




Best Web Hosting Provider In India 2024

OTT Romantic Comedy: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో మాత్రం అదరగొడుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. ట్రెండింగ్‍లో టాప్
OTT Romantic Comedy: మనమే చిత్రం థియేటర్లలో అనుకున్న ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో మాత్రం ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ట్రెండింగ్‍లో టాప్‍నకు వచ్చేసింది.

మనమే చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనే నిరీక్షణ చాలా కాలం సాగింది. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన 8 నెలలకు గతవారం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి థియేటర్లలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు దక్కలేదు. పాటలు, ట్రైలర్‌తో మంచి క్రేజ్ వచ్చినా.. గతేడాది జూన్ 7న రిలీజయ్యాక ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో మాత్రం మనమే మూవీ అదరగొడుతోంది.
ట్రెండింగ్‍లో టాప్
మనమే సినిమా గత వారం మార్చి 7న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీకి మొదటి నుంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రైమ్ వీడియో నేషనల్ ట్రెండింగ్‍లో టాప్‍లోకి దూసుకొచ్చేసింది.
ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల విభాగంలో మనమే చిత్రం టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఒక్కటే స్ట్రీమ్ అవుతున్నా.. మంచి వ్యూస్ సాధిస్తోంది ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం.
థియేటర్లలో నిరాశ ఎదురైనా..
మనమే చిత్రానికి థియేట్రికల్ రన్‍లో నిరాశ ఎదురైంది. మిక్స్డ్ టాక్ రావటంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆ రేంజ్‍లో కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. సుమారు రూ.19కోట్ల కలెక్షన్లతో మోస్తరుగా ఆడింది. అయితే, 8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం అదరగొడుతోంది. నేషనల్ రేంజ్‍లో ప్రైమ్ వీడియోలో టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ, కామెడీతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టితో పాటు సీరత్ కపూర్, బాలనటుడు విక్రమాదిత్య, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, ఆయేషా ఖాన్ కీరోల్స్ చేశారు.
మనమే చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. బిట్ సాంగ్‍లతో కలుపుకొని మొత్తంగా ఈ చిత్రం పదికిపైగా పాటలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్సే స్టూడియోస్ పతాకాలపై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రొడ్యూజ్ చేశారు.
రీసెంట్‍గా ‘లైలా’
విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఆదివారం (మార్చి 7) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా తెలుగులో వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 థియేటర్లలో రిలీజైన కామెడీ యాక్షన్ మూవీ లైలా డిజాస్టర్ అయింది. సుమారు మూడు వారాలకు ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
సంబంధిత కథనం