



Best Web Hosting Provider In India 2024
Terrorists attack train: రైలుపై ఉగ్రవాదుల దాడి, హైజాక్; 100 మందికి పైగా బందీలు; దాడి ఎలా జరిగిందంటే?
Terrorists attack train: నైరుతి పాకిస్తాన్ లో మంగళవారం ప్యాసింజర్ రైలుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం, సుమారు 450 మంది ప్రయాణికులున్న ఆ రైలును హైజాక్ చేశారు. కాగా, ఉగ్రవాదులు సుమారు 100 మంది ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది.

Terrorists attack train: నైరుతి పాకిస్తాన్ లో మంగళవారం ప్యాసింజర్ రైలుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో రైలు డ్రైవర్ గాయపడ్డాడు. అనంతరం, 9 బోగీల్లో సుమారు 450 మంది ప్రయాణికులున్న ఆ రైలును హైజాక్ చేశారు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
క్వెట్టా నుంచి వెళ్తుండగా..
బలూచిస్థాన్ నైరుతి ప్రావిన్స్ లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 450 మంది ప్రయాణికులున్న ఆ రైలును హైజాక్ చేశారు. అయితే, డ్రైవర్ తో పాటు ప్రయాణికులపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, టెర్రరిస్ట్ ల కాల్పుల్లో డ్రైవర్ గాయపడగా, పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. కాగా, సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారని సమాచారం. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే వారిని చంపేస్తామని హెచ్చరించారని రాయిటర్స్ తెలిపింది.
బీఎల్ఏ పనే..
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే మిలిటెంట్ వేర్పాటువాద సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. భద్రతా సిబ్బందితో సహా పలువురు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నట్లు బీఎల్ఏ ఒక ప్రకటనలో పేర్కొంది. బందీలను రక్షించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. కాగా, ఈ సమాచారం తెలియడంతో ఘటనా స్థలం వద్దకు అదనపు భద్రతా బలగాలను పంపించారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలులో కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయని బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ స్థానిక మీడియా సంస్థ డాన్ కు తెలిపారు.
పాక్ మంత్రి ఆగ్రహం
రైలులోని 450 మంది ప్రయాణికులను ముష్కరులు బందీలుగా పట్టుకున్నారని ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని రైల్వే ప్రభుత్వ సీనియర్ అధికారి మహ్మద్ కాశీఫ్ తెలిపారు. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడిని ఖండించిన పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ అమాయక ప్రయాణికులపై కాల్పులు జరిపే మృగాలకు ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వదని స్పష్టం చేశారు.
ఈ దాడి ఎలా జరిగింది?
తొమ్మిది బోగీలున్న ఈ రైలును టన్నెల్ నెం.8లో సాయుధులు ఆపారని కంట్రోలర్ రైల్వేస్ మహ్మద్ కాశీఫ్ తెలిపారు. తిరుగుబాటుదారులు ప్యాసింజర్ రైలుపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో డ్రైవర్ గాయపడ్డారు. రైలులో ఉన్న సెక్యూరిటీ గార్డులు తిరిగి కాల్పులు జరిపారు.
బలూచ్ తీవ్రవాదులు
వనరులు సమృద్ధిగా ఉన్న బలూచిస్థాన్ లో స్వాతంత్య్రం లేదా అధిక స్వయంప్రతిపత్తి కోరుతూ వేర్పాటువాద గ్రూపులు దీర్ఘకాలంగా తిరుగుబాటు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో భద్రతా దళాలు, మౌలిక సదుపాయాలు, పౌరులపై పదేపదే దాడులు జరుగుతున్నాయి. బలూచిస్థాన్ కు స్వాతంత్య్రం కావాలని బీఎల్ ఏ కోరుతోంది. బలూచిస్తాన్ లోని గొప్ప గ్యాస్ మరియు ఖనిజ వనరులను అన్యాయంగా దోపిడీ చేస్తుందని ఆరోపిస్తూ దశాబ్దాలుగా దక్షిణాసియా దేశ ప్రభుత్వంతో పోరాడుతున్న అనేక జాతి తిరుగుబాటు సమూహాలలో ఇది అతిపెద్దది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link