




Best Web Hosting Provider In India 2024

OTT Free Streaming: ఓటీటీలో ఈ సినిమాలను ఫ్రీగా చూసేయండి.. కొన్ని రోజులే ఛాన్స్!
Zee 5 OTT Free Streaming: జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఓ ఆఫర్ తీసుకొచ్చింది. తమ ప్లాట్‍ఫామ్‍లోని కొన్ని సినిమాలు, సిరీస్‍ను ఉచితంగా చూసే సదుపాయం కల్పించింది. దీనికి డెడ్‍లైన్ కూడా ఫిక్స్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ వరుసగా కొత్త కంటెంట్ తీసుకొస్తోంది. నయా సినిమాలు, వెబ్ సిరీస్‍లతో దూకుడు చూపిస్తోంది. క్రమంగా సబ్‍స్కైబర్లను పెంచుకుంటోంది. ఈ క్రమంలో జీ5 ఓటీటీ సంస్థ ఓ ఆఫర్ తీసుకొచ్చింది. తమ ప్లాట్‍ఫామ్‍లో ఉన్న కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లను సబ్‍స్కిప్షన్ లేని వారు కూడా ఉచితంగా చూసే సదుపాయం కల్పిస్తోంది. జీ5 మనోరంజన్ ఫెస్టివల్ అంటూ దీన్ని తీసుకొచ్చింది. ఆ వివరాలివే..
మార్చి 30 వరకు..
మార్చి 30వ తేదీ వరకు జీ5 మనోరంజన్ ఫెస్టివల్ ఉంటుందని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. అప్పటి వరకు జీ5 ఓటీటీలో ఆ ఫెస్టివల్ కింద ఉండే కొన్ని సినిమాలు, సిరీస్‍లను ఉచితంగా చూడొచ్చని వెల్లడించింది. ఏ ప్లాన్ తీసుకోని వారు కూడా ఈ కంటెంట్ చూడొచ్చని పేర్కొంది. మార్చి 30ను ఈ ఫెస్టివల్‍కు డెడ్‍లైన్‍గా పెట్టింది.
ఈ తెలుగు చిత్రాలు ఉచితంగా..
జీ5 మనోరంజన్ ఫెస్టివల్ సందర్భంగా కొన్ని తెలుగు చిత్రాలను కూడా ఫ్రీ స్ట్రీమింగ్‍కు జీ5 అందుబాటులో ఉంచింది. బంగార్రాజు, గామి, మాచర్ల నియోజకవర్గం, వరుడు కావలెను, రైటర్ పద్మభూషణం, విమానం సినిమాలను జీ5 ఓటీటీలో ఈ ఫెస్టివల్ కాలంలో ఉచితంగా చూడొచ్చు. మరిన్ని చిత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
హిందీలో కిసీ కా భాయ్ కిసీ కా జాన్, రక్షాబంధన్, ఊంఛాయ్, లవ్ హాస్టల్ సహా మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లు జీ5 ఫ్రీ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉన్నాయి. కన్నడ, తమిళం, పంజాబీ సహా మరికొన్ని భాషలకు చెందిన కొన్ని సినిమాలు ఉచితంగా చూడొచ్చు. మార్చి 30వ తేదీ వరకు ఇవి ఫ్రీగా చూసే ఛాన్స్ ఇస్తోంది జీ5.
జీ5 మనోరంజన్ అని ఓ ప్రత్యేకమైన సెక్షన్‍ను ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి తెచ్చింది జీ5 ప్లాట్‍ఫామ్. ఇందులోని చిత్రాలు, సిరీస్‍లను సబ్‍స్క్రిప్షన్ లేకున్నా మార్చి 30 వరకు ఉచితంగా చూడొచ్చు. ఇతర వేరే కంటెంట్ చూడాలంటే జీ5 సబ్‍స్క్రిప్షన్ ఉండాల్సిందే.
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జీ5 ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ బ్లాక్‍బస్టర్ చిత్రం మార్చి 1న స్ట్రీమింగ్‍కు వచ్చింది. భారీ వ్యూస్‍తో ఇప్పటికే కొన్ని ఓటీటీ రికార్డులను బద్దలుకొట్టేసింది. ఇప్పటికీ జీ5 ఓటీటీ ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం చూడాలంటే జీ5 సబ్‍స్క్రిప్షన్ ఉండాలి. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా హిందీ వెర్షన్ కూడా జీ5లో రీసెంట్‍గా అందుబాటులో వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఉండగా.. జీ5లో హిందీ వెర్షన్ అడుగుపెట్టింది.
ఈ వారమే జీ5లో వనవాస్
జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో వనవాస్ సినిమా ఈ శుక్రవారం (మార్చి 14) స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‍లో నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ లీడ్ రోల్స్ చేశారు. గతేడాది డిసెంబర్ 20న ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం థియేటర్లలో విడుదలైంది. సుమారు మూడు నెలలకు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. వనవాస్ మూవీకి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం