Cucumber Idli Recipe: వేసవిలో కీరదోస ఇడ్లీలు ఎంతో మేలు చేస్తాయి, ఇదిగోండి రెసిపీ ఇలా ఇన్‌స్టంట్‌గా తయారు చేసేయండి!

Best Web Hosting Provider In India 2024

Cucumber Idli Recipe: వేసవిలో కీరదోస ఇడ్లీలు ఎంతో మేలు చేస్తాయి, ఇదిగోండి రెసిపీ ఇలా ఇన్‌స్టంట్‌గా తయారు చేసేయండి!

Ramya Sri Marka HT Telugu
Published Mar 11, 2025 06:30 AM IST

Cucumber Idli Recipe: కీరదోసతో ఇడ్లీలు ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? ఈ వేసవిలో డీహైడ్రేషన్ సమస్య నుంచి తప్పించుకోవాలంటే వీటిని తప్పక ట్రై చేయాల్సిందే. ఇన్‌స్టంట్‌గా, ఈజీగా తయారయ్యే కీరదోస ఇడ్లీ రెసిపీ గురించి ఇక్కడ తెలుసుకోండి.

కీరదోస ఇడ్లీలు
కీరదోస ఇడ్లీలు

కీరదోస ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వేసవిలో వచ్చే వేడి, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి కీరదోస చక్కటి ఆహార పదార్థం. కీరదోసను నోరుగా కట్ చేసుకుని తినచ్చు. కానీ ఇలా ప్రతిసారి తినడం అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలంటే కచ్చితంగా ముక్కు విరుస్లారు. మీ ఇంట్లో వాళ్లు కూడా ఇంతే అయితే ఈ రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా మేలు చేసే కీరదోసతో రుచికరమైన ఇడ్లీలను తయారు చేయచ్చు. అది కూడా ఇన్‌స్టంట్‌గా, చాలా ఈజీగా. ఎలాగో తెలుసుకుందాం రండి.

కీరదోస ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు:

  • ఒక కీరదోసకాయ
  • ఒక కప్పు బియ్యపు రవ్వ లేదా ఇడ్లీ రవ్వ
  • ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము
  • తరిగిన కొత్తిమీర
  • రుచికి తగినంత ఉప్పు
  • చిటికెడు బేకింగ్ సోడా
  • ఒక టేబుల్ స్సూన్ నూనె
  • పావు టేబుల్ స్పూన్ జీలకర్ర
  • పావు టేబుల్ స్పూన్ ఆవాలు,
  • కరివేపాకు

కీరదోస ఇడ్లీ తయారీ విధానం:

  1. ముందుగా తాజా కీరదోసకాయను తీసుకుని శుభ్రంగా కడిగి దాని తోలంతా తీసేయండి.
  2. ఆ తర్వాత గ్రేటర్ సహాయంతో కీరదోసను సన్నగా తురుముకోండి.
  3. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో కీరదోసకాయ తురుము వేయండి. తరువాత దీంట్లోనే బియ్యపు రవ్వ లేదా ఇడ్లీ రవ్వను వేసి బాగా కలపండి.
  4. రెండింటినీ బాగా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్టో ఈ మిశ్రమాన్ని వేయండి.
  5. తర్వాత అదే మిక్సీలో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకూ రెండు మూడు సార్లు గ్రైండ్ చేయండి.
  6. (గ్రైండ్ చేసేటప్పుడు నీరు కలపకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే కీరదోసలో ఇడ్లీ బ్యాటర్ కు కావాలసినంత నీరు ఉంటుంది)
  7. ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోండి.
  8. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడిక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటికెడు వాము, కరివేపాకు వేసి చిటపటలాడించండి.
  9. ఈ తాళింపును తీసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ లో వేయండి.
  10. తరవాత ఆ పిండిలో తరిగిన కొత్తిమీర (అవసరం అనుకుంటే కట్ చేసిన మిర్చి కూడా వేసుకోవచ్చు).
  11. అన్నీ బాగా కలిసిపోయేంత వరకూ పిండిని బాగా కలపి మూత పెట్టి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకూ పక్కకు పెట్టేయండి.
  12. కావాలనిపిస్తే ఇడ్లీ పిండిలోకి సోడా వేసుకోండి. పిండి బాగా గట్టిగా అనిపిస్తే ఇప్పుడు కొద్దిగా నీరు కలుపుకోవచ్చు.
  13. ఇప్పుడు ఈమిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో వేసుకుని పొయ్యి మీద పెట్టి 15 నిమిషాల పాటు వరకూ ఉడికించండి.

అంతే ఆరోగ్యకరమైన రుచికరమైన కీరదోస ఇడ్లీలు రెడీ అయినట్టే. మీకు నచ్చిన చట్నీతో కలిపి సర్వ్ చేసుకున్నారంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందచ్చు. పిల్లలకు కూడా ఈ ఇడ్లీలు చాలా బాగా నచ్చుతాయి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024