Amaravati Expenditure: అమరావతి నిర్మాణానికి రూ.64వేల కోట్ల ఖర్చు.. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి…

Best Web Hosting Provider In India 2024

Amaravati Expenditure: అమరావతి నిర్మాణానికి రూ.64వేల కోట్ల ఖర్చు.. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి…

Sarath Chandra.B HT Telugu Published Mar 11, 2025 12:31 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Mar 11, 2025 12:31 PM IST

Amaravati Expenditure: అమ‌రావ‌తి నిర్మాణానికి 64,721 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ ప్ర‌క‌టించారు. మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తి నిర్మాణానికి 30 వేల ఎక‌రాలు కావాల‌ని అసెంబ్లీలో చెప్పిన జ‌గ‌న్….ఆ త‌ర్వాత ప్లేట్ ఫిరాయించార‌న్నారు.

అమరావతి నిర్మాణానికి రూ64వేల కోట్లు
అమరావతి నిర్మాణానికి రూ64వేల కోట్లు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Amaravati Expenditure: రాజ‌ధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు, భూములు అమ్మ‌డం,లీజుల ద్వారా నిధులు సేక‌రిస్తామ‌న్నారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి నారాయ‌ణ స‌మాధాన‌మిచ్చారు.

అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు,భ‌వ‌న నిర్మాణాలు,ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, ఎల్పీఎస్ మౌళిక స‌దుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖ‌ర్చ‌వుతుందని వివరించారు. .ఈ నిధుల‌ను వివిధ రూపాల్లో సేక‌రించి అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డుతున్నామని చెప్పారు.

బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు, బ్యాంకుల నుండి లోన్ లు,కేంద్ర ప్ర‌భుత్వం నుండి గ్రాంటుల‌ను పొందడం ద్వారా అమరావతికి నిధుల సేకరిస్తున్నామని చెప్పారు. రైతుల‌కు అభివృద్ది చేసిన ప్లాట్ల‌ను ద‌శ‌ల వారీగా మూడేళ్ల‌లో అప్ప‌గించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందన్నారు.

ఐదేళ్లలో తీవ్ర జాప్యం…

2019-24 మ‌ధ్య విధాన‌ప‌ర‌మైన అనిశ్చితుల కార‌ణంగా ఈ ప్ర‌క్రియ‌లో జాప్యం జ‌రిగిందన్నారు.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గారి మీద‌ న‌మ్మ‌కంతో 58 రోజుల్లోనే 34 వేల ఎక‌రాలు రైతులు ప్ర‌భుత్వానికి ఇచ్చారని…ప్ర‌పంచంలోనే టాప్ 5 రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండాల‌ని ముఖ్య‌మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసార‌ని చెప్పారు.

రాజ‌ధాని నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చులో ప్ర‌పంచ బ్యాంకు,ఏడీబీ క‌లిసి 13,400 కోట్లు రుణం ఇస్తున్నాయ‌ని చెప్పారు. KFW బ్యాంకు 5 వేల కోట్లు లోన్ ఇస్తుందని, హ‌డ్కో నుంచి 11000 కోట్లు రుణం రెండు మూడు రోజుల్లో వ‌స్తుందని చెప్పారు.

కేంద్రం గ్రాంట్ కింద మ‌రో 1560 కోట్లు ఇస్తుందని అమ‌రావ‌తి లోప‌ల భూములు అమ్మ‌డం,లీజు ద్వారా అలాగే జాతీయ,అంత‌ర్జాతీయ మార్కెట్ లో త‌క్కువ వ‌డ్డీకి లోన్ తీసుకోవ‌డం ద్వారా మిగిలిన నిధులు స‌మీక‌రిస్తామ‌ని మంత్రి నారాయ‌ణ అసెంబ్లీలో తెలిపారు.

అమ‌రావ‌తిలో 106 ప్ర‌భుత్వ‌,ప్ర‌భుత్వేత‌ర‌ రంగ సంస్థ‌లు త‌మ కార్యాల‌యాలు ఏర్పాటుచేసేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్త‌యి ప‌నులు ప్రారంభించేందుకు లెట‌ర్ ఆఫ్ అగ్రిమెంట్ లు ఇచ్చేందుకు అథారిటీ అనుమ‌తి తీసుకుంటున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి…

అమ‌రావ‌తిలో ట్రంక్ రోడ్లు(మెయిన్ రోడ్లు) 165 అడుగులు,185 అడుగుల‌తో రెండేళ్ల‌లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎల్పీఎస్ రోడ్లు మూడేళ్ల‌లో పూర్తి చేస్తామని స‌గానికి పైగా నిర్మాణం జ‌రిగిన అధికారుల భ‌వ‌నాలు ఏడాదిన్న‌ర‌లో…మిగ‌తావి రెండేళ్లు,అసెంబ్లీ,సెక్ర‌టేరియ‌ట్,హైకోర్టు నిర్మాణాల‌ను మూడేళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు.

2014-19 మ‌ధ్య‌లో అమ‌రావ‌తిలో 131 సంస్థ‌ల‌కు 1277 ఎక‌రాలు కేటాయించగా….గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన ప‌రిణామాల‌తో కొన్ని సంస్థ‌లు వెన‌క్కి వెళ్లిపోయాయని అన్నారు.గ‌తంలో కేటాయించిన మొత్తం 31 సంస్థ‌ల‌కు 629.3 ఎక‌రాలు కొన‌సాగిస్తుండ‌గా, రెండు సంస్థ‌ల‌కు 5.5 ఎకరాలు వేరొక ప్రాంతాల్లో కేటాయిస్తున్నామ‌న్నారు.మ‌రో 16 సంస్థ‌ల‌కు గ‌తంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయ‌డంతో పాటు వేరొక చోట‌ 48.74 ఎక‌రాలు కేటాయించామ‌న్నారు.

13 సంస్థలకు భూకేటాయింపులు రద్దు..

మ‌రోవైపు 13 సంస్థ‌ల‌కు 177.24 ఎక‌రాలు గ‌తంలో చేసిన కేటాయింపులు ర‌ద్దు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా 683.6 ఎక‌రాలను వివిధ సంస్థ‌ల‌కు కేటాయిస్తూ ఈనెల 10న జ‌రిగిన కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీలో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.

అమ‌రావ‌తి నిర్మాణానికి 30 వేల ఎక‌రాలు కావాల‌ని జ‌గ‌న్ గారు ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ప్ర‌భుత్వం మార‌గానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్క‌లాట ఆడి ఎక్క‌డా రాజ‌ధాని చేయ‌లేదన్నారు.గ‌త ఐదేళ్ల‌లో రాజ‌ధాని కి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారని శాడిజంతో క‌క్ష సాధింపుతో ఆర్ – 5 జోన్ చేసి 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారని వారికి కూడా ప్ర‌త్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని చెప్పారు.వేరొక చోట స్థ‌లం కేటాయించి అమ‌రావ‌తి భూముల‌ను రాజ‌ధాని కోసం తీసుకుంటామ‌న్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాaaలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

AmaravatiCrdaAp AssemblyAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024