



Best Web Hosting Provider In India 2024

లైంగిక జీవితం బాగుండాలంటే రాత్రిపూట ఎలాంటి దుస్తులు ధరించాలి?
Sleepwear For Better Intimacy: లైంగిక జీవితం బాగుండాలంటే రాత్రిపూట కొన్ని రకాల దుస్తులు ధరించాలట. మీరు ధరించే దుస్తులు మీ భాగస్వామితో చక్కటి అనుబంధానికి, ఆకర్షణకు ప్రాధాన్యతనిస్తాయి. మీ బంధాన్ని మరింత సుఖంగా మారుస్తాయి.

రాత్రిపూట నైటీలు, టీషర్టులు, పైజామాలు వేసుకుని పడుకోవడం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని ధరించడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. కానీ ఇలాంటి దుస్తులు మీ లైంగిక జీవితం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? వేసుకునే బట్టలు శారీరక సుఖం విషయంలో అంతటి ప్రభావం చూపుతాయా? అనే సందేహం మీలో కలిగి ఉండచ్చు. గతంలో ఇటువంటి ఆలోచన కూడా మీకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. రాత్రిపూట మీ కంఫర్ట్ కోసం మీరు వేసుకునే బట్టల వల్ల మీ భాగస్వామికి మీరు ఫిజికల్ పార్ట్‌నర్‌గా కాకుండా కేవలం స్లీపింగ్ పార్ట్‌నర్‌గా మాత్రమే అనిపిస్తారట.
అంటే మీరు పడుకునేటప్పుడు మీకు కంఫర్ట్ గా ఉండే బట్టలకు బదులుగా మీరు మరింత అందంగా కనిపించే వాటిని ధరించండి. అంటే నైటీలు, టీషర్ట్‌లు పైజామాలకు బదులుగా మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే దుస్తులను వేసుకోండి.
పైజామాలు వేసుకుంటే భాగస్వామిని ఆకర్షించలేమా?
లైంగిక సంబంధ నిపుణుల ప్రకారం.. ఆకర్షణ కంటే సౌకర్యాన్ని ఎంచుకోవడం సంబంధాలపై ప్రభావితం చూపిస్తుంది. ముందుగా ప్రతిఒక్కరూ పైజామాలు ‘రాత్రి దుస్తులు కాదు’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
‘‘దుస్తులు అనేవి ఒక సంకేతం. మీ దుస్తులు, మీ భాగస్వామితో ఉన్న అనుబంధానికి, ఆకర్షణకు ప్రాధాన్యతనిస్తాయి. చాలా సార్లు వారు మీ సరళమైన దుస్తులకు ప్రాధాన్యతనిస్తారు. ఆ కారణం చాలా చిన్నగా అనిపించినప్పటికీ, సంబంధాలపై ప్రభావం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇద్దరి మధ్య ఉండే ఆకర్షణ మరింత పెరుగుతుంది. దానికి అవసరమైన ఉద్రేకం, మోహం అనే భావనలు పెరుగుతాయి. కానీ, మీరు ధరించే వదులైన, సౌకర్యవంతమైన పైజామాలు ఈ ఫీలింగ్స్ కు అడ్డుగా నిలుస్తాయి. ఆకర్షణను ప్రేరేపించే దానికి బదులు విరుద్ధంగా పనిచేస్తాయి’’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పైజామా సమస్యకు పరిష్కారం
సుఖంగా ఉండే లోదుస్తులు ధరించడం అంటే భాగస్వామికి దూరం అవుతామా? లైంగిక నిపుణురాలు, ప్రొఫెసర్ అయిన మనస్తత్వవేత్త డాక్టర్ కాండిస్ నికోల్ హార్గోన్స్, సంభోగ సమయంలో మీ భాగస్వామిని ప్రేరేపించే మొదటి రెండు మార్గాలు చూడటం, తాకడం అని చెప్పారు. కాబట్టి, మీ భాగస్వామి ఆకర్షణీయంగా భావించే లోదుస్తులను ధరించడం వల్ల కోరికను పెంచుకోగలుగుతారట. మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చట. అదే సమయంలో కంఫర్ట్‌గా ఉండే దుస్తులు మీ కోరికల స్పార్క్‌ను తగ్గిస్తాయి.
మీరు, మీ భాగస్వామి దుస్తుల ఎంపిక విషయంలో ఇద్దరూ కలిసి సెలక్ట్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే, మీరు ఆకర్షణీయంగా కనిపించే దుస్తులను ఎంపిక చేసుకోండి. ఒకరంటే ఒకరికి ఎక్కువ ప్రేరణలు కలిగిస్తున్నారా అనేది గమనించండి. దానిని బట్టి రాత్రుళ్లు ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్ణయించుకోవచ్చు. మీరు గమనించిన తేడా మంచిదైతే దానిని ప్రతి రోజూ అమలు చేయవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పడం లేదు. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం