Adhi Dha Surprisu Song: ఇవేం స్టెప్‍లు: కేతిక శర్మ పాటను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు.. శేఖర్ మాస్టర్‌పై మళ్లీ ట్రోలింగ్

Best Web Hosting Provider In India 2024

Adhi Dha Surprisu Song: ఇవేం స్టెప్‍లు: కేతిక శర్మ పాటను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు.. శేఖర్ మాస్టర్‌పై మళ్లీ ట్రోలింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 11, 2025 02:51 PM IST

Robinhood – Adhi Dha Surprisu Song: రాబిన్‍హుడ్ చిత్రంలోని ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటపై విమర్శలు వస్తున్నాయి. ఈ పాట లిరికల్ సాంగ్ రాగా దీంట్లో కేతిక శర్మ డ్యాన్స్ స్టెప్‍లపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Adhi Dha Surprisu Song: ఇవేం స్టెప్‍లు: కేతిక శర్మ పాటను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు.. శేఖర్ మాస్టర్‌పై మళ్లీ ట్రోలింగ్
Adhi Dha Surprisu Song: ఇవేం స్టెప్‍లు: కేతిక శర్మ పాటను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు.. శేఖర్ మాస్టర్‌పై మళ్లీ ట్రోలింగ్

నితిన్, శ్రీలీల హీరోహీయిన్లుగా నటించిన రాబిన్‍హుడ్ చిత్రం మార్చి 28వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్లను ఈ మూవీ టీమ్ మొదలుపెట్టేసింది. ఈ కామెడీ యాక్షన్ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. రాబిన్‍హుడ్ చిత్రం నుంచి ‘అదిదా సర్‌ప్రైజ్’ అంటూ ఓ స్పెషల్ సాంగ్ తాజాగా వచ్చింది. కేతిక శర్మ ఈ పాటలో చిందేశారు. దీనిపై ఇప్పుడు రచ్చసాగుతోంది.

స్టెప్స్ అసభ్యంగా ఉన్నాయంటూ..

రాబిన్‍హుడ్ నుంచి ‘అదిదా సర్‌ప్రైజ్’ పాట లిరికల్ వీడియో సోమవారం (మార్చి 10) రిలీజైంది. ఈ లిరికల్ వీడియోలో కేతిక శర్మ చేసిన కొన్ని డ్యాన్స్ స్టెప్స్ కూడా రివీల్ చేసింది మూవీ టీమ్. ఈ స్పెషల్ పాట హుషారైన బీట్‍తో ఉంది. అయితే, ఈ పాటలో కేతిక శర్మ చేసిన కొన్ని డ్యాన్స్ స్టెప్‍లపై నెటిజన్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.

బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు

‘అదిదా సర్‌ప్రైజ్’ పాటలో ఒంటిపై ఉన్న స్కర్టును లాగుతూ కేతిక శర్మ చేసిన హుక్‍స్టెప్‍పై కొందరు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. మరికొన్ని డ్యాన్స్ మూమెంట్లపై కూడా ఫైర్ అవుతున్నారు. వర్గర్‌గా ఈ డ్యాన్స్ స్టెప్‍లు ఉన్నాయని, ఈ పాటను సెన్సార్ బోర్డు బ్యాన్ చేయాలంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఈ పాటలోని పదాలపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

శేఖర్ మాస్టర్‌పై మళ్లీ ట్రోల్స్

రాబిన్‍హుడ్‍లో ఈ అదిదా సర్‌ప్రైజ్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసింది పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. గతేడాది మిస్టర్ బచ్చన్ చిత్రంలో సితార పాటకు గాను ఆయన తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవల డాకు మహరాజ్ చిత్రంలో దబిడి దిబిడి పాటకు కంపోజ్ చేసిన స్టెప్‍లపైనా నెటిజన్లు ఫైర్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు అదిదా సర్‌ప్రైజ్ పాటతో మరోసారి విమర్శల పాలవుతున్నారు శేఖర్.

శేఖర్ మాస్టర్‌లో క్రియేటివిటీ తగ్గిపోయిందని, అందుకే ఇలాంటి అసభ్యకరమైన స్టెప్స్ వరుసగా కంపోజ్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదేం కొరియోగ్రఫీ, ఇవేం స్టెప్‍లు అంటూ ఫైర్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ ఇక రిటైర్ అయిపోతే బెస్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి స్టెప్‍లను డైరెక్టర్ అయినా ఎలా ఫైనలేజ్ చేశారని, ఇది వర్గారిటీ అంటూ విరుచుపడుతున్నారు. మొత్తంగా ఈ పాటతో శేఖర్ మాస్టర్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతోంది.

రాబిన్‍హుడ్ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్‍కు మాస్ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి ఈ సాంగ్‍ను పాడారు. కేతిక శర్మ ఈ ప్రత్యేక గీతంలో చిందేశారు. ఈ సాంగ్‍పై విమర్శలు తీవ్రవతుండటంతో మూవీ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్.. రాబిన్‍హుడ్ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. నితిన్, వెంకీ కాంబోలో గతంలో భీష్మ సూపర్ హిట్ అయింది. వీరిద్దరూ మళ్లీ కలిసి చేస్తుండటంతో రాబిన్‍హుడ్‍పై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్లలో జోరు పెంచింది టీమ్. మరో వారంలో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024