




Best Web Hosting Provider In India 2024

Crime Thriller OTT: ఐదు నెలలకు ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ఐదు కథలతో సాగే మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ?
Crime Thriller OTT: త్రయం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఐదు నెలలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఐదు కథలు సాగుతుంటాయి. ఈ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

మలయాళ నటులు ధ్యాన్ శ్రీనివాసన్, సన్నీ వేన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘త్రయం’ చిత్రం గతేడాది అక్టోబర్ నెలలో థియేటర్లలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సంజిత్ చంద్రసేనన్ దర్శకత్వం వహించారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ త్రయం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
త్రయం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు (మార్చి 11) స్ట్రీమింగ్కు వచ్చేసింది. మలయాళం ఆడియోలో ఒక్కటే ప్రస్తుతం స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇచ్చింది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
సుమారు ఐదు నెలలకు..
త్రయం చిత్రం గతేడాది అక్టోబర్ 25వ తేదీన థియేటర్లలో రిలీజైంది. మిశ్రమ స్పందన దక్కడంతో థియేట్రికర్ రన్ ఆశించిన స్థాయిలో సాగలేదు. కలెక్షన్లను కూడా నిరాశాజనకంగా వచ్చాయి. ఈ చిత్రం ఆలస్యంగా సుమారు ఐదు నెలలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఐదు స్టోరీలతో..
త్రయం మూవీని ఐదు కథలతో సంజిత్ చంద్రసేనన్ తెరకెక్కించారు. ఈ ఐదు కథలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. ఐడియా బాగానే ఉన్నా దాన్ని తెరపై ఎఫెక్టివ్‌గా చూపలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నరేషన్ విషయంలో మిక్స్డ్ టాక్ వచ్చింది.
త్రయం చిత్రంలో ధ్యాన్ శ్రీనివాసన్, సన్నీ వేన్తో పాటు అనువర్గీస్, రాహుల్ మాధవన్, చందూనాథ్, అనార్కలీ మరిక్కర్, ప్రతీ గినో, నిరంజ్ రాజు, షాలు రహీం, కార్తీక్ రామకృష్ణనన్ కీలకపాత్రలు పోషించారు. ఈమూవీని అజిత్ వినాయక ఫిల్స్మ్ పతాకం ప్రొడ్యూజ్ చేసింది.
త్రయం స్టోరీలైన్
త్రయం మూవీ ఓ రాత్రి జరిగే ఐదు స్టోరీలతో ఉంటుంది. డ్రగ్స్ డీలర్ హ్యారీ.. డెలివరీ ఇచ్చేందుకు వెళ్లి ఓ వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తాడు. అంజలిని బ్లాక్మెయిల్ చేసే విజయ్, అతడి ఫ్రెండ్ వల్ల కూడా ఓ రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ఆషికీ ఓ షాప్‌లో దొంగతనం చేస్తాడు. తన లవర్ జోమోన్ చనిపోయి ఉండడాన్ని ఎల్సా చూస్తుంది. ఆ బాడీని విన్సెంట్ కనిపెడతాడు. వీటన్నింటినీ రజినీ పరిశీలిస్తూ ఉంటుంది. మొత్తంగా ఈ స్టోరీలన్నింటికీ ఒకదానితో ఒకటి లింక్ ఉంటుంది. ఆ పరిణామాలు ఎందుకు జరిగాయి.. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ స్టోరీల మధ్య సంబంధం ఏంటి అనేది త్రయం చిత్రంలో ఉంటుంది.
కాగా, తెలుగు సినిమా లైలా రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ హీరోగా నటించారు. గత నెల ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన లైలా మూవీ తాజాగా ప్రైమ్ వీడియో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.
అలాగే, శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మనమే మూవీ గత వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనే స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లలో రిలీజైన 8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి వ్యూస్ దక్కుతున్నాయి.
సంబంధిత కథనం