





Best Web Hosting Provider In India 2024

AP Heatwave : ఏపీలో ఎండల తీవ్రత, రేపు ఈ మండలాల్లో వడగాల్పులు
AP Heatwave : ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నారు. రానున్న రెండు రోజులు 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు 180 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

AP Heatwave : ఏపీలో ఎండలు ముదురుతున్నాయి. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఎండ తీవ్ర పెరుగుతుందని అమరావతి వాతావరణ కేంద్ర తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.
రేపు 180 మండలాల్లో వడగాల్పులు
రేపు(మార్చి 12)న రాష్ట్రంలో పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 180 మండలాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని పేర్కొంది.
వడగాల్పులు వీచే మొత్తం మండలాలు- 180, శ్రీకాకుళం జిల్లా-18, విజయనగరం-21, మన్యం-3, అల్లూరి సీతారామరాజు-12, అనకాపల్లి-13, కాకినాడ-18, కోనసీమ-11, తూర్పుగోదావరి-19, పశ్చిమగోదావరి-4, ఏలూరు-16, కృష్ణా-10, గుంటూరు-14, బాపట్ల-3, పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నాయి.
తీవ్ర వడగాల్పులు వీచే మండలాలివే
బుధవారం కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు, పార్వతీపురం-మన్యం జిల్లాలో పార్వతీపురం,సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, శ్రీకాకుళం జిల్లా బూర్జ, లక్ష్మీనరసుపేట, హీరామండలం, విజయనగరం జిల్లా బొబ్బిలి, వంగర మండలాలతో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
తెలంగాణలో
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 గంటలు నుంచి ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఎండ, వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల్లో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిన సమయంలో బయటికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు కూడా చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టాపిక్