


Best Web Hosting Provider In India 2024

OTT Comedy: ఓటీటీ మరో భాషలో అందుబాటులోకి వచ్చిన విశ్వక్‍సేన్ కామెడీ మూవీ.. ఈ విషయంపై ఆసక్తి!
OTT Comedy Movie: లైలా చిత్రం ఇప్పుడు మరో భాషలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లో మరో డబ్బింగ్ భాష ఆడియో యాడ్ అయింది. ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే ఆసక్తి నెలకొంది.

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ నటించిన లైలా చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. విశ్వక్ లేడీ గెటప్, ట్రైలర్, బాయ్‍కాట్ వివాదం.. ఈ అంశాలు ఈ మూవీకి బజ్ విపరీతంగా తెచ్చిపెట్టాయి. అయితే, రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రీసెంట్‍గానే లైలా సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, నేడు (మార్చి 11) మరో భాషలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
తమిళంలో ‘లైలా’
లైలా సినిమా తెలుగులో మార్చి 9న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కానీ పెద్దగా వ్యూస్ దక్కడం లేదు. ఈ తరుణంలో నేడు ఈ చిత్రం తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. లైలా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో!
లైలా చిత్రానికి థియేట్రికల్ రన్‍లో నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. అసభ్యత అనే కామెంట్లు వినిపించాయి. రెండు రోజుల కిందటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చినా పెద్దగా ఆదరణ దక్కలేదు. మళ్లీ ట్రోల్స్ వచ్చాయి. అయితే, లైలా మూవీ ఇప్పుడు తమిళ డబ్బింగ్‍లో రావటం ఇంట్రెస్టింగ్‍గా ఉంది. తమిళ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే ఆసక్తి నెలకొంది. తెలుగు ప్రేక్షకుల నుంచి ఔట్‍రైట్‍గా నెగెటివ్ స్పందన అందుకున్న ఈ చిత్రం.. తమిళంలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
లైలా మూవీలో సోనూ మోడల్ పాత్రతో పాటు లైలా అనే లేడీ గెటప్‍లోనూ విశ్వక్ కనిపించారు. ఈ మూవీలోని డబుల్ మీనింగ్ డైలాగ్‍లో ప్రేక్షకులకు చిరాకు తెప్పించేశాయి. ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. బోల్డ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించగా.. మిస్ ఫైర్ అయింది. ఈ మూవీ భారీగా విమర్శలను మూటగట్టుకుంది.
లైలా చిత్రం కమర్షియల్ డిజాస్టర్ అయింది. రూ.2కోట్ల కలెక్షన్లనే దక్కించుకుంది. ఈ చిత్రం దాదాపు రూ.16 కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని సమాచారం. మొత్తంగా ఆ స్థాయి నష్టాలతో విశ్వక్ కెరీర్లో భారీ డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‍గా నటించారు. అభిమన్యు సింగ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, పృథ్వి కీలకపాత్రలు పోషించారు.
లైలా మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. అన్ని విభాగాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఈ మూవీ బాక్సాఫీస్ డిజాస్టర్ అయింది.
ఈ వారంలో ‘బీ హ్యాపీ’
బీ హ్యాపీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి మార్చి 14న నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ హిందీ ఫ్యామిలీ డ్రామా మూవీలో అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ చేశారు. రెమో డిసౌజా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. తండ్రీకూతుళ్ల బంధం చుట్టూ ఈ ఎమోషనల్ డ్రామా చిత్రం సాగుతుంది.
సంబంధిత కథనం