని బాగా రావడం, 100కి 116 రావడంతో తండ్రి డౌట్ పడటం, తల్లి మాత్రం అన్ని మార్క్స్ వచ్చాయ అని ఆశ్చర్యపోవడం, తర్వాత ఫ్రెండ్స్ హేళన చేయడం, 116 మార్కులు వేసుకోవడం ఏంట్రా.. అదేమైనా గణేష్ చందానా అని కౌంటర్ వేయడం అంతా స్కూల్ డేస్‌ను గుర్తు చేసేలా ఉంది.
#90స్ సిరీస్ తరహాలోనే
అనంతరం ముగ్గురు ఫ్రెండ్స్ చేసే అల్లరి, ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడటం వంటివి అన్ని చాలా ప్రామిసింగ్‌గా నవ్వించేలా హౌమ్ టౌన్ టీజర్ ఉంది. టీజర్ చూస్తుంటే సేమ్ మరో #90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌లా ఉంది హౌమ్ టౌన్. అయితే, ఆహా ఓటీటీలో హౌమ్ టౌన్ స్ట్రీమింగ్ కానుంది.
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్
ఏప్రిల్ 4 నుంచి ఆహాలో హౌమ్ టౌన్ ఓటీటీ రిలీజ్ కానుంది. కాగా, #90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌తో ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఎంతో పేరు వచ్చింది. మరి ఈ హౌమ్ టౌన్‌తో ఆహా ఓటీటీ ఎంతలా క్లిక్ అవుతుందో చూడాలి.
సంబంధిత కథనం
టాపిక్