Reasons For Stubborn Child: మీ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా? ఇందుకు మీరు చేసే ఈ 5 తప్పులే కారణమా.. చెక్ చేసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Reasons For Stubborn Child: మీ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా? ఇందుకు మీరు చేసే ఈ 5 తప్పులే కారణమా.. చెక్ చేసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Mar 11, 2025 07:30 PM IST

Parenting Mistakes Makes children Stubborn: మీ పిల్లలు చదువులో వెనకబడిపోవడానికి కారణం మీరు చేసే కొన్ని తప్పులే అంటే నమ్ముతారా? ఇది చదివాక నమ్మాలో లేదో మీరే నిర్ణయించుకోండి. మీరు కూడా అలాంటి తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే మానుకోండి. అలావాటు మార్చుకోండి.

పిల్లలను చదవడంలో ఆసక్తి చూపకపోవడానికి తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
పిల్లలను చదవడంలో ఆసక్తి చూపకపోవడానికి తల్లిదండ్రులు చేసే పొరపాట్లు (shutterstock)

మీ పిల్లలు చదువు అంటే ఆసక్తి చూపడం లేదా..? చదువుకోమన్న ప్రతిసారి రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారా? ఇందుకు కేవలం పిల్లలు మాత్రము కారణం అనుకుంటే పొరపాటే! తల్లిదండ్రుల తప్పులు కూడా ఇందుకు కారణం కావచ్చు. తల్లిదండ్రులుగా మీకు ఇది వింతగా అనిపించచ్చు, కాస్త బాధగా కూడా అనిపించవచ్చు. కానీ ఇది నిజంగా జరిగేదే.

వాస్తవానికి తల్లిదండ్రులు అంతా పిల్లలకు చక్కగా పెంచాలని, తమ పెంపకంలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదనే భావిస్వారు. కానీ ఈ ప్రయత్నంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. అవి పిల్లలకు చదువు మీద ఆసక్తి లేకుండా చేస్తాయి. చదువు, పుస్తకాల నుండి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు చేసే ఏ తప్పులు వారిని తోటి విద్యార్థులకన్నా చదువులో వెనుకబడి ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఉదయం ఆలస్యంగా లేపడం

ఉదయం ఆలస్యంగా నిద్రలేచే పిల్లలు తమ పనులను ప్రశాంతంగా చేసుకోలేరు. సమయం సరిపోక వాటిని సకాలంలో పూర్తి చేయడానికి తొందరపడతారు. దీనివల్ల తప్పులు జరిగే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు వారి మానసిక స్థితి చెడిపోతుంది, చదువులో ఆసక్తి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ఉదయాన్నే సకాలంలో లేపి, పాఠశాలకు సిద్ధం కావడంలో సహాయం చేయాలి. ఆలస్యంగా లేవడం వల్ల వారు ప్రతి విషయంలోనూ వెనుకబడి ఉంటారు. చదువు విషయంలో కూడా.

ఖాళీ కడుపుతో పాఠశాలకు పంపడం

చాలా మంది తల్లిదండ్రులు ఉదయాన్నే సమయం లేక పిల్లలను ఖాళీ కడుపుతోనే పాఠశాలకు పంపేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా పిల్లలకు చదువు మీద ఆసక్తి ఉండదు. ఆకలి పిల్లల దృష్టిని చదువు మీద లేకుండా చేస్తుంది. దీర్ఘకాలికంగా ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాంటి పిల్లలు ఎల్లప్పుడూ అలసటగా, నీరసంగా ఉంటారు. ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయడం అనేది పిల్లలకు పెద్దలకు కూడా తప్పనిసరి.

వాళ్ళని తిట్టి పాఠశాలకు పంపడం

ఉదయం సగం నిద్రలో ఉండటం వల్ల పిల్లలు సహజంగానే కొంత నీరసంగా, అసహనంగా ఉంటారు. కాస్త మొండిగా ప్రవర్తిస్తారు. అలాంటి సమయంలో స్కూలుకు సమయానికి పంపడానికి తల్లిదండ్రులు వారిని తొందరపెడుతుంటారు. వినకపోతే తిట్టడం కూడా చేస్తుంటారు. ఇది వారి మంచి కోసమే అయినప్పటికీ ఇలా చేయడం మంచిది కాదట. ఉదయాన్నే వారిని కోప్పడటం, తిట్టడం వంటివి చేయడం వల్ల పిల్లల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది చదువు మీద ఆసక్తిని తగ్గిస్తుంది. కాబట్టి వీలైనంత వరకూ పిల్లలను ఉదయం ప్రేమగా లేపండి, వారికి పాఠశాల, చదువు గురించిన ప్రాముఖ్యతను వివరించండి.

పిల్లల ముందే తగాదాలు పెట్టుకోవడం

పిలల విషయంలో చాలా మంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే.. ఉదయం లేవగానే పిల్లల ముందు తగాదాలు పెట్టుకోవడం. ఇది పిల్లల మానసిక, భావోద్వేగ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారిలో ఆందోళన, ఒత్తిడితో పాటు ప్రవర్తనా సమస్యలు వస్తాయి. అలాంటి పిల్లలకు చదువులో ఆసక్తి కూడా తగ్గుతుంది. ఎక్కువ సమయం ఒంటరిగా, ఒత్తిడితో గడుపుతారు లేదా చెడు అలవాట్లకు దగ్గర అవుతారు.

వారి ఫోన్ ఇచ్చి పని చేసుకోవడం

ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీబిజీగా గడుపుతూ పిల్లలు సైలెంట్ గా ఉండటానికి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. తినడానికి, పడుకోవడానికి కూడా ఫోన్ చేతిలో పెట్టి శ్రమ తప్పినట్లు ఫీలవుతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని తెలసుకోండి. అనేక అధ్యయనాల ప్రకారం.. అధిక స్క్రీన్ టైమ్ పిల్లల ఆరోగ్యం, కళ్ళు, మెదడుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి పిల్లలకు ఫోన్ ఇవ్వడానికి బదులుగా మీరు వారికి కొంత సమయం కేటాయించండి. ఆటలు, పాటలు వంటి వాటి మీదికి వారి దృష్టిని మళ్లించండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024