






Best Web Hosting Provider In India 2024

OTT Family Drama: మూడు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Family Drama: వనవాస్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు వారాలకు ఈ చిత్రం స్ట్రీమింగ్కు అడుగుపెడుతోంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించిన వనవాస్ చిత్రం గతేడాది డిసెంబర్ 20న విడుదలైంది. ఈ బాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా చిత్రానికి మంచి టాకే వచ్చింది. కుటుంబంలో బంధాలు, ఎమోషన్లు, సవాళ్ల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
వనవాస్ చిత్రం మార్చి 14వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అంటే మరో మూడు రోజుల్లో హోలీ సందర్భంగా ఈ మూవీ జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
మూడు నెలలకు..
వనవాస్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూశారు. అయితే, ఆల్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలలకు ఈ చిత్రం స్ట్రీమింగ్కు వస్తోంది. మార్చి 14 నుంచి ఈ ఫ్యామిలీ డ్రామాను జీ5లో చూడొచ్చు.
వనవాస్ మూవీలో నానా పటేకర్, ఉత్కర్ష్‌తో పాటు సిమ్రత్ కౌర్, కుష్బూ, అశ్వినీ కల్సేకర్, రాజేశ్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, మనీశ్ వాద్వా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కుటుంబంలోని బంధాలు, వివాదాలు, సవాళ్లు, భావోద్వేగాలతో తెరకెక్కించారు దర్శకుడు అనిల్ శర్మ. పిల్లల చేతిలో వృద్ధాప్యంలో మోసపోయే ఓ వ్యక్తి చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది.
వనవాస్ మూవీని జీ స్టూడియోస్, అనిల్ శర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై అనిల్ శర్మ, సుమన్ శర్మ ప్రొడ్యూజ్ చేశారు. మిథున్ మోంటీ శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాకు మంచి టాకే వచ్చినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. సుమారు రూ.6కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.
వనవాస్ స్టోరీలైన్
వృద్ధుడైన ప్రతాప్ సంఘానియా (నానా పటేకర్).. భార్య మరణంతో కుంగిపోతాడు. డెమెంటియా వ్యాధితో బాధపడుతుంటాడు. తన ఇంటిని ఓ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట రాయాలని నిర్ణయించుకుంటాడు. ఇది తెలిసి ప్రతాప్‌ను అతడి పిల్లలు మోసం చేస్తారు. ప్రతాప్‌ను వారణాసిలో వదిలేస్తారు. ఈ కష్టకాలంలో ప్రతాప్‌ను ఓ యువకుడు వీర్ (ఉత్కర్ష్ శర్మ) చేరదీస్తాడు. జాగ్రత్తగా చూసుకుంటాడు. వీర్‌తో ప్రతాప్‌కు బంధం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే అంశాల చుట్టూ వనవాస్ స్టోరీ సాగుతుంది. ఎమోషనల్‌గా ఈ చిత్రం ఉంటుంది. నానా పటేకర్, ఉత్కర్ష్ పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది.
సంబంధిత కథనం