


Best Web Hosting Provider In India 2024

Romantic Comedy OTT: ఓటీటీలోకి రేఖచిత్రం హీరోయిన్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ – ఫహాద్ ఫాజిల్ ప్రొడ్యూసర్
Romantic Comedy OTT: స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నిర్మించిన మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ పైంకిలి ఓటీటీలోకి వస్తోంది. త్వరలో మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మలయాళం మూవీలో రేఖచిత్రం ఫేమ్ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది.

మలయాళం అగ్ర హీరో ఫహాద్ ఫాజిల్ నిర్మించిన పైంకిలి మూవీ ఓటీటీలోకి రాబోతోంది. రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో రేఖచిత్రం ఫేమ్ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. సాజిన్ గోపు, జిస్మ విమల్, రోషన్ షాన్‌వాస్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసరి ఈ మూవీలో నటుడిగా కనిపించాడు. ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ ఈ సినిమాకు కథను అందించారు. అంతే కాకుండా ఫహాద్ ఫాజిల్‌తో కలిసి జీతూ మాధవన్ పైంకిలి మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
మనోరమా మ్యాక్స్…
పైంకిలి మూవీ త్వరలో మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. మార్చి 14న ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మనోరమా మ్యాక్స్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే రోజు అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
వండర్స్ అనుకుంటే…
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న పైంకిలి మూవీ థియేటర్లలో రిలీజైంది. ఫహాద్ ఫాజిల్ నిర్మాత కావడం, జీతూ మాధవన్ కథను అందించడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు పెద్ద హిట్ కావడంతో పైంకిలి బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ కాన్సెప్ట్ బాగున్నా…కామెడీ అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో పైంకిలి కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఆరు కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది. ఫహాద్ ఫాజిల్‌కు నష్టాలను తెచ్చిపెట్టింది.
పైంకిలి కథ ఇదే…
సుకు ఓ ప్రింటింగ్‌షాప్ నడుపుతుంటాడు. బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికి పిచ్చివాడిగా నటిస్తాడు. పది రోజులు మెంటల్ హాస్పిటల్‌లో ఉంటాడు. అలాంటి టైమ్‌లోనే అతడి జీవితంలోకి షీబాబేబీ వస్తుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. పిచ్చివాడిగా నటిస్తూనే షీబాకు తన ప్రేమ సంగతి ఎలా చెప్పాడు? అప్పుల బాధ నుంచి ఏ విధంగా బయటపడ్డాడు అన్నదే పైంకిలి మూవీ కథ.
ఆవేశం మూవీతో…
ఆవేశం సినిమాతోనే మలయాళంలో నటుడిగా ఫేమస్ అయ్యాడు సాజిన్ గోపు. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ అసిస్టెంట్ అంబన్ పాత్రలో కనిపించాడు. తన కామెడీ టైమింగ్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన రేఖచిత్రం ఈ ఏడాది మలయాళంలో పెద్ద హిట్‌గా నిలిచింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అరవై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. రేఖచిత్రం మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు.
సంబంధిత కథనం