





Best Web Hosting Provider In India 2024

Dont’s in Peroid Time: పీరియడ్స్ సమయంలో ఇబ్బందిని పెంచే 5 పనులేంటో తెలుసా? ఎక్కువవుతాయి!
Dont’s in Peroid Time: పీరియడ్స్ సమయంలో మహిళలకు సమస్యలు అనేకం. ఈ సమస్య తీవ్రత తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నంలో ఏమేం చేయాలో ఆలోచించి ఉంటారు. కానీ, ఏం చేయకూడదో ఆలోచించారా? ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి. లేదంటే, నొప్పి మరింత పెరుగుతుంది.

మహిళలందరికీ కామన్‌గా ఉండే సమస్య పీరియడ్స్ నొప్పి. నెలసరి సమయంలో సహజంగానే ప్రతి మహిళ ఈ సమస్యను ఎదుర్కొంటుంది. పీరియడ్స్ సమయంలో వారు గడిపే 5 రోజులు, నెలలోని ఇతర రోజులతో పోలిస్తే చాలా కష్టంగా అనిపిస్తాయి. ఈ సమయంలో పొట్ట, నడుము నొప్పి లేదా మానసిక మార్పులు చాలా సహజం. కానీ, కొన్నిసార్లు పీరియడ్స్ సమయంలో చేసే కొన్ని తప్పులు నెలసరి కష్టాలను మరింత పెంచవచ్చు. మీరు కూడా అలాంటి తప్పులు చేస్తున్నారా? దీని వల్ల మీకు తీవ్రమైన నొప్పి వస్తుందా? పీరియడ్స్ సమయంలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో యోని ప్రాంతాన్ని పదేపదే కడగకండి
చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో ప్రతిసారీ టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు యోని ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. పీరియడ్స్ సమయంలో యోని ప్రాంతాన్ని పదేపదే నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం పెరుగుతుంది. దీనికి కారణం యోనిని నీటితో శుభ్రం చేసిన తర్వాత చాలా మంది ఆ భాగాన్ని తుడుచుకోకుండా వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరిగి, ఇన్ఫెక్షన్కు కారణం అవుతుంది.
పీరియడ్స్ సమయంలో వాక్సింగ్ చేయకండి
యోని ప్రాంతం మహిళలకు సున్నితమైన భాగం, నెలసరి సమయంలో ఆ ప్రాంతంలో సున్నితత్వం మరింత పెరుగుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో యోని ప్రాంతంలో వాక్సింగ్ లేదా షేవింగ్ చేయకూడదు. వాస్తవానికి, యోని ప్రాంతంలో ఉన్న జుట్టు చర్మాన్ని రక్షిస్తుంది. వాక్సింగ్ లేదా షేవింగ్ చేసి వాటిని తొలగించినప్పుడు, క్రిములు, మురికి నేరుగా చర్మంతో సంబంధం కలిగి ఉంటాయి, దీని వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.
అధిక కెఫైన్ లేదా మద్యం సేవనం
మద్యం లేదా కెఫైన్ రెండూ శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి చేస్తాయి. వీటిని అధికంగా తీసుకోవడం ఎవరికీ మంచిది కాదు, కానీ ముఖ్యంగా మహిళలు అధికంగా మద్యం లేదా కెఫైన్ తీసుకోకూడదు. పీరియడ్స్ సమయంలో కెఫైన్, మద్యం తీసుకోవడం మానేయాలి. లేకపోతే వీటి వల్ల పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
అధిక ఒత్తిడి కూడా హానికరం
మహిళలకు అధిక ఒత్తిడి వారి పీరియడ్ నొప్పిని పెరిగేలా చేస్తుంది. అధిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది పీరియడ్స్‌పై ప్రభావం చూపిస్తుంది. పీరియడ్ అసమతుల్యత వల్ల నొప్పి, కడుపులో ఇబ్బంది, మానసిక మార్పులు పెరుగుతాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఒత్తిడి స్థాయిని తగ్గించడం అవసరం. దీనికి యోగా, ధ్యానం సహాయపడతాయి.
పీరియడ్స్ సమయంలో డైటింగ్ చేయకండి
సాధారణ రోజుల్లో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి డైటింగ్ చేయడం మంచిది. కానీ, పీరియడ్స్ సమయంలో డైటింగ్ చేయకూడదు. పీరియడ్స్ సమయంలో హార్మోన్లు అసమతుల్యతకు గురవుతాయి. వాటిని సమతుల్యం చేయడానికి రోజుకు కనీసం 5 సార్లు భోజనం లేదా పోషకాహరం తీసుకోవడం అవసరం. పీరియడ్స్‌లో ఆరోగ్యంగా ఉండటానికి వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఈ రోజుల్లో అధిక ఉప్పు, నూనెలు, మసాలాలు కలిపి వండిన ఆహారం తినడం తగ్గించండి.
సంబంధిత కథనం