



Best Web Hosting Provider In India 2024

భర్తలు తమ భార్యల నుండి కచ్చితంగా దాచే మూడు విషయాలు ఇవే
భార్యాభర్తల మధ్య అనుబంధం ఎంతో తీయనైనది. అది ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. వారిద్దరూ ఒకరితో ఒకరు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. కానీ భర్త మాత్రం ఒక మూడు విషయాలను కచ్చితంగా భార్య దగ్గర దాచే ఉంచుతాడు.

భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు ఏ విషయాలు దాచకూడదని చెబుతారు. వారిద్దరి బంధం నమ్మకాన్నే పునాదిగా చేసుకొని ఉంటుందని అంటారు. అది పూర్తి శాతం నిజం. అయితే భార్యలు అన్ని విషయాలు భర్తల దగ్గర బహిరంగంగా చెప్పేస్తారు. కానీ భర్తలు మాత్రం ఒక మూడు విషయాలను తమ భార్యల దగ్గర దాస్తారు.
కొన్ని విషయాలు వారి సంబంధాన్నే నాశనం చేస్తాయి. అనుబంధాన్ని బలంగా ఉంచుకోవాలంటే భార్యాభర్తలు తమ సంబంధంలో పారదర్శకంగా ఉండాలి. కానీ భర్త కొన్ని విషయాలను భార్యకు చెప్పకుండా ఎందుకు దాచిపెడతారో, ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి.
భావోద్వేగాలు
భర్తలు తరచుగా తమ భావోద్వేగాలను భార్యల నుండి దాచుకుంటారు. దీనికి సమాజం కూడా ఒక కారణమని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ సమాజంలో పురుషులు బలవంతులని అంటారు. వారు ఏ నొప్పినైనా భరిస్తారని, వారు అమ్మాయిల్లా ఏడవరని కామెంట్లు విసురుతారు. అలాంటి నమ్మకాలు ఎక్కువగా ఉండడంతో భర్తలకు బాధనిపిస్తున్నా ,ఏడుపు వస్తున్నా కూడా దాన్ని అదిమిపెట్టి భార్యలతో కానీ ఎవరితో గాని షేర్ చేసుకోరు. ఇలా చేయడం వల్ల తామ బలహీనమవుతామేమోనని అనుకుంటూ ఉంటారు. భార్య దగ్గర ఏడుపును దాచుకునే భర్తలు ఎంతోమంది ఉన్నారు.
ఆర్థిక పరిస్థితి
ఎంతోమంది భర్తలు తమ ఆదాయ వివరాలను భార్యతో పంచుకునేందుకు ఇష్టపడరు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని తన కుటుంబానికి, భార్యకు చెప్పేందుకు ఇష్టపడరు. పైగా అలాంటి సమస్యలు ఏవీ లేవని అబద్ధం చెబుతారు. దీనికి వెనుక ఉన్న కారణం అతను తన భార్యను లేదా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకోవడమే. ఆర్థిక పరిస్థితి బాలేదని తెలిస్తే భార్య కలవరపడుతుంది. అలా కలవరపడడం ఆయనకు ఇష్టం లేదు. మంచి భర్తలు ఇలా ఆర్థిక పరిస్థితి గురించి ఎక్కువగా దాస్తూ ఉంటారు.
ఆఫీసులో ఒత్తిడి
ఆఫీసులో ఒత్తిడి పడే మగవారు ఎంతోమంది. బాస్ తో ఇబ్బంది పడి మానసికంగా కుంగిపోతున్న భర్తలు కూడా ఎంతోమంది ఉంటారు. వారు తమ ఆఫీసు ఒత్తిడిని భార్యలతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఇది భార్యకు ఒత్తిడిని కలిగిస్తుందని అతను అనుకుంటాడు. అందుకే పురుషులు ఆఫీస్ పని, ఒత్తిడి, బాస్ వేధింపుల గురించి అంతర్గతంగా బాధపడుతూ ఉంటారు. కానీ బయటికి కనిపించనివ్వరు. ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి విషయాలను షేర్ చేసుకోరు.
ఇవన్నీ మంచి భర్తలు మాత్రమే చేస్తారు. తన భార్య బాధపడకూడదనే వారు ఇలా ప్రవర్తిస్తారు. అయితే ఇప్పుడు భార్యలు కూడా భర్తలను అర్థం చేసుకునే స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి భర్తలు అన్ని విషయాలు తమ భార్యలతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. భర్త తన భావోద్వేగాలను దాచుకోవడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి బాధ అనిపించినప్పుడు భార్యకు చెప్పుకుని ఏడ్చేస్తే మనసులోని భారం తగ్గిపోతుంది. అలాగే ఒత్తిడిని కూడా షేర్ చేసుకోవాలి. ఆర్ధిక ఇబ్బందులు కూడా భార్యతో షేర్ చేసుకుంటే ఆమె సాయం చేసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్