Gunde Ninda Gudi Gantalu Serial: మీనాకు బాలు స్వీట్ స‌ర్‌ప్రైజ్ – కుళ్లుకున్న రోహిణి – పుట్టింట్లో మౌనిక ఫంక్ష‌న్

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: మీనాకు బాలు స్వీట్ స‌ర్‌ప్రైజ్ – కుళ్లుకున్న రోహిణి – పుట్టింట్లో మౌనిక ఫంక్ష‌న్

 

గుండె నిండా గుడి గంట‌లు మార్చి 11 ఎపిసోడ్‌లో మీనా కోసం స్పెష‌ల్‌గా హ‌ల్వా తెప్పిస్తాడు బాలు. ప్ర‌భావ‌తి, రోహిణి ముందే తానే స్వ‌యంగా మీనాకు స్వీట్ తినిపిస్తాడు బాలు. ఆ సీన్ చూసి కుళ్లుకుంటుంది ప్ర‌భావ‌తి.

 

జాబ్ దొర‌క‌లేద‌ని డిస‌పాయింట్ అవుతుంటాడు మ‌నోజ్. అత‌డికి రోహిణి, ప్ర‌భావ‌తి ధైర్యం చెబుతారు. అప్ప‌డే అక్క‌డికి బాలు ఎంట్రీ ఇస్తాడు.జాబ్ దొరికిందా అని మ‌నోజ్‌ను అడుగుతాడు. వ‌చ్చే టైమ్ వ‌చ్చిన‌ప్పుడు అన్ని వ‌స్తాయి. మ‌నోజ్ అలిసిపోయాడ‌ని, వాడిని టార్చ‌ర్ పెట్ట‌కుండా నీ ప‌నేదో నువ్వు చూసుకుంటే మంచిద‌ని బాలుపై ప్ర‌భావ‌తి ఫైర్ అవుతుంది.

 

జాబ్ సంపాదించ‌డం అంటే కారులో క‌ద‌ల‌కుండా కూర్చొని గేర్లు మార్చినంత ఈజీ కాద‌ని రోహిణి సెటైర్లు వేస్తుంది. అంద‌రికి నోర్లు భ‌లే లేస్తున్నాయ‌ని…మ‌నోజ్‌ జాబ్ వ‌స్తే న‌న్ను కాల్చుకుతినేలా ఉన్నార‌ని బాలు అంటాడు.

మీనా కోసం హ‌ల్వా…

మీనాను పిలుస్తాడు బాలు. నీకోసం హ‌ల్వా తీసుకొచ్చాన‌ని అంటాడు. నేను నా కొడుకుకు ఉద్యోగం రాలేద‌ని బాధ‌ప‌డుతుంటే…నువ్వు నీ పెళ్లానికి స్వీట్ తినిపిస్తున్నావా సిగ్గులేక‌పోతే స‌రి అని ప్ర‌భావ‌తి రుస‌రుస‌లాడుతుంది.

త‌న ఫ్రెండ్ రాజేష్ మాడుగుల వెళ్లాడ‌ని, వాడికి డ‌బ్బులు ఇచ్చి నీ కోసం తెప్పించాన‌ని మీనాతో అంటాడు బాలు. డ్రైవ‌ర్ జాబ్ చేసేవాడికి ఎదుగుద‌ల ఉండ‌ద‌ని, పెళ్లాన్ని సంతోషంగా చూసుకోలేడ‌ని ఎవ‌రో అన్నారు. వారికి స‌మాధాన‌మే అని రోహిణికి హ‌ల్వా చూపిస్తాడు బాలు.

ఓవ‌ర్ యాక్ష‌న్‌…

మీనాకు హ‌ల్వా తినిపించ‌బోతాడుబాలు. అత్త‌య్య‌, రోహిణి, మ‌నోజ్ ఉండ‌టంతో వారి ముందు హ‌ల్వా తిన‌డానికి మీనా ఇబ్బంది పెడుతుంది. మీ ఓవ‌ర్ యాక్ష‌న్ ఆపండి ఇంట్లోకి వెళ్ల‌మ‌ని మ‌నోజ్ క‌సురుకుంటాడు. తాను ఇక్క‌డే తినిపిస్తాన‌ని బాలు, వాస్తు బాగుంద‌ని ఆన్స‌ర్ ఇస్తాడు బాలు. వారి ముందే మీనాకు హ‌ల్వా తినిపిస్తాడు. వీళ్ల వేషాలు చూడ‌లేక చ‌స్తున్నాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది.

ఇబ్బందిగా ఉంది…

హ‌ల్వా ఎలా ఉంద‌ని మీనాను అడుగుతాడు బాలు. ఇబ్బందిగా ఉంద‌ని మీనా బ‌దులిస్తుంది. నేను అడుగుతుంది హ‌ల్వా రుచి గురించి అని బాలు అంటాడు. హ‌ల్వా బాగుంద‌ని చెప్పి బాలును లోప‌లికి తీసుకెళుతుంది మీనా. పావుకిలో హ‌ల్వా తీసుకొచ్చి పెద్ద విల్లా కొన్నంత హ‌డావిడి చేస్తున్నాడ‌ని, మ‌నోజ్ కాలిగోటికి కూడా బాలు స‌రిపోడ‌ని ప్ర‌భావ‌తి అంటుంది. బాలు మాట‌ల‌తో రోహిణి ఎమోష‌న‌ల్ అవుతుంది. మ‌నోజ్ పొర‌పాటు చేశాడ‌ని, కానీ త‌న భ‌ర్త‌ను ఉద్దేశించి హీనంగా మాట్లాడ‌టం స‌రికాద‌ని అంటుంది.

 

బాలుకు సెన్స్ లేదు…

బాలు గురించి ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, వాడి నోటికి తాళం ఉండ‌ద‌ని, ఎంతొస్తే అంత మాట్లాడుతుంటాడ‌ని, ప్ర‌భావ‌తి అంటుంది. బాలుకు సెన్స్ లేద‌ని, క‌నిపిస్తే చాలు మ‌నోజ్‌ను అవ‌మానించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడ‌ని రోహిణి అంటుంది.

మ‌లేషియా నుంచి నాన్న వ‌స్తే…

మ‌లేషియా నుంచి మీ నాన్న వ‌స్లే బాలు నోరూ మూయించ‌వ‌చ్చ‌ని ప్ర‌భావ‌తి. వెంట‌నే మీ నాన్న‌ను పిలిపించ‌మ‌ని రోహిణితో అంటుంది. మా నాన్న‌తో నాకు మాట్లాడ‌ట‌మే న‌చ్చ‌డం లేద‌ని టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌బోతుంది రోహిణి. మీ మ‌ధ్య ఉన్నది కోప‌మే కానీ శ‌త్రుత్వం కాద‌ని, నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోక‌పోయినా మీ నాన్న‌కు నీపై చాలా ప్రేమ ఉంద‌ని, మీ తండ్రీకూతుళ్ల బంధం ఎప్ప‌టికీ తెగిపోకూడ‌ద‌ని ప్ర‌భావ‌తి అంటుంది.

నిజం చెబితే ఇదే ఆఖ‌రి రోజు…

మీ నాన్న‌తో మాట్లాడ‌టానికి వేరే ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్ప‌మ‌ని రోహిణిని అడుగుతుంది ప్ర‌భావ‌తి. మ‌లేషియాలో నాన్న లేడ‌నే నిజం చెబితే ఈ ఇంట్లో ఇదే నాకు ఆఖ‌రు రోజు అవుతుంద‌ని రోహిణి మ‌న‌సులో అనుకుంటుంది. వెంట‌నే మీ నాన్న‌కు ఫోన్ చేసి ఇక్క‌డికి ర‌మ్మ‌న‌మ‌ని రోహిణికి ఆర్డ‌ర్ వేస్తుంది ప్ర‌భావ‌తి. మ‌లేషియా ఇప్పుడు నా చావుకు వ‌చ్చింద‌ని రోహిణి కంగారు ప‌డుతుంది. ఏదో ఒక‌టి చేసి మ‌లేషియా డ్రామాకు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టాల‌ని అనుకుంటుంది.

 

మౌనిక‌ ఫంక్ష‌న్‌…

మౌనిక‌కు తాళి మార్చే ఫంక్ష‌న్ చేయాల‌ని అనుకుంటుంది ప్ర‌భావ‌తి. ప‌ర్లేదు మౌనిక గురించి బాగానే ఆలోచిస్తున్నావ‌ని స‌త్యం అంటాడు. త‌ల్లిగా కూతురి గురించి అంత‌గా ఆలోచించిన దానివి…అత్త‌గా కోడ‌ళ్ల గురించి ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భార్య‌ను అడుగుతాడు స‌త్యం. వాళ్ల‌కు మ‌న ఇంట్లో ఏం త‌క్కువైంద‌ని ప్ర‌భావ‌తి బ‌దులిస్తుంది.

పెళ్లిళ్లు సమ‌స్య‌లు ఎలా అవుతాయి…

మ‌నోజ్‌, రోహిణికి పెళ్లై చాలా ఏళ్ల‌యింద‌ని, ఎప్పుడో పెళ్లి అయినా రోహిణి తాళి బొట్టు మార్చే ఫంక్ష‌న్ ఎందుకు జ‌రిపించ‌లేద‌ని ప్ర‌భావ‌తిని అడుగుతాడు స‌త్యం. మ‌నోజ్‌, మౌనిక‌, ర‌వి పెళ్లిళ్ల‌ను స‌మ‌స్య‌లుగా అంటుంది ప్ర‌భావ‌తి. పెళ్లిళ్లు శుభ‌కార్యాల‌యితే స‌మ‌స్య‌లు అంటారు ఏంటి అని అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన మీనా అంటుంది. ఎంట్రా పూల కంపు కొడుతుంది అనుకున్నా…నువ్వేనా అని ప్ర‌భావ‌తి వెట‌కారం ఆడుతుంది. పందికి ఏం తెలుసు ప‌న్నీరు వాస‌న అని స‌త్యం సెటైర్ వేస్తాడు.

బాలు మీనా త‌ప్ప‌…

ఇంట్లో అంద‌రూ నాకు బాగానే క‌నిపిస్తారు…ఒక్క బాలు, మీనా త‌ప్ప అని ప్ర‌భావ‌తి అంటుంది. నీ గురించి వీళ్ల‌ద్ద‌రికే బాగు తెలుసు క‌దా అని స‌త్యం చెబుతాడు. మీనా కూడా ముందు రోహిణికే తాళి మార్చే ఫంక్ష‌న్ చేయ‌డం మంచిద‌ని స‌ల‌హా ఇస్తుంది.

 

నాన్న వ‌ర‌ల్డ్ టూర్‌…

అప్పుడే అక్క‌డికి రోహిణి రావ‌డంతో ఫంక్ష‌న్ గురించి ఆమెకు మీనా, స‌త్యం చెబుతారు. నాన్న వ‌ర‌ల్డ్ టూర్‌లో ఉన్నార‌ని, ఫోన్ చేయ‌గానే ఆయ‌న ఇక్క‌డికి రావ‌డం కుద‌ర‌ద‌ని రోహిణి స‌మాధానం దాట‌వేస్తుంది. ముందు మౌనిక‌కే పంక్ష‌న్ జ‌రిపించ‌మ‌ని రోహిణి అంటుంది. ప్ర‌భావ‌తి కూడా అదే ప‌ట్టుప‌ట్ట‌డంతో మౌనిక‌కే ఫంక్ష‌న్ జ‌రిపించ‌డానికి స‌త్యం అంగీక‌రిస్తాడు.

మ‌నోజ్ కారు షోరూమ్‌…

మ‌లేషియా స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ప‌రిష్కారం కోసం విద్య ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది రోహిణి. మ‌లేషియా నాన్న‌ను అడిగి మ‌నోజ్‌తో కార్ షో రూమ్ పెట్టించ‌మ‌ని ప్ర‌భావ‌తి అడుగుతుంద‌ని, ఏం చేయాలో తెలియ‌డం లేద‌ని రోహిణి కంగారు ప‌డుతుంది. తాలిబొట్టు ఫంక్ష‌న్ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డింది స్నేహితురాలికి చెబుతుంది. మీ నాన్న వ‌ర‌ల్డ్ టూర్‌లో ఉన్నాడ‌ని ఇంకా ఎన్నాళ్లు న‌మ్మిస్తాన‌ని, ఇదే చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజు మీ వాళ్ల‌కు నీపై డౌట్ వ‌స్తుంద‌ని విద్య అంటుంది. రోజురోజుకు అబ‌ద్ధాల్లో కూరుకుపోతున్నాన‌ని, వీటికి ఎలా పుల్‌స్టాప్ పెట్టాలో తెలియ‌డం లేద‌ని రోహిణి అంటుంది.

ఆరుస్తావా…తీరుస్తావా…

మౌనిక ఫంక్ష‌న్ కోసం రెండున్న‌ర ల‌క్ష‌ల ఖ‌ర్చు తేలుతుంది. ఆ డ‌బ్బు ఎలా అడ్జెస్ట్ చేయాలో తెలియ‌డం లేద‌ని స‌త్యం అంటాడు. అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన మ‌నోజ్ ఏమైంద‌ని అడుగుతాడు. నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అని మ‌నోజ్‌ను కోప్ప‌డుతుంది ప్ర‌భావ‌తి.

 

బోడి స‌ల‌హాలు ఇవ్వ‌కు…

ఫంక్ష‌న్ గురించి చెబుతాడు స‌త్యం. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బు లేద‌ని మ‌నోజ్ అంటాడు. తాను అప్రెంటిస్‌గానే జాబ్ చేస్తున్నాన‌ని, డ‌బ్బులు ఇవ్వ‌లేన‌ని ర‌వి చెబుతాడు. మౌనిక ఫ్యామిలీ కోటీశ్వ‌రులు క‌దా..వాళ్ల‌కు ఏం త‌క్కువా…మ‌న ద‌గ్గ‌ర లేన‌ప్పుడు ఫంక్ష‌న్ చేయ‌డం అవ‌స‌ర‌మా అని మ‌నోజ్ అంటాడు.

నీ ద‌గ్గ‌ర లేన‌ప్పుడు సెలైంట్‌గా ఉండు బోడి స‌ల‌హాలు ఇవ్వ‌కు అని మ‌నోజ్‌పై కోప్ప‌డుతుంది ప్ర‌భావ‌తి.

మౌనిక ఫంక్ష‌న్ కోసం తాను డ‌బ్బులు ఇస్తాన‌ని శృతి అంటుంది. తాను కూడా కొంత స‌ర్ధుతాన‌ని రోహిణి అంటుంది.

నేను ఒక్క‌డినే జ‌రిపిస్తా…

ఫంక్ష‌న్ కోసం ఎవ‌రూ చందాలు వేసుకొని డ‌బ్బులు ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని, చెల్లి ఫంక్ష‌న్‌ను నేను ఒక్క‌డినే జ‌రిపిస్తాన‌ని బాలు అంటాడు. ముందు నువ్వు ఇంటికొచ్చిన వాళ్ల‌తో గొడ‌వ‌లు ప‌డ‌కుండా ఉంటే చాల‌ని ప్ర‌భావ‌తి అంటుంది.

బాలు ఉండ‌గా…

మౌనిక తాళిబొట్టు ఫంక్ష‌న్ గురించి నీల‌కంఠం, సంజుకు చెబుతారు స‌త్యం, ప్ర‌భావ‌తి. బాలు ఉండ‌గా ఆ ఇంట్లో అడుగుపెట్టేది లేద‌ని సంజు అంటాడు. నీల‌కంఠం కూడా అదే స‌మాధానం ఇస్తాడు. మీకు ఫంక్ష‌న్ కావాలో, బాలు కావాలో తేల్చుకోమ‌ని అంటాడు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024