AP SC Categorization: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక, మూడు గ్రూపులుగా రిజర్వేషన్ల ప్రతిపాదన

Best Web Hosting Provider In India 2024

AP SC Categorization: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక, మూడు గ్రూపులుగా రిజర్వేషన్ల ప్రతిపాదన

Sarath Chandra.B HT Telugu Published Mar 12, 2025 07:16 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Mar 12, 2025 07:16 AM IST

AP SC Categorization: ఏపీలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటూ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదికను సమర్పించింది. ఈ మేరకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌ నివేదికను ప్రభుత్వానికి అందింది. ఎస్సీ ఏ విభాగంలో 1శాతం, బి విభాగంలో 6.5శాతం, సి విభాగంలో 7.5శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు.

ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు సమీక్ష (ఫైల్ ఫోటో)
ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు సమీక్ష (ఫైల్ ఫోటో)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

AP SC Categorization: ఆంధ‌్రప్రదేశ్‌లో రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి చేరింది. రాష్ట్రంలో  మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రా ప్రతిపాదించారు. ఇందులో  రెల్లి, ఉపకులాలకు 1 శాతంతో ఏ గ్రూపుగా,  మాదిగ, ఉపకులాలకు 6.5 శాతంతో బి గ్రూపుగా,  మాల, ఉపకులాలకు 7.5 శాతంతో సి గ్రూపుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. 

ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన సమయంలో ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా రిజర్వేషన్లను అమలు చేశారు. తాజాగా  కమిషన్  గతంలో ఎస్సీ  డీ కేటగిరీలో ఉన్న ఆది ఆంధ్ర మాదిగ, ఆది ఆంధ్ర మాలలను.. మాదిగ, మాల ఉపకులాల కిందకు చేర్చింది. దీంతో  మూడు కేటగిరీలుగాన రిజర్వేషన్లను అమలు చేయాలని కమిషన్‌ రిజర్వే షన్‌ల ను వర్తింప చేసింది. 

జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు…

ప్రతిపాదిత  రిజర్వేషన్లు ప్రతి  జిల్లా యూనిట్‌గా  వర్తింప చేయాలని కమిషన్‌ సూచించినట్లు తెలిసింది.  ఈ మేరకు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ తన నివేదికను సోమవారం రాత్రి సీఎస్ విజయానంద్‌కు  అందచేశారు.

గత ఏడాది  ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అమోదం తెలపడంతో రాష్ట్రంలో అమలు చేయాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.  ఈ నిర్ణయంతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఆలస్యమైంది. గత జులైలో రావల్సిన నోటిఫికేషన్ మార్చిలో వెలువడనుంది.

రిజర్వేషన్లను అమలు చేయాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరడంతో  రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల స్థితిగతుల అధ్య యనానికి రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు.  కమిషన్ దాదాపు మూడున్నర నెలలుగా అన్ని జిల్లాల్లో పర్యటించి నివేదిక సిద్ధం చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ…

 రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా కమిషన్‌  పర్యటించి మాల, మాదిగ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వివరాలు తీసు కుంది. కీలక ప్రాధాన్య శాఖల్లో ఎస్సీ ఉద్యోగుల వివరాలు, పదోన్నతుల తీరు తదితర వాటిని సేక రించింది. ఎస్సీల్లో ఉప వర్గాల వారీగా  ఆర్థిక స్థితిగతులను అంచనా వేసింది.  సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. 

కమిషన్‌ నివేదికపై  ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో త్వరలో  ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు.వారి అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత  అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. నేడో, రేపో ఈ ప్రకటన చేసే వీలుంది.  ప్రజా ప్రతినిధుల అభిప్రాయాల మేరకు సవరణు చేయాల్సి వస్తే అందుకు అనుగుణంగా  రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ గడువును కూడా పొడిగించారు. నివేదిక సమర్పించిన తర్వాత మరో  నెల రోజులు గడువును పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

త్వరలోనే నిర్ణయం…

ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం గత ఏడాది నవంబరు 15న రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అందులో కోరింది. గత ఏడాది నవంబరు 27న కమిషన్‌ తన విధులు ప్రారంభించింది.

కమిషన్‌ సమర్పించిన నివేదికను సీఎస్‌ మంగళవారం సీల్డ్‌ కవర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన కోసం పంపించారు. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోపే ఆయన మాల, మాదిగ, ఇతర ఎస్సీ ఉపకులాల ప్రతినిధులతో సమావేశమై  వర్గీకరణపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న కేబినెట్‌ ప్రత్యేక భేటీలో వర్గీకరణ అమలుపై తీర్మానం చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాaaలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

టాపిక్

Andhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsGovernment Of Andhra PradeshChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024