




Best Web Hosting Provider In India 2024

CM Chandrababu : గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం, నేడు సమస్యలపై చర్చిస్తున్నాం- సీఎం చంద్రబాబు
CM Chandrababu : గత ఐదేళ్లు అసెంబ్లీల్లో బూతులు విన్నామని, ఇప్పుడు సమస్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. . రౌడీయిజం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రౌడీయిజం చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి పారిపోవాలని సూచించారు.

CM Chandrababu : వైసీపీ ప్రభుత్వంలో.. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కొట్టేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, పకడ్బందీ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు.
అసెంబ్లీలో బూతులు లేవు
“గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం. సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు లేవు… సమస్యలపైనే చర్చలు చేస్తున్నాం. ఆడబిడ్డలపై అత్యాచారం చేసి తప్పించుకోవాలని అనుకుంటే అదే చివరి రోజు అవుతుంది. రౌడీయిజం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో రౌడీ అనే వాళ్లు ఉండటానికి వీల్లేదు. రౌడీయిజం చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి పారిపోండి. రౌడీయిజం చేసి తప్పించుకుంటామంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దు. ఒక్క ఎకరాలో కూడా గంజాయి వేసినా చర్యలు తీవ్రంగా ఉంటాయి. గంజాయి, డ్రగ్స్‌పై చేస్తున్న యుద్ధం ఆపేదే లేదు” – సీఎం చంద్రబాబు
అసెంబ్లీలో వివేకా హత్య కేసుపై మాట్లాడిన సీఎం చంద్రబాబు…తాను ఎన్నికల హడావుడిలో ఉండి వివేకా హత్యపై అర్థం కానీ పరిస్థితి ఏర్పడిందన్నారు. హోంమంత్రి, డీజీపీ, అధికారులు ఇంతమంది ఉండి కూడా వివేకా హత్య అర్ధం కాలేదన్నారు. తామంతా ముందు గుండెపోటు అనుకున్నామని చెప్పారు. వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత పోస్ట్ మార్టం నిర్వహించాలని కోరితే అసలు విషయం తెలిసిందని చెప్పారు. నా చేతిలో కత్తి ఫొటో పెట్టి నారా సుర రక్త చరిత్ర అని వైసీపీ అనుకూల మీడియాలో రాయించారన్నారు. తన రాజకీయ జీవితంలో హత్య రాజకీయాలకు తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
హత్యా రాజకీయాలకు తావులేదు
“నేరస్థులు ఎలా ట్రాప్ లో పెడతారనేందుకు ఉదాహరణ వివేకా హత్య. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మొదట చెప్పారు. సునీత పోస్టుమార్టం అడగకపోయి ఉంటే అంత్యక్రియలు చేసేవారు. ఏ టీవీ గుండెపోటు అని చెప్పారో… వారే సాయంత్రానికి వార్త మార్చారు. నారాసుర రక్తచరిత్ర అని తప్పుడు ప్రచారం చేశారు. ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామని ధీమా వాళ్లది. హత్యా రాజకీయాల మరక అంటకుండా 45 ఏళ్లు రాజకీయాలు చేశా. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసినా.. ప్రజా క్షేత్రంలో పోరాడి అలాంటివారిని శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేశా. రాజకీయ ముసుగులో నేరాలు-ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే సాగనివ్వను” – సీఎం చంద్రబాబు
మూడుసార్లు షేక్ చేస్తే చాలు
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో అధికార వైసీపీని ప్రశ్నిస్తే, టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు చెప్పారు. మహిళల భద్రత కోసం శక్తియాప్‌ను ప్రారంభించామన్నారు. మహిళలు శక్తియాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేస్తే.. ఆ వెంటనే 6 నుంచి 9 నిముషాల్లో పోలీసులు వచ్చి రక్షిస్తారన్నారు. పోలీసులు అప్రతత్తంగా ఉండాలని లేకుంటే వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం తెచ్చిన దిశా యాప్ దిక్కుమాలిన యాప్‌గా తయారైందని విమర్శించారు.
సంబంధిత కథనం
టాపిక్