






Best Web Hosting Provider In India 2024

Tollywood: గోదావరిఖని బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీ – గులాబీ కోసం నిర్మాతగా మారిన దసరా డైరెక్టర్
Tollywood: దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రొడ్యూసర్‌గా మారారు. తొలి ప్రయత్నంగా ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి గులాబీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ లవ్‌స్టోరీకి శ్రీకాంత్ ఓదెల కథను అందిస్తుండటం గమనార్హం.

దసరా మూవీ ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రొడ్యూసర్‌గా మారుతోన్నారు.గోదావరిఖని సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీకి అల్ అమీనా జరియా రుక్సానా గులాబీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల కథను అందిస్తున్నారు. అంతే కాకుండా అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలతో కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. సినిమా ప్రొడక్షన్ కోసం సమ్మక్క సారక్క క్రియేషన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు శ్రీకాంత్ ఓదెల. ఈ బ్యానర్ మీదనే గులాబీ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు.
సరిహద్దు వెంట…
ఈ గులాబీ మూవీతో చేతన్ బండి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నల్లటి చీరలో ఒక అమ్మాయి సరిహద్దు వెంట నడుస్తోండటం కనిపిస్తోంది. దారిలో ఎర్ర గులాబీలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లుగా పోస్టర్‌ను వెరైటీగా డిజైన్ చేశారు.
గోదావరిఖని బ్యాక్‌డ్రాప్‌లో…
అల్ అమీనా జరియా రుక్సానా గులాబీ అనేది 2009లో గోదావరిఖని సిటీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన యథార్ఠ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఓ ప్రేమకథచిత్రమని మేకర్స్ చెబుతోన్నారు. ఓ యువతి ప్రేమ ప్రయాణానికి చక్కటి దృశ్యరూపంగా ఈ మూవీ ఉండబోతుందని తెలిపారు. ఓ అబ్బాయి ప్రేమ కోసం అమ్మాయి ఏం చేసింది? ఎలాంటి సాహసానికి సిద్ధపడిందన్నది ఆసక్తికరంగా ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
త్వరలో రెగ్యూలర్ షూటింగ్…
గులాబీ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు నిర్మాతలు వె ల్లడించారు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీలో హీరోహీరోయిన్లు ఎవరన్నది తొందరలోనే వెల్లడించనున్నారు.
ది ప్యారడైజ్ మూవీ…
దసరా మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దసరా తర్వాత మరోసారి నానితోనే ది ప్యారడైజ్ అనే సినిమా చేయబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఈ గ్లింప్స్ ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్‌లోని డైలాగ్స్ చర్చనీయాంశంగా మారాయి. యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
మెగాస్టార్ చిరంజీవితో…
ది ప్యారడైజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్నాడు. హీరో నాని ఈ మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవలే చిరంజీవి మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
సంబంధిత కథనం