Best Web Hosting Provider In India 2024

Brahmamudi March 11th Episode: రామ్‌గా మారిన రాజ్ – యామిని కొత్త నాటకం – భర్తకు దూరమైన కావ్య – నిజం చెప్పిన అప్పు
Brahmamudi March 11th Episode: బ్రహ్మముడి మార్చి 11 ఎపిసోడ్‌లో రాజ్ చనిపోయాడని దుగ్గిరాల కుటుంబసభ్యులందరిని నమ్మిస్తుంది యామిని. గత మర్చిపోయిన రాజ్‌పేరును రామ్‌గా మారుస్తుంది. రాజ్‌ను తన సొంతం చేసుకోవడానికి కొత్త స్కేచ్ వేస్తుంది. రాజ్ చనిపోయాడని ఎవరు చెప్పిన కావ్య మాత్రం నమ్మదు.
Brahmamudi March 11th Episode: రాజ్‌ను యాక్సిడెంట్ స్పాట్ నుంచి మాయం చేసి సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తుంది యామిని. రాజ్ గతం మర్చిపోయినట్లు డాక్టర్ చెబుతాడు. డాక్టర్ మాటలతో తొలుత షాకవుతుంది యామిని. ఆ తర్వాత కొత్త స్కెచ్ వేస్తుంది.రాజ్ అందరిని మర్చిపోయి నన్ను మాత్రమే ప్రేమించడానికి వచ్చాడని అనుకుంటుంది. నా ప్రేమ నాకు దూరమైందని బాధపడుతుంటే ఆ బాధ చూడలేక నన్ను, నా ప్రేమను దేవుడు గెలిపించాడని తల్లిదండ్రులతో చెబుతూ ఆనందపడుతుంది యామిని.
అపర్ణ కన్నీళ్లు…
మరోవైపు రాజ్ ఏమైందో తెలియక అపర్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను ఇందిరాదేవి, ప్రకాశం ఓదార్చుతారు. మరోసారి అందరం కలిసి లోయలో వెతుకుదామని ప్రకాశం అంటాడు. కళ్యాణ్ అక్కడికి వెళ్లివచ్చాడని అప్పటి నుంచి తనలో తానే కుమలిపోతున్నాడని ధాన్యలక్ష్మి నిజం బయటపెడుతుంది. కళ్యాణ్, అప్పు మనకు చెప్పకుండా ఏదో దాస్తున్నారని ధాన్యలక్ష్మి చెబుతుంది. మీరు లోయ దగ్గరకు వెళ్లి ఏం తెలుసుకున్నారని ఇద్దరిని నిలదీస్తుంది అపర్ణ. ఏమైందో చెప్పమని కనకం కూడా అప్పును అడుగుతుంది కనకం.
దేవుడు లేడు…
బావ మన కుటుంబానికి దేవుడు. ఆ దేవుడు ఉన్నాడని చెప్పనా…అసలు లేడని చెప్పనా అని అంటుంది అప్పు. ఆమె మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకవుతారు. రాజ్ ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయాడని అప్పు అంటుంది. అక్క దగ్గర పూర్తి నిజం చెప్పలేకపోయానని రాజ్ వాచీతో పాటు ఇతర వస్తువులను దుగ్గిరాల కుటుంబసభ్యులకు చూపిస్తుంది అప్పు. ఆ వస్తువులు చూడగానే కుప్పకూలిపోతుంది కనకం. తన బిడ్డ బతుకును దేవుడు అన్యాయం చేశాడని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ నిజం తెలిస్తే కావ్య ప్రాణాలతో ఉండదని ఎమోషనల్ అవుతుంది.
యామిని ప్లాన్ సక్సెస్…
రాజ్ చనిపోయినట్లు దుగ్గిరాల కుటుంబాన్నినమ్మించాలని యామినినే ప్లాన్ చేస్తుంది. రాజ్ వస్తువులను తన మనషులతో పోలీసులకు దొరికేటట్లు చేస్తుంది. రాజ్ చనిపోయాడని అందరూ నమ్మడంతో మరో కొత్త ప్లాన్‌కు రంగం సిద్ధం చేస్తుంది. కూతురు ఏం చేస్తుందో తెలియక యామిని తల్లిదండ్రులు కంగారు పడతారు.
రామ్‌గా మారిపోయిన రాజ్…
వారికి తన ప్లాన్ వివరిస్తుంది యామిని. రాజ్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నట్లు చెబుతుంది. ఇక నుంచి రాజ్ … రామ్‌గా మారిపోతున్నాడని అంటుంది. బావ అంటూ రాజ్ దగ్గరకు వస్తుంది యామిని. నువ్వు నాకు మళ్లీ దక్కుతావని అనుకోలేదని ఎమోషనల్ అవుతుంది. నువ్వు నా కోసమే బతికావమని అంటుంది.
యామిని తనను బావ అని పిలవడంతో రాజ్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఎవరు నువ్వు అని యామినిని అడుగుతాడు. అలా అడుగుతావేంటి నేను నీ యామినిని అని బదులిస్తుంది. యామిని ఎవరో తనకు తెలియదని రాజ్ అంటాడు. నాకు ఏది గుర్తు లేదు…ఎవరు తెలియదు, నేను ఎవరు…నా వాళ్లు ఎక్కడున్నారని రాజ్ కోపంగా అరుస్తాడు.
యామిని డైలాగ్స్…
మా బావ నన్ను గుర్తుపెట్టడం లేదని, చిన్నప్పటి నుంచి అతడిపైనే ప్రాణాలు పెట్టుకున్న నేను ఏమైపోవాలని రాజ్ ముందు డాక్టర్‌తో డైలాగ్స్ కొడుతుంది యామిని. ఆమె చెప్పేవి అన్ని నిజమేనని డాక్టర్ అనుకుంటాడు. నీలాంటి మంచివాడికి, మనసుకున్న వాడికి ఇలా జరగడం ఏంటి…నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటానని రాజ్‌తో అంటుంది యామిని.
ప్రేమ కాదు స్వార్థం…
యామిని డ్రామా చూసి అంతా నిజమేనని రాజ్ అనుకుంటాడు. యామిని ఫ్యామిలీ మెంబర్స్ తన వాళ్లు అని భ్రమపడతాడు. యామినిపై ఆమె తండ్రి ఫైర్ అవుతాడు. అతడి జీవితం, ఇళ్లు, భార్య సంగతి ఏంటని అంటాడు. ఏమైపోయినా నాకు సంబంధం లేదని యామిని ఆన్సర్ ఇస్తుంది. నీది ప్రేమ కాదని, పంతం, వ్యామోహం, స్వార్థం అని కూతురిపై కోప్పడుతాడు. తన ప్రేమ నిజమైంది కాబట్టే మళ్లీ రాజ్ తన సొంత మయ్యాడని అంటుంది. తల్లిదండ్రులకు బ్లాక్‌మెయిల్ చేస్తుంది యామిని.
రాజ్ నా మేనత్త కొడుకు…
రాజ్ నా మేనత్త కొడుకు…చిన్నప్పటి నుంచి మీరే పెంచి పెద్ద చేశారు. చదివించారు. నాతో పెళ్లి జరిపించాలని అనుకుంటారు. ఇంతలోనే అతడికి యాక్సిడెంట్ జరిగిందని తన నాటకం మొత్తం తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. ఇష్టం లేకపోయినా కూతురి కోసం నాటకం ఆడటానికి ఒప్పుకుంటారు యామిని తల్లిదండ్రులు.
ఒకే హాస్పిటల్‌లో…
రాజ్, కావ్య ఒకే హాస్పిటల్‌లో ఉంటారు. రాజ్‌ను అతడి కుటుంబసభ్యుల కంట పడకుండా వెంటనే డిశ్చార్జ్ చేయాలని యామిని ప్లాన్ చేస్తుంది. మరోవైపు యామిని తల్లిదండ్రులు బాధపడుతుండటం కనకం చూస్తుంది. ఏమైందని అడుగుతుంది.
తమకు కాబోయే అల్లుడు గత మర్చిపోయాడని, తమ కూతురు మాత్రం ఆ అబ్బాయినే పెళ్లిచేసుకుంటానని పట్టుపడుతున్నాడని క నకంతో యామిని తల్లిదండ్రులు చెబుతారు. అమ్మాయి మనసులో ఒక్కసారి ఇతనే తన భర్త అని నిర్ణయించుకున్న తర్వాత అంత సులభంగా కాదనుకోలేదని, అతడికే ఇచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేయడం కరెక్ట్ అని అంటుంది.
అప్పు పిలుపు…
రామ్‌గా మారిన రాజ్‌ను చూస్తానని కనకం అంటుంది. యామిని తల్లి ఆమెను రాజ్ దగ్గరకు తీసుకెళ్లబోతుంది. అప్పుడే కావ్య స్పృహలోకి వచ్చిందని అప్పు పిలవడంతో కనకం రాజ్‌ను చూడకుండానే అక్కడి నుంచి తిరిగొస్తుంది.
నా దగ్గర ఎందుకు ఉన్నారు…
స్పృహలోకి వచ్చిన కావ్య…రాజ్ క్షేమంగా ఉంటాడని, తన భర్తకు ఏం కాదని అంటుంది. యాక్సిడెంట్ జరిగిన చోటుకు వెళతానని అంటుంది. ఇంత మంది ఉండి తన భర్తను వెతుకకుండా ఏం చేస్తున్నారని కోపంగా అరుస్తుంది. రాజ్ కనిపించకుండా పోతే మీరంతా నా దగ్గర ఎందుకు ఉన్నారని అడుగుతుంది.
కన్న కొడుకు కనిపించకపోయినా కనీసం కోడలినైనా కాపాడుకోవాలని తిండి, నిద్ర మానుకొని నీ దగ్గర ఉన్నారని కనకం అంటుంది. రాజ్ తప్ప నాకు ఎవరు ముఖ్యం కాదని అంటూ కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రాజ్ లేడు…ఇక రాడు…
రాజ్ చనిపోయాడని నమ్మిన కుటుంబసభ్యులు తిండ్రి, నిద్ర మానేసి బాధపడుతుంటారు. కానీ కావ్య మాత్రం రాజ్ బతికే ఉన్నాడని నమ్ముతుంది. రాజ్ లేడు, ఇక రాడు అని మీకు అర్థమైనట్లు కావ్యకు అర్థం కావడం రుద్రాణి సెటైర్లు వేస్తుంది. రాజ్‌ను అందరి ముందు తిరిగి తీసుకొచ్చి నిలబెడతానని కావ్య అంటుంది. రాజ్‌కు పొలమారడంతో ఎవరు తలుచుకుంటునట్లున్నారని యామిని తండ్రి అంటాడు. ఇంకేవరు ఆయన భార్య అయ్యింటుందని యామిని తల్లి పొరపాటుగా నోరు జారుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.