



Best Web Hosting Provider In India 2024

Chapati Pindi: చపాతీ పిండిని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి తిరిగి వాడుతున్నారా? అదెంత ప్రమాదకరమంటే
Chapati Pindi: చపాతీ పిండిని ఒక్కసారే కలుపుకొని రెండు మూడు రోజులు పాటు వాడేవారు ఎంతోమంది. దాన్ని ఫ్రిజ్లో నిల్వ ఉంచి అవసరమైనప్పుడు వాడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం ఆరోగ్యకరం కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

చపాతీలు, రోటీలు అధికంగా తింటున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. బరువు తగ్గాలన్న కాంక్షతో రాత్రిపూట చపాతీలనే తింటున్నారు. ప్రతిరోజూ చపాతీలు చేసుకునేందుకు బద్దకించి పిండిని ఒకసారే కలిపి రెండు మూడు రోజులపాటు ఫ్రిజ్ లో నిల్వ చేసుకుంటారు. ప్రతిరోజు రాత్రి కాస్త ముద్దను తీసి చపాతీలుగా ఒత్తుకొని కాల్చుకొని తింటున్నారు. ఇలా ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పిండితో చపాతీలు చేసుకుని తినడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచిన పిండి ఎంతో హానికరం. దీనివల్ల ఆరోగ్యపరంగా ఎన్నో నష్టాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
ఫ్రిజ్లో ఉంచిన పిండితో చపాతీలు చేయడం వల్ల ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.
చపాతీ పిండి ఇలా వాడవద్దు
రిఫ్రిజిరేటర్ లో ఉంచిన చపాతీ పిండి త్వరగానే పులిసిపోతుంది. ఇందులో ఈస్ట్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన కు కారణం అవుతుంది. ఆ పిండితో చేసిన చపాతీలు తినడం వల్ల కొంతమందిలో అలెర్జీలు మొదలవుతాయి. దీర్ఘకాలంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వికారం తరచుగా వాంతులు అవ్వడం వంటివి కనిపిస్తూ ఉంటాయి.
రిఫ్రిజిరేటర్ లో ఉంచిన పిండి జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. ఇది పొట్టలోని జీవక్రియ రేటు మందగించేలా చేస్తుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. పేగుల్లోని మంచి బాక్టీరియాకు హాని కలుగుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థకు విపరీతమైన ముప్పును తెచ్చిపెడుతుంది. విరేచనాలు పొట్ట ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.
రిఫ్రిజిరేటర్ లో ఉంచిన చపాతీ పిండి త్వరగా పేగు ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఈ పేగులలో బ్యాక్టీరియా, మైక్రోబయోటా సమతుల్యత చెదిరిపోవచ్చు. దీనివల్ల మిమ్మల్ని దీర్ఘకాలం పాటు వేధించే సమస్యలు వస్తాయి. కాబట్టి చపాతీలు తయారు చేసుకోవడానికి ఎప్పటికప్పుడే పిండిని కలుపుకొని వాడడం మంచిది. ఫ్రిజ్లోనే నిల్వ చేసి పిండిని వాడడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తాజా ఆహారాన్ని ఇలా వండుకొని తినేందుకు ప్రయత్నించండి. లేకుంటే దీర్ఘకాలంలో మీకు సమస్యలు తప్పకపోవచ్చు.
చపాతీ పిండిని కలుపుకున్నప్పుడు ఒక స్పూను నూనె వేసి కలపడం వల్ల రోటీలు, చపాతీలు మెత్తగా వస్తాయి. చపాతీ పిండిని నిల్వ చేయకుండా వండుకోవడమే ఉత్తమం. మరీ అవసరం అయితే 24 గంటల కన్నా ఎక్కువ సమయం ఫ్రిజ్ లో ఉంచకుండా వాడేయడం మంచిది.
చపాతీ, రోటీలు ప్రతిరోజూ తినేవారు త్వరగా బరువు తగ్గుతారని ఎంతో మంది నమ్మకం. అన్నం తినడానికి బదులు చపాతీలు తినడం కూడా ఆరోగ్యకరం.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం