





Best Web Hosting Provider In India 2024

Tips For Glass Hair: మీ జుట్టు మునుపటిలా ఒత్తుగా, మెరిస్తూ కనిపించాలంటే ఈ పాకిస్థానీ డాక్టర్ చిట్కాలను పాటించాల్సిందే!
Tips For Glass Hair: పాకిస్థానీ మహిళల జుట్టు అందం నిజంగా ఎంతో ప్రశంసనీయం. మీరు కూడా వారిలా నల్లగా, ఒత్తుగా అందంగా, మెరిస్తూ కనిపించే కురులను కోరుకుంటే పాకిస్థానీ డాక్టర్ షెరిన్ ఫాతిమా షేర్ చేసిన హెం మేడ్ హెయిర్ కేర్ చిట్కాలను పాటించండి. అందరూ కుళ్లుకునేలా అందమైన కురులను పొందండి.

మీ జుట్టు ముందులా మెరుస్తే, మృదువుగా లేదని బాధపడుతున్నారా? జుట్టు రాలడం, వెంట్రుకలు పొడిబారడం వంటి సమస్యలను ఈ మధ్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారా? అయితే ఇది మీకోసమే. పాకిస్థానీ డాక్టర్ షెరిన్ ఫాతిమా ఈ సమస్యలకు సులభమైన పరిష్కారాన్ని అందించారు. నిజానికి పాకిస్థానీ మహిళల జుట్టు అందంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పొడవుగా, ఒత్తుగా, నల్లగా మెరుస్తూ కనిపించే వారి కురులు ఎవ్వరినైనా కుళ్లుకునేలా చేస్తాయి.
మీరు కూడా వారిలా నల్లగా, అందంగా, మెరిసిపోతూ, దళసరిగా ఉండే జుట్టును కోరుకుంటే పాకిస్థానీ డాక్టర్ షెరిన్ ఫాతిమా హెయిర్ కేర్ రొటీన్‌ను ఫాలో అవండి. ఆమె తన హెయిర్ కేర్ రొటీన్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందమైన ఆకర్షణీయమైన వెంట్రుల కోసం మస్టర్డ్ ఆయిల్(ఆవ నూనె) హెయిర్ కేర్ చిట్కాలను తెలిపింది. ఈ చిట్కాలు జుట్టు రాలడం, వెంట్రుకలు పొడిబారడం వంటి సమస్యల నుంచి కూడా చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తాయట. అవేంటో తెలుసుకోండి. ఒత్తుగా, మెరిస్తూ కనిపించే కురులను పొందండి.
డాక్టర్ షెరిన్ ఫాతిమా హోం మేడ్ సీక్రెట్ హెయిర్ ప్యాక్:
కావల్సిన పదార్థాలు:
- ఆవ నూనె – ఒక చిన్న కప్పు
- ఆర్గాన్ ఆయిల్ సీరం – 5 చెంచాలు
- వేడి నీరు – పావు కప్పు
ఆవ నూనె హెయిర్ ప్యాక్ తయారీ విధానం..
- అన్ని రకాల జుట్టు సమస్యలు నయం కావడంతో పాటు అందమైన మెరిసే జుట్టును సొంతం చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆవ నూనె వేయండి.
- తరువాత దీంట్లోనే ఐదు చెంచాల వరకూ ఆర్గాన్ ఆయిల్ సీరం వేసి కలపండి.
- రెండూ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో పావు కప్పు వరకూ వేడి నీరు పోసి బాగా కలపండి. కలిపే కొద్దీ ఈ మిశ్రమం చిక్కటి క్రీములా తయారవుతుంది.
అంతే మీ కురుల అందాన్ని పెంచే హెయిర్ ప్యాక్ రెడీ అయినట్టే.
ఆవ నూనె హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేయాలి?
- ఆవ నూనె హెయిర్ ప్యాక్ మిశ్రమాన్ని క్రీమీ ద్రవాన్ని ఏర్పడే వరకు కలపిన తర్వాత వెంట్రుకల కుదుళ్ల నుంచి చివర్ల వరకూ మొత్తం తలంతా బాగా పట్టించాలి.
- తర్వాత జుట్టుకు ఏదైనా బట్టతో కవర్ చేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి.
- ఆ తర్వాత జుట్టును కాస్త తడి చేసి మీకు నచ్చిన హైడ్రేటింగ్ షాంపూను తలంతా అప్లై చేసుకుంటూ శుభ్రంగా తలస్నానం చేయాలి.
- తలస్నానం చేసిన తర్వాత వెంట్రుకలు తడి ఆరకముందే మీకు నచ్చిన హెయిర్ సీరంను వెంట్రుకలకు అప్లై చేసుకువాలి.
- ఆ తర్వాత జుట్టును గాలికి ఆరనివ్వాలి. హెయిర్ డ్రైయర్ తో కాకుండా సహజమైన గాలికి ఆరడం మంచి ఫలితాలను అందిస్తుంది.
ఇలా వారానికి కనీసం రెండు సార్లు ఆవ నూనె హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుని తలస్నానం చేశారంటే కొద్ది రోజుల్లో అందమైన, ఒత్తైన కురులను మీ సొంతం చేసుకుంటారు. ఆవ నూనెలో జుట్టు సంరక్షణకు కావాల్సిన విటమిన్ E, ఒమేగా-3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు వేర్లను బలపరుస్తాయి, జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి, వెంట్రుకల పొడిబారడాన్ని తగ్గిస్తాయి. అలాగే కురులు ఆరోగ్యంగా మెరిస్తూ కనిపించేలా చేస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పడం లేదు. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం