



Best Web Hosting Provider In India 2024

Drinking Water In Summer: వేసవిలో నీరు తాగేటప్పుడు మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా? చెక్ చేసుకుని ఆరోగ్యం కాపాడుకోండి!
Right Way To Drink Water In Summer: వేసవిలో నీరు తాగేటప్పుడు మీరు తప్పుగా తాగుతున్నారా.. లేదా అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా మిగిలిన రోజుల కంటే సమ్మర్లో నీరు ఎక్కువగా తాగుతుంటాం. అలా, నీరు తాగేటప్పుడు 85 శాతం మందికి పైగా తప్పుగా తాగి సమస్యలకు గురవుతున్నారట!

వేసవి వచ్చిందంటే మిమ్మల్ని తరచూ డీహైడ్రేషన్ సమస్య వేదిస్తుంటుంది. దీని ఫలితంగా వ్యక్తికి హీట్ స్ట్రోక్, తలతిరగడం, తలనొప్పి, గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సిందే. దాని కోసం రోజులో సరిపడ మొత్తంలో నీరు తాగుతుండాలి. అలా నీరు తాగడం వల్ల శరీరాన్ని డీటాక్సిఫై చేయడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చాలా మంది సమస్యలు రాకుండా ఉండేందుకు, నీరు ఎక్కువగా తాగుతారు. కానీ, కొన్ని పొరబాట్లు చేస్తుంటారట. అధ్యయనాల ప్రకారం చూస్తే, దాదాపు 85 శాతం మందికి పైగా నీరు తప్పుగా తాగుతారని తెలిసింది.
దీని కారణంగా జుట్టు రాలడం, మలబద్ధకం, గుండె జబ్బులకు కారణమవుతుందట. అందుకే నీరు త్రాగే సరైన విధానం ఏంటి?, తప్పుగా నీరు త్రాగడం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? నీరు ఎలా, ఎప్పుడు త్రాగాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నీరు త్రాగడంలో మీకూ ఇవే సందేహాలుంటే, ఆయుర్వేద శాస్త్రంలో వాటికి సరైన సమాధానం ఉంది. అదేమిటో తెలుసుకుందామా!
తప్పుగా నీరు త్రాగడం వల్ల వచ్చే వ్యాధులు
- ఆర్థరైటిస్
- గుండె జబ్బులు
- మలబద్ధకం
- అజీర్ణం
- జీర్ణ సంబంధిత సమస్యలు
- చర్మ సంబంధిత సమస్యలు
- జుట్టు రాలడం
నీరు త్రాగే సరైన విధానం ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, నీటిని ఎల్లప్పుడూ కూర్చొని త్రాగాలి. ఈ విధంగా త్రాగడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. కడుపు కండరాలు సడలింపుగా ఉంటాయి. వ్యక్తి సాధారణ లేదా వెచ్చని నీటిని మాత్రమే త్రాగాలి. మీరు రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగడం ఇంకా మంచిది.
నీరు త్రాగుతున్నప్పుడు ఈ తప్పులు చేయకండి
ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగకండి
చాలా మంది దప్పికగా ఉందనే ఫీలింగ్‌లో ఎక్కువగా నీరు తాగేస్తారు. ఇలా నీరు తాగడం ముమ్మాటికీ తప్పే. ఈ విధంగా త్రాగడం వల్ల శరీరం నీటిని సరిగ్గా గ్రహించలేదు. వీలైనంత వరకూ బయటకు పంపడానికే ప్రయత్నిస్తుంది. దీని వల్ల శరీరానికి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు దక్కవు. అంతేకాకుండా, ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం వల్ల లాలాజలంతో కలవకపోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. దీని వల్ల నీరు జీర్ణం కాకుండా, వ్యక్తికి కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కలిగిస్తుంది. అందుకే నీటిని ఎల్లప్పుడూ నెమ్మదిగా, కొద్ది మొత్తంలోనే ఎక్కువ సార్లుగా త్రాగాలి.
ఎప్పుడు నీరు త్రాగాలి?
సగటున ఒక వ్యక్తి రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొలతల మాట అటుంచి, దప్పికగా ఉన్న ప్రతిసారీ నీరు త్రాగాలని చెబుతున్నారు. అంతేకాకుండా, ఉదయం ఖాళీ కడుపుతో 2 గ్లాసుల నీరు, భోజనం చేయడానికి 40 నిమిషాల ముందు, భోజనం చేసిన 40 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి.
నీరు ఎలాంటప్పుడు తాగకూడదు:
- భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు. కొద్ది విరామం తర్వాత మాత్రమే నీరు తాగాలి.
- ఫిజికల్ యాక్టివిటీతో బాగా అలసిపోయినప్పుడు వెంటనే నీరు తాగకూడదు.
- లివర్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు నీరు తాగే పరిమాణం గురించి ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి.
- వ్యక్తి బరువు తక్కువగా ఉన్నప్పుడు కూడా నీరు తక్కువగా తీసుకోవాలి.
సంబంధిత కథనం