




Best Web Hosting Provider In India 2024

Summer Travel: సింహాలు చిరుతలు తిరుగుతూ ఉంటే చూడాలని ఉందా? గిర్ నేషనల్ పార్క్‌లో జంగిల్ సఫారీకి వెళ్లండి, ఎంత ఖర్చు?
గిర్ నేషనల్ పార్క్ కుటుంబంతో కలిసి గడిపేందుకు ఉత్తమ గమ్యస్థానం. ఇక్కడ వన్యప్రాణులు తిరుగుతూ ఉంటే చూసి ఆనందించవచ్చు. ఈ వేసవి సెలవుల్లో గిర్ నేషనల్ పార్క్ సందర్శించేందుకు ప్లాన్ వేసుకోండి.

అడవిలో తిరుగుతున్న సింహాలను, పులులను చూడాలన్న కోరిక ఎంతోమందికి ఉంటుంది. అలా అని అడివికి వెళ్లి చూసేంత ధైర్యం ఎవరికీ ఉండదు. అయితే గిర్ నేషనల్ పార్కులో జంగిల్ సఫారీకి వెళితే మీరు ఎంచక్కా ఆ అడవిలో తిరుగుతున్న పులులు. సింహాలను చూడవచ్చు. అలాగే మీరు సురక్షితంగా కూడా ఉండవచ్చు. ఈ వేసవి సెలవుల్లో గిరి నేషనల్ పార్క్ కు ఎలా వెళ్లాలో తెలుసుకోండి.
గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
గిరి నేషనల్ పార్క్ గుజరాత్ లో ఉంది. మీరు విమానంలో వెళ్లాలనుకుంటే దీనికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం రాజ్‌కోట్‌లోని కిషోర్ కుమార్ గాంధీ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గిర్ నేషనల్ పార్క్. అలాగే గిర్కి సమీప విమానాశ్రయం డయ్యూ విమానాశ్రయం కూడా. ఇది 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకున్నాక టాక్సీ లేదా బస్సులో గిర్ నేషనల్ పార్కుకు వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు రైలులో రావాలనుకుంటే గిర్కి దగ్గరగా ఉన్న స్టేషన్ జునాగడ్. ఇది 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక మరొక రైల్వే స్టేషన్ కూడా గిర్ కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాని పేరు వేరావెల్. ఈ రెండు రైల్వే స్టేషన్లకు చేరుకున్న తర్వాత మీరు కారులో గిర్ నేషనల్ పార్క్ చేరుకోవచ్చు.
గిర్ నేషనల్ పార్కులో జంగిల్ సఫారీని ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్లాక కూడా బుక్ చేసుకోవచ్చు. జంగిల్ సఫారీ సమయాలు ఉదయం 6 నుంచి ఉదయం 9 వరకు ఉంటాయి. రెండో ట్రిప్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ఇక మూడో ట్రిప్ ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు ఉంటాయి. రోజులో మూడుసార్లు మాత్రమే జంగిల్ సఫారీని నిర్వహిస్తారు.
చూసేందుకు ఉత్తమ సమయం
గిర్ నేషనల్ పార్క్ సందర్శించడానికి ఉత్తమ సమయం పొడిగా ఉండే వేసవి కాలమే. వర్షాకాలం మొదలైందంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు గిర్ నేషనల్ పార్క్ మూసివేస్తారు.
గిర్ లో వసతి
గిర్ లో ఎక్కడ ఉండాలని ఆలోచిస్తున్నారా? గిర్ నేషనల్ పార్క్‌కు వచ్చే వాళ్లకోసం అక్కడ హోటల్లు, రిసార్టులు, అతిథి గృహాలు అధికంగానే ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళాక కూడా బుక్ చేసుకోవచ్చు.
టిక్కెట్ రేట్లు
జంగల్ సఫారీ కోసం ముందుగా ఒక జీపును బుక్ చేసుకోవాలి. దీని ధర 2500 నుంచి 4500 రూపాయల వరకు ఉంటుంది. నలుగురి నుంచి ఎనిమిది మంది కూర్చోవచ్చు. అలాగే గైడ్ ను పెట్టుకోవాల్సి వస్తుంది. వారికి కూడా 500 రూపాయలు చెల్లించాలి. ఇక జంగిల్ సఫారీ చేసేందుకు పర్మిషన్ తీసుకోవాలి. దీనికి కూడా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఖర్చవుతుంది. అలాగే జంగిల్ సఫారీ చేసేందుకు ఒక్క వ్యక్తికి వెయ్యి రూపాయలు టికెట్ ను ఛార్జ్ చేస్తారు.
హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి రాజ్‌కోట్ వెళ్లేందుకు ట్రైన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి రాజ్‌కోట్ జంక్షన్ వరకు ఇవి తిరుగుతాయి. అలాగే కాచిగూడ నుంచి కూడా ఒక ట్రైన్ ఉంది. ట్రైన్లలో వెళ్తే చాలా తక్కువ ధరలోనే మీరు రాజ్‌కోట్ చేరుకోవచ్చు. ట్రైన్ టికెట్లు 650 రూపాయల నుంచి 2040 రూపాయల వరకు ఉంటాయి.
అదే విమానంలో వెళ్లాలనుకునేవారు ముందుగా ముంబై చేరుకొని ముంబై నుంచి రాజ్‌కోట్ వెళ్ళవచ్చు. లేదా హైదరాబాద్ నుంచి కూడా విమాన సర్వీసులు ఉన్నాయి. ఒక్కొక్కరి టికెట్టు అయిదు వేలరూపాయలు దాకా అవుతుంది.
సంబంధిత కథనం